PoliticsGullapally Venkatesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/ycp-leaders-wrong-decitions-big-headache-to-jagan-df859c92-76fc-46b2-bf06-aba143a33712-415x250-IndiaHerald.jpgఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా వరకు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఆయన ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుని చాలా వరకు రెడీగా ఉన్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో ఎమ్మెల్యేలు ఎక్కువగా విఫలం కావడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కాస్త కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. కొంతమంది అధికారులు కూడా సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించి మంత్రులకు jagan,ycp,ap;amala akkineni;bhavana;gautham new;gautham;hyderabad;jagan;andhra pradesh;mekapati goutham reddy;media;chief minister;minister;reddy;party;mantraజగన్ సంచలన నిర్ణయమేనా ఇది...?జగన్ సంచలన నిర్ణయమేనా ఇది...?jagan,ycp,ap;amala akkineni;bhavana;gautham new;gautham;hyderabad;jagan;andhra pradesh;mekapati goutham reddy;media;chief minister;minister;reddy;party;mantraThu, 18 Mar 2021 09:00:00 GMTఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రి వైయస్ జగన్ సంక్షేమ కార్యక్రమాల విషయంలో చాలా వరకు సీరియస్ గా ఉన్న సంగతి తెలిసిందే. సంక్షేమ కార్యక్రమాల అమలుకు సంబంధించి ఆయన ఇప్పటికే కొన్ని ప్రతిపాదనలు కూడా సిద్ధం చేసుకుని చాలా వరకు రెడీగా ఉన్నారు. అయితే సంక్షేమ కార్యక్రమాల ప్రచారం విషయంలో ఎమ్మెల్యేలు ఎక్కువగా విఫలం కావడంతో ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ కాస్త కఠినంగానే ముందుకు వెళ్లే అవకాశాలు ఉండవచ్చు అనే భావన రాజకీయ వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి.

కొంతమంది అధికారులు కూడా సంక్షేమ కార్యక్రమాల ప్రచారానికి సంబంధించి మంత్రులకు సహకరించడం లేదనే ఆరోపణలు వినపడుతున్నాయి. అయితే ఇప్పుడు ముఖ్యమంత్రి ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. సోషల్ మీడియాలో సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించి పార్టీ టీమ్లను ఏర్పాటు చేసే ఆలోచనలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉన్నారు అని రాజకీయ వర్గాలు అంటున్నాయి. ఈ బృందాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలు బలంగా ప్రజల్లోకి తీసుకు వెళ్లే అవకాశం ఉందని అందరూ భావిస్తున్నారు.

దీనికి సంబంధించి ఇప్పటికే ఒక ప్రత్యేక ప్రణాళికను కూడా మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా బాధ్యతల విషయంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డికి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కీలక బాధ్యతలు ఇచ్చారు. ఈ నేపథ్యంలోనే సోషల్ మీడియాలో సంక్షేమ కార్యక్రమాలు ఏ విధంగా ప్రచారం చేయాలి ఏంటి అనే దానిపై ఆయన ఇప్పుడు కొంత మందికి దిశానిర్దేశం కూడా చేస్తున్నట్లుగా తెలుస్తోంది. అధికారులు కొంతమంది సహకరించకపోవడంతో ఇప్పుడు మేకపాటి గౌతమ్ రెడ్డి కొంతమంది ద్వారా ముందుకు వెళ్తున్నారు అని సమాచారం. హైదరాబాద్ కు చెందిన ఒక ప్రముఖ కంపెనీ తో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి చర్చలు జరుపుతున్నారని అయితే ఈ  టీం లను రాష్ట్ర ప్రభుత్వం తరఫున కాకుండా పార్టీ తరఫున ఏర్పాటు చేసి నిధులు సమకూర్చాలని జగన్ ఆదేశించినట్లు సమాచారం.


ఈ నిజం ప‌సుపు బ్యాచ్ ఎప్ప‌టికి తెలుసుకుంటుందో ?

కాపు వేద‌న‌: పుర పోరులో కాపుల‌పై అంచ‌నాలు రివ‌ర్స్ ?

బాలయ్య సినిమా సీన్ రిపీట్.. నిజంగానే వెనక్కి పరిగెత్తిన రైలు.. వైరల్ వీడియో.?

మోడీ బాట‌లో.. రామోజీ.. ఏం చేస్తున్నారో తెలుసా ?

ఆ ప‌ద‌వి రెడ్ల‌కే ఇవ్వాలి... వైసీపీలో యుద్ధం మొద‌లైంది..!

కారు దూసుకెళ్తోందిగా... హైద‌రాబాద్‌లో వాణి... న‌ల్గొండలో ప‌ల్లా ముందంజ‌

గోదావ‌రి ఎమ్మెల్సీ విజేత ఎవ‌రంటే... వైసీపీ ఎమ్మెల్య‌కు ప‌రాభ‌వం




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Venkatesh]]>