PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-target-three-lakhs-majority-in-tirupati-bypoll4336e82a-d4d5-4ab4-9314-ee95b9c2acab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/ysrcp-target-three-lakhs-majority-in-tirupati-bypoll4336e82a-d4d5-4ab4-9314-ee95b9c2acab-415x250-IndiaHerald.jpgతిరుపతి బై ఎలక్షన్స్ లో 3 లక్షల ఓట్ల మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మూడున్నర లక్షలు సాధిస్తామంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు. అయితే వైసీపీకి ఇవన్నీ చాలా చిన్న టార్గెట్లు అంటున్నారు స్థానిక నాయకులు. అంతకు మించి మెజార్టీ సాధిస్తామంటున్నారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి రాజకీయాలకు కొత్తే అయినా, జగన్ పేరు, ఫ్యాను గుర్తుపై.. ఈజీగా పాస్ మార్కులు తెచ్చుకోవడం ఖాయం. వైసీపీ గెలుపుపై కాదు, ఇప్పుడందరి దృష్టి మెజార్టీపైనే ఉంది. ysrcp, tirupati bypoll,;editor mohan;lakshmi;srihari;tara;tiru;bharatiya janata party;jagan;anam ramanarayana reddy;janasena;congress;2019;peddireddy ramachandra reddy;hushaaru;tirupati;parliment;mla;minister;election;doctor;husband;tdp;local language;ycp;janasena party;reddy;panabaka lakshmiవైసీపీకి అది చాలా చిన్న టార్గెట్..వైసీపీకి అది చాలా చిన్న టార్గెట్..ysrcp, tirupati bypoll,;editor mohan;lakshmi;srihari;tara;tiru;bharatiya janata party;jagan;anam ramanarayana reddy;janasena;congress;2019;peddireddy ramachandra reddy;hushaaru;tirupati;parliment;mla;minister;election;doctor;husband;tdp;local language;ycp;janasena party;reddy;panabaka lakshmiWed, 17 Mar 2021 09:00:00 GMTతిరుపతి బై ఎలక్షన్స్ లో 3 లక్షల ఓట్ల మెజార్టీ సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి. మూడున్నర లక్షలు సాధిస్తామంటూ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి చెబుతున్నారు. అయితే వైసీపీకి ఇవన్నీ చాలా చిన్న టార్గెట్లు అంటున్నారు స్థానిక నాయకులు. అంతకు మించి మెజార్టీ సాధిస్తామంటున్నారు. తిరుపతి వైసీపీ అభ్యర్థి డాక్టర్ గురుమూర్తి రాజకీయాలకు కొత్తే అయినా, జగన్ పేరు, ఫ్యాను గుర్తుపై.. ఈజీగా పాస్ మార్కులు తెచ్చుకోవడం ఖాయం. వైసీపీ గెలుపుపై కాదు, ఇప్పుడందరి దృష్టి మెజార్టీపైనే ఉంది.

2019 సార్వత్రిక ఎన్నికల్లో తిరుపతి లోక్ సభ స్థానానికి పోటీ చేసిన వైసీపీ అభ్యర్థి బల్లి దుర్గా ప్రసాదరావుకి వచ్చిన ఓట్లు 7,22,877. గతంలోకంటే ఇది ఎక్కువ. అయితే టీడీపీ అభ్యర్థి, మాజీ మంత్రి పనబాక లక్ష్మికి 4,94,501 ఓట్లు వచ్చాయి. వైసీపీ మెజార్టీ  2,28,376ఓట్లు. కాంగ్రెస్ అభ్యర్థి చింతా మోహన్ కి కేవలం 24,039 ఓట్లు వచ్చాయి. బీజేపీ తరపున బరిలో దిగిన బొమ్మి శ్రీహరి రావుకి అంతకంటే తక్కువగా 16,125 ఓట్లు వచ్చాయి. ఇక జనసేన సపోర్ట్ తో నిలబడిన బీఎస్పీ అభ్యర్థి డాక్టర్ దిగుమర్తి శ్రీహరిరావు కాస్త మెరుగ్గా 20,971 ఓట్లు తెచ్చుకున్నారు. నేరుగా జనసేన అభ్యర్థి బరిలో దిగి ఉంటే.. అంతకంటే ఎక్కువ ఓట్లు వచ్చి ఉండేవని చెబుతారు. అయితే ఈసారి బీజేపీ, జనసేన రెండు పార్టీలు కలసి పోటీ చేస్తున్నాయి. పాత లెక్కల్ని బేరీజు వేసుకుంటే.. బీజేపీ నిలబెట్టే ఉమ్మడి అభ్యర్థికి 40వేల ఓట్లు రావాల్సి ఉంటుంది. కానీ... బీజేపీ మాత్రం గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తోంది. విజయం సాధించకపోయినా, ఏపీలో వైసీపీకి తామే ప్రత్యామ్నాయం అని చెప్పేలా ఫలితాలు ఉంటాయని అంటున్నారు. అంటే కచ్చితంగా టీడీపీని దాటేస్తామనే ధీమా వారిలో ఉంది.

ఇక టీడీపీ విషయానికొస్తే అభ్యర్థి పనబాక లక్ష్మి హుషారుగా ఎన్నికల బరిలో దిగేలా కనిపించడంలేదు. అభ్యర్థిత్వం ఖరారైన తర్వాత ఆమె ఇప్పటి వరకూ ఎక్కడా ప్రచారం జోలికి వెళ్లలేదు. ఓటమి ఖాయంగా తెలుస్తున్న వేళ, పోటీ చేయడం కూడా ఆమెకు ఇష్టం లేదని సమాచారం. ఈ దశలో టీడీపీ కాడె పడేస్తే ఆ ఓట్లు బీజేపీకి పడతాయనే గ్యారెంటీ లేదు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన వైసీపీ.. తిరుపతి పార్లమెంట్ సెగ్మెంట్ పరిధిలో కూడా మంచి ఫలితాలు సాధించింది. అదే ఊపులో లోక్ సభ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించే అవకాశం ఉంది. దాదాపుగా ఇక్కడ 4లక్షల మెజార్టీ వచ్చే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకుల అంచనా. 


మహిళ నా..మజాకానా.. నడిరోడ్డు లో భర్తకు దేహశుద్ది..

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?

బాబుకు సీఐడీ పెట్టిన ఆ 7 షరతులేంటో తెలుసా.. తేడా వస్తే అరెస్టేనా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>