PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/good-news-cheppina-kendram-addenti-kastalaku-check7468b58e-b4db-4afc-a2f9-b6d842847ded-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/good-news-cheppina-kendram-addenti-kastalaku-check7468b58e-b4db-4afc-a2f9-b6d842847ded-415x250-IndiaHerald.jpgవలస కార్మికులు.. భారత దేశం ఎదుర్కొంటున్న అతి పెద్ద సమస్య. ఉన్న ప్రాంతంలో ఉపాధి దొరకదు. పోషణ కోసం ఉపాధి వెదుక్కుంటూ వెళ్లాల్సిరావడమే ఈ వలస కార్మికుల వ్యవస్థకు ప్రధాన కారణం. ఈ వలస కార్మికుల కష్టాలు దారుణం. కుటుంబాలకు దూరంగా నెలల తరబడి శ్రమిస్తుంటారు వీరు. మొన్నటి కరోనా కారణంగా ఈ వలస కార్మికుల కష్టాలు వెలుగులోకి వచ్చాయి. ఆ సమయంలో వలస కార్మికులు కిలోమీటర్ల కొద్దీ నడిచివెళ్లిన తీరు ఎందరినో కదిలించింది. అలాంటి వలస కార్మికులకు ఇప్పుడు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెబుతోంది. వలస కార్మికులు, అల్పాదాయ వర్గాలుgood news;prime minister;minister;cheque;good news;service;local language;application;central government;good newwzగుడ్‌ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం? అద్దెంటి కష్టాలకు చెక్..!గుడ్‌ న్యూస్ చెప్పిన కేంద్ర ప్రభుత్వం? అద్దెంటి కష్టాలకు చెక్..!good news;prime minister;minister;cheque;good news;service;local language;application;central government;good newwzThu, 18 Mar 2021 07:00:00 GMT

అలాంటి వలస కార్మికులకు ఇప్పుడు కేంద్రం ఓ గుడ్ న్యూస్ చెబుతోంది. వలస కార్మికులు, అల్పాదాయ వర్గాలు, నిరుపేదల కోసం కేంద్ర ప్రభుత్వం అద్దె ఇళ్ళ సముదాయాలు నిర్మించే పథకాన్ని ప్రారంభించనుందట. ఈ విషయాన్ని గృహ నిర్మాణ శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి బుధవారం రాజ్యసభలో వెల్లడించారు. కార్మికులతోపాటు వీధుల్లో విక్రయాలు జరిపేవారు, రిక్షా కార్మికులు, సేవ రంగంలో పని చేసే కార్మికులు, పారిశ్రామిక కార్మికులు, మార్కెట్లు, వాణిజ్య సంస్థల్లు, విద్యా, ఆరోగ్య, హోటల్ రంగాలలో పని చేస్తున్న వారంతా ఈ పథకం కింద లబ్ది పొందే అవకాశం ఉంది.


ఈ అద్దె ఇళ్ళ సముదాయాల్లో నివసించే కార్మికులకు వాటిని నిర్వహించే యజమానులకు మధ్య కొన్ని నియమ నిబంధనలకు లోబడి ఒప్పందం చేసుకోవలసి ఉంటుంది. అద్దె గృహ సముదాయలలో వాటి నిర్వహణ బాధ్యతలు చూసే ఏజెన్సీ షరతుల మేరకు వసతి అలాట్‌మెంట్‌ చేస్తారు. అద్దె గృహ సముదాయాలు నిర్మించే కంపెనీ స్థానిక పరిశ్రమలు, సర్వీసు ప్రొవైడర్లు, ఇతర సంస్థలతో ఒప్పందం చేసుకోవలసిందిగా ప్రభుత్వం సూచించిస్తోంది. దీని వలన అద్దె వసూళ్ళలో అవరోధాలు నివారించే కూడా ఉందని ప్రభుత్వం అంటోంది. ఉపాధి కోసం పట్టణాలకు వలస వచ్చేకార్మికులు కోసం చౌకగా అద్దె వసతి కల్పించే ఉద్దేశంతో ప్రారంభించిన ఈ పథకాన్ని రెండు విధాలుగా చేపడతారు.


వీటిలో మొదటిది...జేఎన్‌యూఆర్‌ఎం, రాజీవ్‌ ఆవాస్‌ యోజన పథకాల కింద ప్రభుత్వ నిధులతో నిర్మించి సిద్ధంగా ఉన్న నివాసాలను 25 ఏళ్ళపాటు అద్దె గృహ సముదాయాల కింద మారుస్తారు.  రెండో మోడల్‌లో సొంతంగా భూమి కలిగి ఉండి వాటిలో గృహ సముదాయాలు నిర్మించి, నిర్వహించడానికి ఆసక్తి కలిగిన ప్రభుత్వ, ప్రైవేట్‌ సంస్థల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తారు. ఈ రెండో మోడల్‌ గృహ సముదాయాల నిర్మాణానికి ప్రధాన మంత్రి ఆవాస్‌ యోజన్‌ - అర్బన్‌ పథకం కింద నిధులను సమకూరుస్తారు.




హెరాల్డ్ సెటైర్ : నిమ్మగడ్డ మీద ప్రేమ పెరిగిపోయిందా ?

ఎన్నికల ఫలితాలపై ఈ విశ్లేషణ చూస్తే టీడీపీ నేతలకు కొండంత ఉరట..?

హెరాల్డ్ ఎడిటోరియల్ : టీడీపీ, జనసేన పొత్తుకు ఎల్లోమీడియా అవస్తలు ?

హెరాల్డ్ ఎడిటోరియల్ : జగన్ కు జరిగిందే చంద్రబాబుకూ జరుగుతుందా ?

ఆ హీరో పై అసహనం వ్యక్తం చేసిన కలెక్షన్ కింగ్... కారణం అదే!

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>