PoliticsN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prostitution-hyderabad0e00ea0d-f9e2-4f38-9dca-72e5b325b1d0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/prostitution-hyderabad0e00ea0d-f9e2-4f38-9dca-72e5b325b1d0-415x250-IndiaHerald.jpgపోలీసులు ఎన్ని కఠిన చర్యలు తీసుకున్న వ్యభిచార నిర్వహణ కేసులు బట్టబయలు అవుతూనే ఉన్నాయి. హైదరాబాద్ కేంద్రంగా సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్న కొంత మంది ముఠా నిర్వాహకులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళిక, సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు.prostitution, hyderabad;deepika;ravi anchor;hyderabad;bangladesh;west bengal - kolkata;devineni avinash;police;nagarkurnool;february;arrest;sex;traffic police;news;central governmentహైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు..!హైదరాబాద్‌లో వ్యభిచార ముఠా గుట్టు రట్టు..!prostitution, hyderabad;deepika;ravi anchor;hyderabad;bangladesh;west bengal - kolkata;devineni avinash;police;nagarkurnool;february;arrest;sex;traffic police;news;central governmentWed, 17 Mar 2021 21:00:00 GMTహైదరాబాద్ కేంద్రంగా సెక్స్ రాకెట్‌ను నిర్వహిస్తున్న కొంత మంది ముఠా నిర్వాహకులను రాచకొండ పోలీసులు అరెస్ట్ చేశారు. పక్కా ప్రణాళిక, సమాచారంతో దాడులు నిర్వహించి నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కొంత మంది వ్యక్తులు ముఠాలుగా ఏర్పడి వ్యభిచారం నిర్వహిస్తున్నారు. రాచకొండలోని సాయి దుర్గా లాడ్జిలో బంగ్లాదేశ్, పశ్చిమ బెంగాల్, అసోం, తదితర ప్రాంతాలకు చెందిన మహిళలను వ్యభిచార రొంపిలో లాగి.. సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నారు. మానవ రవాణాకు వ్యతిరేకంగా సెక్స్ వర్కర్లను తీసుకొచ్చి ఈ సీక్రెట్ దందా కొనసాగిస్తున్నారు. ఎల్‌బీనగర్ పోలీసులు, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ బృందం సంయుక్తాధ్వర్యంలో సాయిదుర్గా లాడ్జిపై దాడులు నిర్వహించారు. నిర్వాహకులతోపాటు, విటులు, సెక్క్ వర్కర్లను పట్టుకుని అరెస్ట్ చేశారు. అనంతరం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

సాయి దుర్గా లాడ్జిలోని గదుల్లో అనైతిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారని పోలీసులకు సమాచారం అందింది ఈ మేరకు అక్కడ కొందరు అనుమానాస్పద వ్యక్తులను గుర్తించారు. రిసెప్షన్‌లో ఇద్దరు వ్యక్తులు కనిపించడంతో, విచారణ చేయగా వారు తమ పేర్లను సాయి దుర్గా లాడ్జ్ యజమాని అయిన దేసినేని వెంకటేశ్వర్ రావు, మాండ్లా అవినాష్ అని తెలిపారు. నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన దేశినేని వెంకటేశ్వర్ రావు, చార్మినార్‌కి చెందిన సకిజాన్ ఖాతున్ @ దీపిక @ రేష్మా, మహబూబ్‌నగర్ జిల్లాకు చెందిన మండ్ల అవినాష్, మీర్‌పేట్‌కు చెందిన రవి, ఖమ్మం జిల్లాకు చెందిన గుగులోతు సుజాతలు ఈ ముఠాలో మెయిన్‌ సభ్యులుగా ఉన్నారు. వీరంతా సీక్రెట్‌గా సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు పోలీసులు తెలుసుకున్నారు.

వీరిలో నాగర్ కర్నూల్ జిల్లాకు చెందిన దేశినేని వెంకటేశ్వర్ రావు లాడ్జిలో పర్యవేక్షకుడిగా విధులు నిర్వహిస్తున్నాడు. వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తూ ఇప్పటికే భారీగా లాభాలను పొందాడు ఫిబ్రవరి నెలలోలో సాయి దుర్గా లాడ్జ్‌ను రూ. 75 వేలకు లీజుకు తీసుకున్నాడు. అప్పటి నుంచి చట్టవ్యతిరేకమైన కార్యకలాపాలను నిర్వహిస్తూ డబ్బులు సంపాదించుకుంటున్నాడు. జంటలకు గదులు ఇవ్వడం.. వారి నుంచి రూ.300 నుంచి రూ. 500 వరకు డబ్బులు వసూలు చేయడం చేస్తున్నాడు. మిగతా ఇద్దరు కూడా ఇందులోనే గదులు అద్దెకు తీసుకొని వ్యభిచారం నిర్వహిస్తున్నారు. కాగా, వీరిపై గతంలో కూడా కేసులు నమోదై ఉన్నాయి. మీర్‌పేట్ పోలీసులు వ్యభిచార నిర్వహణ కేసులో అరెస్టు కూడా చేశారు. కాగా, పది రోజుల కిందట బెయిల్‌పై విడుదలైన వీరు తిరిగి వ్యాపారాన్ని నిర్వహిస్తుండటంతో పోలీసులు సమాచారం తెలుసుకుని తిరిగి అరెస్ట్ చేశారు.


భారత్ కు బ్రిటన్ ప్రధాని... కచ్చితంగా చైనాకు దెబ్బే...?

ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

నాని 'శ్యామ్ సింగరాయ్' లో మరో స్టార్ హీరో..హిట్ కాంబో రిపీట్ కానుందా..??

కత్రినా కైఫ్‌ డేటింగ్, అఫైర్.. రెడ్ హ్యాండెడ్‌గా ప్రియుడితో..?

వామ్మో .... ఆర్ఆర్ఆర్, వీరమల్లు పేర్లు చెపితేనే భయపడుతున్నారట .....??

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>