PoliticsSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nomula1e8f584b-2b94-438b-b020-2b0f8f76d8d3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nomula1e8f584b-2b94-438b-b020-2b0f8f76d8d3-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక విష‌యంలో కేసీఆర్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా న‌ల్గొండ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ఉప ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ కూడా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రు అనే ప్ర‌శ్న రాజ‌కీయ వ‌ర్గాల‌ను వేధిస్తోంది. అయితే మొద‌ట్నుంచి ఇక్క‌డ నోముల కుటుంబం నుంచి కాకుండా వేరొక‌రికి టికెట్ ఇస్తార‌న్న ప్ర‌చారం బ‌లంగా జ‌రుగుతోంది. దీంతో అనేక మంది ఆశావ‌హులు పోటీ ప‌డుతున్నారు. దాదాపు అధిష్ఠానం వ‌ద్ద‌కు వెళ్లిన వారు ప్ర‌ధానంగా ఆరుగురు ఉండ‌టం గ‌మ‌నార్హం. nomula;kcr;badugula lingaiah yadav;congress;mp;district;mlaనోముల కుటుంబానికే ఎమ్మెల్యే టికెట్‌... కేసీఆర్ ఆలోచ‌న‌ల్లో భ‌గ‌త్‌నోముల కుటుంబానికే ఎమ్మెల్యే టికెట్‌... కేసీఆర్ ఆలోచ‌న‌ల్లో భ‌గ‌త్‌nomula;kcr;badugula lingaiah yadav;congress;mp;district;mlaThu, 18 Mar 2021 11:01:36 GMTకేసీఆర్ ఓ నిర్ణ‌యానికి వ‌చ్చిన‌ట్లుగా న‌ల్గొండ రాజ‌కీయాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది. ఈ ఉప ఎన్నిక‌కు సంబంధించిన నోటిఫికేష‌న్ కూడా వ‌చ్చిన విష‌యం తెలిసిందే. ఈనేప‌థ్యంలో టీఆర్ ఎస్ అభ్య‌ర్థి ఎవ‌రు అనే ప్ర‌శ్న రాజ‌కీయ వ‌ర్గాల‌ను వేధిస్తోంది. అయితే మొద‌ట్నుంచి ఇక్క‌డ నోముల కుటుంబం నుంచి కాకుండా వేరొక‌రికి టికెట్ ఇస్తార‌న్న ప్ర‌చారం బ‌లంగా జ‌రుగుతోంది. దీంతో అనేక మంది ఆశావ‌హులు పోటీ ప‌డుతున్నారు. దాదాపు అధిష్ఠానం వ‌ద్ద‌కు వెళ్లిన వారు ప్ర‌ధానంగా ఆరుగురు ఉండ‌టం గ‌మ‌నార్హం. అయితే ఇందులో న‌లుగురు తీవ్రంగా ప్ర‌య‌త్నిస్తున్నారు. ప్ర‌త్య‌ర్థుల రాజ‌కీయ అడుగుల‌ను నిశితంగా ప‌రిశీలిస్తున్న ముఖ్య‌మంత్రి కేసీఆర్ బ‌ల‌మైన అభ్య‌ర్థి కావాల‌ని యోచిస్తున్నారంట‌.


ముందే ప్ర‌క‌టించ‌డం వ‌ల‌న అస‌మ్మ‌తి రాజ‌కీయం ఏర్ప‌డే అవ‌కాశం ఉంద‌ని యోచిస్తున్నారంట‌. అందుకే టికెట్ ప్ర‌క‌ట‌న విష‌యంలో ఆచితూచి వ్య‌వ‌హ‌రిస్తున్నార‌నే వాద‌న ఉంది. జానారెడ్డిని ఇప్ప‌టికే కాంగ్రెస్ ప్ర‌క‌టించిన నేప‌థ్యంలో ఆయ‌న్ను త‌ట్టుకునే స‌మీక‌ర‌ణాల‌తో అభ్య‌ర్థిని నిల‌బెట్టే ప్ర‌య‌త్నం చేస్తున్న‌ట్లుగా తెలుస్తోంది. అయితే ఈ ప‌రిస్థితుల్లో సానుభూతి ప్ర‌ధానాస్త్రంగా మారుతుంద‌ని కూడా కేసీఆర్ భావిస్తున్న‌ట్లు స‌మాచారం. కేసీఆర్ ఆలోచ‌న‌ల్లో నోముల భ‌గ‌త్ ఉన్న‌ట్లుగా జిల్లా రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చ జ‌రుగుతోంది.నోముల భ‌గ‌త్‌పై కొంత వ్య‌తిరేక‌త ఉన్నా... ప్ర‌స్తుత ప‌రిస్థితుల్లో అదేమంతా పెద్ద విష‌యం కాద‌ని భావిస్తున్నారంట‌. నోముల భ‌గ‌త్‌కే టికెట్ ద‌క్కే అవకాశాలు మెండుగా ఉన్నాయ‌ని ఆయ‌న అభిమానులు ప్ర‌చారం చేసుకుంటున్నారు.


ఇదిలా ఉండ‌గా నోముల భ‌గ‌త్‌కు చాలా మంది నేత‌లు స‌హ‌క‌రిస్తామ‌ని తీర్మానాలు చేస్తుండ‌టం గ‌మ‌నార్హం. తాజాగా ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య మృతి జిల్లాకు తీరనిలోట‌ని, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్ పేర్కొన్నారు. నర్సింహయ్య కుమారుడు భగత్‌కే నాగర్జున సాగర్‌ టికెట్‌ కేటాయించాలని సభలో తీర్మానం చేసిన అంశాన్ని అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి ఒప్పిస్తామని హామీ ఇచ్చారు. యాదవ సంఘాలు, కుల సంఘాల నాయకులు ముక్తకంఠంతో నోముల భగత్‌కు టికెట్‌ కేటాయించి ఏకగ్రీవం చేయాలని కోర‌డం విశేషం.‌


వాళ్ళను జగన్ క్షమించే అవకాశం లేనట్టే...?

మోడీ తీసేస్తే ఏంటీ.. మేము కొనసాగిస్తాం.. కేసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

విశాఖ ఉక్కు... అదానీ హ‌క్కు

విలన్ గా మారిన మెగా బ్రదర్.. అందుకోసమేనా?

అలాంటప్పుడు ఎన్నికలెందుకు.? ఓట్లు ఎందుకు..?.. సీఎం ఆగ్రహం..?

కాపు వేద‌న‌: పుర పోరులో కాపుల‌పై అంచ‌నాలు రివ‌ర్స్ ?

బాలయ్య సినిమా సీన్ రిపీట్.. నిజంగానే వెనక్కి పరిగెత్తిన రైలు.. వైరల్ వీడియో.?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>