PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-chandra-babu-telangana-assembly-14b81154-41e9-4c95-bfc7-0c5c47d78532-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/kcr-chandra-babu-telangana-assembly-14b81154-41e9-4c95-bfc7-0c5c47d78532-415x250-IndiaHerald.jpgతెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బాబు పేరు ప్రస్తావించారు. నిరుద్యోగ భృతి విషయంలో ఆవేశపడి వెనక్కి తగ్గారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ప్రయత్నించారని, కొన్ని నెలలు మాత్రమే నిరుద్యోగులు లబ్ధిపొందారని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ భృతి విషయంపై స్పందించిన కేసీఆర్, చంద్రబాబు ఉదాహరణ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగ భృతిని అమలులో పెట్టి తిరిగి ఆపేశాయని అన్నారు. అసలు తెలంగాణలో భృతి ఇవ్వాలా, వద్దా అని ఆలోచిస్తkcr, chandra babu, telangana assembly,;kcr;amala akkineni;telangana rashtra samithi trs;telangana;government;cm;chief minister;mancherialతెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన..తెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన..kcr, chandra babu, telangana assembly,;kcr;amala akkineni;telangana rashtra samithi trs;telangana;government;cm;chief minister;mancherialThu, 18 Mar 2021 07:00:00 GMTతెలంగాణ అసెంబ్లీలో చంద్రబాబు ప్రస్తావన వచ్చింది. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా బాబు పేరు ప్రస్తావించారు. నిరుద్యోగ భృతి విషయంలో ఆవేశపడి వెనక్కి తగ్గారని అన్నారు. చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు నిరుద్యోగ భృతి ఇవ్వడానికి ప్రయత్నించారని, కొన్ని నెలలు మాత్రమే నిరుద్యోగులు లబ్ధిపొందారని అన్నారు. తెలంగాణలో నిరుద్యోగ భృతి విషయంపై స్పందించిన కేసీఆర్, చంద్రబాబు ఉదాహరణ చెప్పారు. ఇతర రాష్ట్రాల్లో కూడా నిరుద్యోగ భృతిని అమలులో పెట్టి తిరిగి ఆపేశాయని అన్నారు. అసలు తెలంగాణలో భృతి ఇవ్వాలా, వద్దా అని ఆలోచిస్తున్నామని చెప్పారు. గత ఎన్నికల్లో టీఆర్ఎస్ ఎన్నికల హామీలో నిరుద్యోగ భృతి కూడా ఉంది.

కరోనా వల్ల రాష్ట్ర ప్రభుత్వంపై లక్ష కోట్ల రూపాయల భారం పడిందని, ప్రత్యక్షంగా రూ.50 వేల కోట్ల నష్టం వచ్చిందని అసెంబ్లీలో చెప్పారు సీఎం కేసీఆర్. అయినా ఉద్యోగులకు రెండు, మూడు రోజుల్లో గౌరవప్రదమైన పీఆర్‌సీ ప్రకటిస్తామని చెప్పారు. వేతనాల విషయంలో ఉద్యోగులు గర్వపడేలా చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.

ఇక తెలంగాణలో కరోనా కేసుల కలకలంపై కూడా కేసీఆర్ అసెంబ్లీలో స్పందించారు. "కరోనా కేసులు మహారాష్ట్రలో పెరుగుతున్నాయి. విదేశాల్లో సెకండ్‌ వేవ్‌ వచ్చి తగ్గుతోంది. మన వద్ద ఇంకా సెకండ్‌ వేవ్‌ రాలేదు. అయినా గత వారం రోజులుగా రాష్ట్రంలో కేసులు పెరుగుతున్నాయి. కరోనా వ్యాప్తిపై ఇప్పటికే ఓ కన్నేసి ఉంచాం. అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వైద్య, ఆరోగ్య శాఖ అప్రమత్తంగా ఉంది. దేశంలో ఇతర రాష్ట్రాలతో పోల్చి చూస్తే తెలంగాణ పరిస్థితి మెరుగ్గా ఉంది. కొన్ని గురుకుల హాస్టళ్లలో, మంచిర్యాల పాఠశాలలో కరోనా కేసులు ఎక్కువగా వచ్చాయి. పాఠశాలలు కొనసాగించాలా? వద్దా? అనే అంశంపై రెండు మూడ్రోజుల్లో చెబుతాం. పిల్లలకు హాని జరగనివ్వం." అని అన్నారు కేసీఆర్.

ప్రభుత్వం హామీ ఇచ్చినట్లుగా రుణమాఫీని 100 శాతం అమలు చేసి తీరతామన్నారు సీఎం కేసీఆర్. గతేడాది రూ.25 వేల లోపు రుణం ఉన్న 3-4 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేశామని అన్నారు. మిగతా వారికి కూడా అమలు చేస్తామని స్పష్టం చేశారు. పంజాబ్‌, రాజస్థాన్‌, మధ్యప్రదేశ్‌ రాష్ట్రాల్లో రుణమాఫీ హామీ ఇచ్చి అమలుచేయలేదని, తాము మాత్రం కచ్చితంగా అమలు చేసి తీరతామన్నారు కేసీఆర్. 


హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ మీద ప్రేమ పెరిగిపోయిందా ?

ఎన్నికల ఫలితాలపై ఈ విశ్లేషణ చూస్తే టీడీపీ నేతలకు కొండంత ఉరట..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ, జనసేన పొత్తుకు ఎల్లోమీడియా అవస్తలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు జరిగిందే చంద్రబాబుకూ జరుగుతుందా ?

ఆ హీరో పై అసహనం వ్యక్తం చేసిన కలెక్షన్ కింగ్... కారణం అదే!

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>