Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/gambhir-praised-butler-on-his-battingdc39ceed-6795-4c36-8f5d-e8418f7ffc07-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/gambhir-praised-butler-on-his-battingdc39ceed-6795-4c36-8f5d-e8418f7ffc07-415x250-IndiaHerald.jpgఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్‌ బట్లర్‌ను అవుట్ చేయడం సాధారణ విషయం కాదని, అతడి విజృంభణను అడ్డుకోవడం ఎవరితరం కాదని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ అన్నాడు. బట్లర్ అసాధారణ ఆటగాడని, వరల్డ్‌ టీ20 బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌లలో అతడు కూడా ఒకడని చెప్పుకొచ్చాడు. బట్లర్ ఫామ్‌లో ఉంటే అతడిని నిరోధించే సత్తా ఏ బౌలర్‌‌కూ లేదని ప్రశంసలు..gambhir;kumaar;gautham new;gautham;virat kohli;hardik pandya;bharatiya janata party;mp;english;interview;icc t20;bhubaneswarఅతడిని అవుట్ చేసే సత్తా మన బౌలర్లకు లేదట..అతడిని అవుట్ చేసే సత్తా మన బౌలర్లకు లేదట..gambhir;kumaar;gautham new;gautham;virat kohli;hardik pandya;bharatiya janata party;mp;english;interview;icc t20;bhubaneswarThu, 18 Mar 2021 14:08:00 GMTఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌ వికెట్‌కీపర్‌ బ్యాట్స్‌మెన్‌ జోస్‌ బట్లర్‌ను అవుట్ చేయడం సాధారణ విషయం కాదని, అతడి విజృంభణను అడ్డుకోవడం ఎవరితరం కాదని టీమిండియా మాజీ ఓపెనర్, బీజేపీ ఎంపీ గౌతమ్ గంభీర్‌ అన్నాడు. బట్లర్ అసాధారణ ఆటగాడని, వరల్డ్‌ టీ20 బెస్ట్‌ బ్యాట్స్‌మన్‌లలో అతడు కూడా ఒకడని చెప్పుకొచ్చాడు. బట్లర్ ఫామ్‌లో ఉంటే అతడిని నిరోధించే సత్తా ఏ బౌలర్‌‌కూ లేదని ప్రశంసలు కురిపించాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గంభీర్.. బట్లర్‌ను ఆకాశానికెత్తేశాడు. 'జోస్‌ బట్లర్ ఆట అద్భుతం. అతడు అసాధారణ ఆటగాడు. నాకు తెలిసి రోహిత్‌ శర్మతో పాటు వరల్డ్‌ టీ20 బెస్ట్‌ బ్యాటర్లలో బట్లర్‌ పేరు కూడా ప్రముఖంగా వినిపిస్తుంది. బట్లర్‌ ఒక మంచి ఇంగ్లిష్‌ వైట్‌బాల్ బ్యాట్స్‌మన్‌ అని ఇయాన్‌ బెల్‌ ఇప్పుడే అన్నారు. వాస్తవానికి ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాట్స్‌మెన్‌ అని నా అభిప్రాయం. ఫాస్ట్‌ బౌలర్లు అయినా, స్పిన్నర్లు అయినా తను వెనక్కి తగ్గడు. తను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే అతడిని ఆపడం ఏ బౌలర్‌ తరం కాదు' అని గంభీర్ పేర్కొన్నాడు.

మూడో టీ20లో టీమిండియా స్టార్‌ పేసర్ జస్ప్రీత్‌ బుమ్రా లేని లోటు స్పష్టంగా కనిపించిందని గంభీర్‌ అన్నాడు. శార్దూల్‌ ఠాకూర్‌, భువనేశ్వర్‌ కుమార్, హార్దిక్ పాండ్యా వంటి బౌలర్లకు జోస్ బట్లర్‌ను ఆపే సత్తా లేదని కుండబద్దలు కొట్టాడు. ఇక మిడిలార్డర్ బ్యాట్స్‌మన్ సూర్యకుమార్ యాదవ్‌ను మూడో టీ20 నుంచి తొలగించడంపై గంభీర్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. స్కైను తప్పించిన విరాట్ కోహ్లీ నిర్ణయం తనకు ఆశ్చర్యాన్ని కలిగించిందన్నాడు. అతనికి బదులు ఇంకెవరినైనా పక్కన పెట్టి ఉంటే బాగుండేదని సలహా ఇచ్చాడు. ‘మరో ఏడు నెలల్లో టీ20 ప్రపంచకప్ ఆడాల్సి ఉంది.

ఈ సందర్భంలో ఇలాంటి నిర్ణయాలు కచ్చితంగా జట్టును దెబ్బతీస్తాయి. స్కై పూర్తి ఫిట్‌గా ఉన్నాడు. అతని బ్యాటింగ్ తీరు చూసిందీ లేదు. మరి అలాంటపుడు అతడిని ఎలా పక్కకు పెడతారు. ప్రపంచకప్ సమయంలో నాలుగు, ఐదో స్థానంలో అతడు కీలక బ్యాట్స్‌మన్. అతడు గాయపడితే ఎవరినైనా బ్యాకప్ ప్లేయర్ ఉంచుకోవాలి. అయ్యర్ స్థానంలో ఆడే ఆటగాడు ఎవరనేది ఆలోచించారా?. ఇప్పటికే ఆ స్థానంలో మరో ఆటగాడిని ప్రయత్నించాలి. మూడు, నాలుగు మ్యాచ్లు సూర్యకు అవకాశం ఇచ్చి అతడు ఎలా ఆడతాడో చూడాలి. ఒకవేళ మెరుగైన ప్రదర్శన చేస్తే నాలుగో స్థానంలో ఓ బ్యాట్స్మెన్ దొరికినట్లే. కోహ్లీకి ఈ ఆలోచన ఎందుకు చేయలేదో అర్థం కాలేద'ని గంభీర్ పేర్కొన్నాడు.

ఇదిలా ఉంటే టీమిండియాతో అహ్మదాబాద్‌లో జరిగిన మూడో టీ20లో ఇంగ్లండ్‌ ఘనవిజయం సాధించిన సంగతి తెలిసిందే. 8 వికెట్ల తేడాతో ఆతిథ్య జట్టును ఓడించి ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి వెళ్లింది. ఈ మ్యాచ్‌లో అద్భుత ప్రదర్శన కనబరిచిన బట్లర్‌ (52 బంతుల్లో 83 నాటౌట్‌ 5 ఫోర్లు, 4 సిక్సర్లు) 'ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌'గా నిలిచాడు. ఇక ఈరోజు(గురువారం) జరగనున్న నాలుగో టీ20లో ఇంగ్లండ్‌ను మట్టికరిపిస్తేనే భారత్‌కు సిరీస్‌ ఆశలు మిగులుతాయి. మూడో టీ20లో ఓడి ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-2తో వెనుకబడ్డ కోహ్లీసేన మెరుగైన ప్రదర్శన చేయాలని పట్టుదలగా ఉంది. 2-2తో సమం చేసి సిరీస్‌ ఫలితాన్ని చివరి మ్యాచ్‌కు తీసుకెళ్లాలని కసితో ఉంది.


హైకోర్ట్ కు చంద్రబాబు..పిటిషన్ దాఖలు..!!

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?

2021-22కు తెలంగాణ బ‌డ్జెట్ ఎన్ని కోట్లో తెలుసా...




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>