MoviesMamatha Reddyeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soundarya469e5fd3-72df-4f3f-93f0-fa459262129d-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/soundarya469e5fd3-72df-4f3f-93f0-fa459262129d-415x250-IndiaHerald.jpgసౌందర్య ఈ పేరుకు ఒక చరిత్ర ఉంది. సౌందర్య అన్ని సినిమా పరిశ్రమలోని దాదాపుగా అన్ని భాషల్లో నటించిన మరియు అన్ని భాషల్లో అభిమానుల్ని సంపాదించినా ఏకైక నటి సౌందర్య. సావిత్రి తర్వాత మరో సావిత్రిని మనం చూస్తామా అని అనుకునేలోపే సౌందర్య నటన రూపంలో ఆ సావిత్రి అంత స్థాయి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం విశేషం.soundarya;soundarya;savitri;cinema;cinema theater;history;kannada;husband;heroine;savithri 1;aamaniసౌందర్య ఎందుకు గ్లామర్ షో చేయదో కారణం చెప్పిన ఓ ప్రముఖ నటి అది విన్నాక సౌందర్య పై గౌరవం పెరగడం ఖాయం.సౌందర్య ఎందుకు గ్లామర్ షో చేయదో కారణం చెప్పిన ఓ ప్రముఖ నటి అది విన్నాక సౌందర్య పై గౌరవం పెరగడం ఖాయం.soundarya;soundarya;savitri;cinema;cinema theater;history;kannada;husband;heroine;savithri 1;aamaniThu, 18 Mar 2021 15:00:00 GMTసౌందర్య ఈ పేరుకు ఒక చరిత్ర ఉంది. సౌందర్య అన్ని సినిమా పరిశ్రమలోని దాదాపుగా అన్ని భాషల్లో నటించిన మరియు అన్ని భాషల్లో అభిమానుల్ని సంపాదించినా ఏకైక నటి సౌందర్య. సావిత్రి తర్వాత మరో సావిత్రిని మనం చూస్తామా అని అనుకునేలోపే సౌందర్య నటన రూపంలో ఆ సావిత్రి అంత స్థాయి పేరు ప్రఖ్యాతులు సంపాదించడం విశేషం. మాతృభాష కన్నడ అయిన కూడా సుమారు వివిధ భాషల్లో కలిపి వందకి పైగా చిత్రాల్లో సౌందర్య నటించింది. సౌందర్యను చూస్తుంటే అచ్చ తెలుగు అమ్మాయిలాగా మన తెలుగు వారు కలుపుకున్నారు. సౌందర్య సినిమా వస్తుందంటే ఒక పద్దతి గల పాత్రలో ఒదిగిపోతూ చక్కని నటనని కనబరుస్తు ఒక మంచి చిత్రం చూశామని తృప్తితో  ప్రేక్షకులు థియేటర్ నుండి బయటికి వెళ్లేవారు. ఇక హీరోయిన్స్ లలో గ్లామర్ షోకు దూరంగా ఉన్న వాళ్లలో సౌందర్య కూడా ఒకరు. సౌందర్య గ్లామర్ షోలకు వెళ్లకుండా వచ్చిన పాత్రలు చేసుకుంటూ ముందుకు వెళ్లారు.

సౌందర్య అప్పట్లో ఆమని తో దగ్గరగా ఉండేవారు. ప్రస్తుతం ఆమని 'చావు కబురు చల్లగా' అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంబంధించి ఓ ఇంటర్వ్యూ లో భాగంగా సౌందర్య విషయం వచ్చినపుడే ఆమె ఎందుకు  గ్లామర్ షో చేయలేదని అసలు కారణాన్ని చెప్పారు.

ఈ క్రమంలో సౌందర్య స్నేహితురాలైన ప్రముఖ నటి ఆమని సౌందర్య గ్లామర్ షో చేయకపోవడానికి గల కారణాలను వివరించారు. ఒక రోజు షూటింగ్ సమయంలో ఆమని సౌందర్య ను ఎక్సపోజింగ్  విషయం గురించి అడిగారట. దానికి సౌందర్య "మనకి పెళ్ళై భర్త పక్కన ఉన్నపుడు గ్లామర్ షో చేసిన సినిమాలను వాళ్ళు  చూస్తున్నపుడు ఎలా అనిపిస్తుంది. అది బాగుండదు" కదా అంటూ సమాధానం చెప్పారని ఈ విషయం ఆమని ఒక ఇంటర్వ్యూ లో తెలిపారు." ఇక అప్పటినుంచి సౌందర్య గ్లామర్ షో వైపే వెళ్లలేదని వచ్చిన పాత్రల్లో ఒదిగిపోతూ మంచి నటన కనబరిచేదని ఆమె అన్నారు. ఆలా తెలుగు ప్రేక్షకుల మనసుల్లో చోటు సంపాదించుకున్న సౌందర్య అకాల మరణం ఇప్పటికి జీర్ణించుకోలేనిది.


వకీల్ సాబ్ బ్లాక్ బస్టర్ హిట్ అవుతుందని చెప్పడానికి ప్రధాన కారణం అదేనటా...

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?

2021-22కు తెలంగాణ బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Mamatha Reddy]]>