PoliticsVAMSIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/college-course-info3b3b2c12-f43c-4133-841b-5cc59298517c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/college-course-info3b3b2c12-f43c-4133-841b-5cc59298517c-415x250-IndiaHerald.jpgమాములుగా మనకు కాలేజీ విద్యలో భాగంగా సైన్స్ మరియు ఆర్ట్స్ గ్రూపులు ఉండేవి. సైన్స్ లో వచ్చే సరికి ఎంపీసీ మరియు బైపీసీ ఉండేవి. అలాగే ఆర్ట్స్ గ్రూప్ లో తీసుకుంటే సీఈసీ, హెచ్ఈసి లాంటి విభాగాలు ఉండేవి. ఇలా మరి కొన్ని సబ్జెక్టు లు కొన్ని కొన్ని కాలేజీలలో ఉంటాయి. అయితే ఈ విద్యకు సంబంధించిన కోర్సులపై ప్రస్తుతం ఒక వివాదం నిన్నటి నుండి కొనసాగుతూ ఉంది. college course info;bharatiya janata party;kadapa;kanna lakshminarayana;degree;college;partyకాలేజీలలో ఆ కోర్సులకు ఇక శుభం కార్డు పడనుందా ...!కాలేజీలలో ఆ కోర్సులకు ఇక శుభం కార్డు పడనుందా ...!college course info;bharatiya janata party;kadapa;kanna lakshminarayana;degree;college;partyThu, 18 Mar 2021 11:00:00 GMTకాలేజీ విద్యలో భాగంగా సైన్స్ మరియు ఆర్ట్స్ గ్రూపులు ఉండేవి. సైన్స్ లో వచ్చే సరికి ఎంపీసీ మరియు బైపీసీ ఉండేవి. అలాగే ఆర్ట్స్ గ్రూప్ లో తీసుకుంటే సీఈసీ, హెచ్ఈసి లాంటి విభాగాలు ఉండేవి. ఇలా మరి కొన్ని సబ్జెక్టు లు కొన్ని కొన్ని కాలేజీలలో ఉంటాయి. అయితే ఈ విద్యకు సంబంధించిన కోర్సులపై ప్రస్తుతం ఒక వివాదం నిన్నటి నుండి కొనసాగుతూ ఉంది. అదేమిటంటే ఈ ఆర్ట్స్ కి సంబంధించిన కోర్సులను ప్రభుత్వం నెమ్మదిగా పక్కన పెట్టబోతోందా అనే సందేహాన్ని లేవనెత్తారు భారతీయ జనతా పార్టీ నాయకుడు రమేష్ నాయుడు. ఇప్పుడు ఈ అంశం తీవ్ర చర్చకు దారితీస్తోంది. అసలు విషయం ఏమిటంటే ప్రభుత్వ డిగ్రీ కళాశాల్లో 30 శాతం కన్నా తక్కువ అడ్మిషన్ లు ఉన్న కోర్సులను మూసేస్తున్నారని చెబుతున్నారు. దీనిని ప్రామాణికంగా తీసుకుంటే ముఖ్యంగా ఎంపీసీ, బిజెడ్సి, బిఎ కోర్సులు మూతపడిపోతున్నాయని సమాచారం.

విద్యార్థులు అంతా మూడు విడతల్లో ఆన్లైన్ అడ్మిషన్ లను పూర్తి చేసుకుని, మూడు నెలలు కష్టపడి చదివిన తరువాత ఇప్పుడు ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఒత్తిడి కారణంగా ఈ విధంగా నిర్ణయం తీసుకోవడం  సమంజసం కాదని  విద్యార్థులు విలపిస్తున్నారు. ఎంపీసీ తెలుగు మీడియం చదవడానికి మొత్తం కడప జిల్లాలో ఎక్కడా అందుబాటులో లేదు. తద్వారా ఎంపీసీ ఇంగ్లీష్ మీడియం మరియు బిఎ కోర్సులు పూర్తిగా మూతపడడానికి సిద్ధంగా ఉన్నాయి. సివిల్స్ కానీ, ఎస్ ఎస్ సి కానీ హై బిపిఎస్ మరియు గ్రూప్ 1 2 3 లాంటి సర్వీస్ కమిషన్ పరీక్షల తరువాత టీచర్ మరియు లెక్చరర్ ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వాలనుకుంటున్న విద్యార్థులు ఇవి నిరాశను మిగల్చనున్నాయి.

కంప్యూటర్ కోర్సులకు తప్ప మిగతా ఏ విధమైన కోర్సులకు భవిష్యత్తు అనేది లేకుండా చేస్తున్నారు. మాములుగా యూజీసీ నిబంధనల ప్రకారం ఏ కోర్సులో అయినా గ్రామీణ ప్రాంతంలో అడ్మిషన్ శాతం 20 కన్నా తక్కువ మరియు పట్టణ ప్రాంతాలలో 25 శాతం కన్నా తక్కువ ఉన్నప్పుడు మాత్రమే ఆ కోర్సును సదరు విద్యా సంవత్సరానికి మాత్రమే మూసివేయగలరు.  అంతే కానీ సగం సిలబస్ పూర్తయిన తరువాత అర్ధాంతరంగా నిలిపివేసే హక్కు ఎవరికీ లేదంటున్నారు. ఇదంతా చూసిన తరువాత చదువుకునే స్వేచ్ఛను లేకుండా చేస్తున్నారు. ప్రభుత్వమే ఈ కోర్సులు పెట్టిన తరువాత, వాళ్లే ఉద్యోగాలు కల్పిస్తారా...? అలా కానప్పుడు ఎందుకు ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకోవడం అని విద్యార్థి సంఘాలు మరియు సామాజిక నాయకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఏమి జరగనుందో...ప్రభుత్వం ఏమి చేస్తుందో చూడాలి.


వాళ్ళను జగన్ క్షమించే అవకాశం లేనట్టే...?

మోడీ తీసేస్తే ఏంటీ.. మేము కొనసాగిస్తాం.. కేసిఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు..?

విశాఖ ఉక్కు... అదానీ హ‌క్కు

విలన్ గా మారిన మెగా బ్రదర్.. అందుకోసమేనా?

అలాంటప్పుడు ఎన్నికలెందుకు.? ఓట్లు ఎందుకు..?.. సీఎం ఆగ్రహం..?

కాపు వేద‌న‌: పుర పోరులో కాపుల‌పై అంచ‌నాలు రివ‌ర్స్ ?

బాలయ్య సినిమా సీన్ రిపీట్.. నిజంగానే వెనక్కి పరిగెత్తిన రైలు.. వైరల్ వీడియో.?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VAMSI]]>