Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/batting-coach-rathore-supported-kl-rahul-in-his-lack-of-form81a42be4-88eb-41d9-a261-f24f137f5a5c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/libra_libra/batting-coach-rathore-supported-kl-rahul-in-his-lack-of-form81a42be4-88eb-41d9-a261-f24f137f5a5c-415x250-IndiaHerald.jpgఒకటి, సున్నా, సున్నా.. ఇవి మూడు టీ20ల్లో భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ స్కోర్లు. దీంతో అతడి ఫాంపై అనేకమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాహుల్‌కు ఫాం లేకపోయినా అతడిని జట్టులో కొనసాగించాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే రాహుల్‌ను టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్‌ రాథోడ్‌ మాత్రం వెనకేసుకొచ్చారు. కేవలం మూడు ఇన్నింగ్స్‌లలో సరిగ్గా ఆడనంత మాత్రాన రాహుల్ ఫాంను తక్కువ అంచనా వేయలేమని, అతడు టీమిండియా తరపున టీ20ల్లో..rahul;rahul new;rahul;yajamanya;k l rahul;cricket;rahul sipligunj;icc t20;paruguఒక్క షాట్‌తో రాహుల్‌కు ఫాంలోకి వస్తాడా.. బ్యాటింగ్ కోచ్ అతి నమ్మకమా..?ఒక్క షాట్‌తో రాహుల్‌కు ఫాంలోకి వస్తాడా.. బ్యాటింగ్ కోచ్ అతి నమ్మకమా..?rahul;rahul new;rahul;yajamanya;k l rahul;cricket;rahul sipligunj;icc t20;paruguThu, 18 Mar 2021 18:25:00 GMTఅహ్మదాబాద్‌: ఒకటి, సున్నా, సున్నా.. ఇవి మూడు టీ20ల్లో భారత బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ స్కోర్లు. దీంతో అతడి ఫాంపై అనేకమంది ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. రాహుల్‌కు ఫాం లేకపోయినా అతడిని జట్టులో కొనసాగించాన్ని కూడా వ్యతిరేకిస్తున్నారు. అయితే రాహుల్‌ను టీమిండియా బ్యాటింగ్ కోచ్ విక్రమ్‌ రాథోడ్‌ మాత్రం వెనకేసుకొచ్చారు. కేవలం మూడు ఇన్నింగ్స్‌లలో సరిగ్గా ఆడనంత మాత్రాన రాహుల్ ఫాంను తక్కువ అంచనా వేయలేమని, అతడు టీమిండియా తరపున టీ20ల్లో ఇప్పటికీ అత్యుత్తమ బ్యాట్స్‌మన్ అని కొనియడాడు.

రాహుల్‌ను తక్కువ చేసి చూడాల్సిన అవసరం లేదని, ప్రతి ఆటగాడి కెరీర్‌లో ఓ పేలవ దశ ఉంటుందని, ప్రస్తుతం రాహుల్ అలాంటి దశలోనే ఉన్నాడనివ రాథోడ్ చెప్పుకొచ్చాడు. ‘40కి పైగా సగటుతో 145 స్ట్రైక్‌రేట్‌తో పరుగులు చేశాడు. మూడు మ్యాచ్‌ల్లో విఫలమైనప్పటికీ టీ20 జట్టు అత్యుత్తమ ఆటగాడు ముమ్మాటికీ రాహులేనని చెబుతానం’టూ రాథోడ్ చెప్పుకొచ్చాడు.

రాహుల్‌కు ప్రస్తుతం అందరి మద్దతు అవసరమని, అతడు గడ్డు పరిస్థితుల నుంచి బయటకు వస్తాడనే నమ్మకంతో ఉన్నామని అన్నాడు. కొంతకాలంగా అతను క్రికెట్‌ ఆడకుండా ఉండడం కూడా పరుగులు చేయలేకపోవడానికి ఓ కారణంగా కనిపిస్తోందని, అందుకే అతడితో మైదానంలో బాగా ప్రాక్టీస్ చేయిస్తున్నామని రాథోడ్ వివరించాడు. ‘చాలా కాలం క్రికెట్ ఆడకపోవడం వల్ల కొందరు ఆటగాళ్లు ఫాం కోల్పోయారు. అలాంటి ఆటగాళ్లతో నెట్స్‌లో, మైదానంలోని పిచ్‌లపై ప్రాక్టీస్‌ చేయిస్తూనే ఉన్నాం. రాహుల్ కూడా తీవ్రంగా శ్రమిస్తున్నాడు. అతడిపై ప్రత్యేకంగా దృష్టి సారించాం’ అంటూ రాథోడ్ చెప్పుకొచ్చాడు.

రాహుల్ కేవలం ఒక్క ఇన్నింగ్స్‌ లేదా ఒక్క షాట్‌తో తిరిగి ఫామ్‌లోకి వస్తాడనే నమ్మకం తనకుందని రాథోడ్ అభిప్రాయపడ్డాడు. జట్టు యాజమాన్యం కూడా అతడిపై ఇప్పటికీ అదే నమ్మకంతో ఉందని రాథోడ్ చెప్పారు. మరి కోచ్ రాథోడ్ మాటలతోనైనా రాహుల్ ఆటతీరులో ఏమైనా మార్పు వస్తుందా..? లేక మళ్లీ పేలవ ప్రదర్శన చేసి ఆయనది అతి నమ్మకమని తేల్చేస్తాడో తెలియాలంటే మరికొద్ది గంటల్లో తేలిపోతుంది.


ఇక పిచ్ గురించి, బ్యాటింగ్ గురించి కూడా రాథోడ్ మాట్లాడారు. పిచ్‌ బౌన్స్‌కు సహకరిస్తుండడం, అది కూడా ఓ క్రమ పద్ధతిలో లేకపోవడంతో తొలిగా బ్యాటింగ్ చేసిన జట్టు పోటీనిచ్చే స్కోరు చేయలేకపోతోందని అన్నాడు. తొలి ఇన్నింగ్స్‌లో ఎన్ని పరుగులు చేస్తే అది మంచి స్కోరో చెప్పడం కూడా కష్టంగా ఉందని చెప్పాడు. అయితే నాలుగో టీ20లో మాత్రం తొలుత బ్యాటింగ్‌ చేసినా మంచి ప్రదర్శనతో గెలవడానికి కృషి చేస్తామని రాథోడ్ ధీమా వ్యక్తం చేశారు.


అనిల్ రావిపూడి వరుస విజయాల వెనక ఇంత పెద్ద కథ ఉందా..??

సర్దార్ గబ్బర్ సింగ్ లాగా వకీల్ సాబ్ కాదు కదా ??సెన్సార్ టాక్ చుస్తే అలానే ఉంది ??

బడ్జెట్ 2021 : బడ్జెట్ లో పట్టణాభివృద్దికి పెద్ద పీఠ వేసిన ప్రభుత్వం !!

అమరావతి భవితవ్యం తేలేది అప్పుడే...?

బడ్జెట్ 2021 : డబుల్ బెడ్ రూం ఇళ్ల కోసం 11 వేల కోట్లు..!!

బడ్జెట్ 2021 : ఈ ఏడాది నుండి అమల్లోకి డిజిటల్ భూ సర్వే ..!!

విశాఖ వైసీపీలో మేయర్ చిచ్చు.. రాజీనామా దిశగా...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>