MoviesSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-nagababue57505d6-e063-4055-bedf-d05d13d39474-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/ntr-nagababue57505d6-e063-4055-bedf-d05d13d39474-415x250-IndiaHerald.jpgకొణిదెల నాగబాబు... ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలోకి మెగాస్టార్ తమ్ముడిగా ప్రవేశం చేసినాగాని తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. కానీ హీరోగా కొన్ని సినిమాలు చేసినాగాని అనుకున్న పేరు రాలేదు. కానీ గుర్తింపు అయితే దక్కింది. ఆయన సినీ జీవితంలో హీరోగా, నిర్మాతగా, సహాయ నటుడిగా ఎన్నో రకాల పాత్రలలో నటించి అందరిని మెప్పించాడు.అలాగే రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులతో ముచ్చటిntr -nagababu;chiranjeevi;ntr;jeevitha rajaseskhar;jr ntr;tollywood;jabardasth;television;konidela production;hero;nandamuri taraka rama rao;father;nagababu;reddy;josh;aravinda sametha veera raghava;adirindi;narappaజూనియర్ ఎన్టీఆర్ పై నాగబాబు సంచలన కామెంట్స్.. !!జూనియర్ ఎన్టీఆర్ పై నాగబాబు సంచలన కామెంట్స్.. !!ntr -nagababu;chiranjeevi;ntr;jeevitha rajaseskhar;jr ntr;tollywood;jabardasth;television;konidela production;hero;nandamuri taraka rama rao;father;nagababu;reddy;josh;aravinda sametha veera raghava;adirindi;narappaWed, 17 Mar 2021 18:00:00 GMTకొణిదెల నాగబాబు... ఈ పేరుకి పెద్దగా పరిచయం అక్కర్లేదు అనే చెప్పాలి. సినీ ఇండస్ట్రీలోకి మెగాస్టార్ తమ్ముడిగా ప్రవేశం చేసినాగాని తనకంటూ ఒక  ప్రత్యేకమైన గుర్తింపును దక్కించుకున్నారు మెగా బ్రదర్ నాగబాబు. కానీ హీరోగా కొన్ని సినిమాలు చేసినాగాని అనుకున్న పేరు రాలేదు. కానీ గుర్తింపు అయితే దక్కింది. ఆయన సినీ జీవితంలో  హీరోగా, నిర్మాతగా, సహాయ నటుడిగా ఎన్నో రకాల పాత్రలలో నటించి అందరిని మెప్పించాడు.అలాగే రాజకీయాల్లో కూడా అడుగుపెట్టారు. ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటారు. అభిమానులతో ముచ్చటిస్తూ ఉంటారు. అలాంటి నాగబాబు టాలీవుడ్ స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్‌పై  షాకింగ్ కామెంట్ చేశారు.



 ఆ వివరాలు మీకోసం నాగబాబు మెగాస్టార్ చిరంజీవి నటించిన ‘రాక్షసుడు' అనే సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయ్యారు. ఆ తర్వాత నిర్మాతగానూ మారి పదుల సంఖ్యలో చిత్రాలను నిర్మించారు. ఈ టీవీ ఛానెల్‌లో ప్రసారం అయిన జబర్ధస్త్‌ షో ద్వారా బుల్లితెరపైకి ఎంట్రీ ఇచ్చారు. దాదాపు ఏడేళ్లు పాటు దానికి జడ్జ్‌గా పని చేశారు. జబర్దస్త్ షో ఆయనకి మంచి గుర్తింపును తెచ్చి పెట్టింది. ఈ షో ద్వారా నాగబాబుకు స్మైలింగ్ స్టార్, టవర్ స్టార్ అనే పేర్లు వచ్చాయి. చాలా ఏళ్ల పాటు జబర్ధస్త్ షోకు జడ్జ్‌గా వ్యవహరించిన మెగా బ్రదర్ నాగబాబు.. కొద్ది రోజుల క్రితం ఆ షోకు గుడ్‌బై చెప్పేశారు. అదే సమయంలో మరో ఛానెల్‌లో ‘అదిరింది' అనే షో కు జడ్జి గా వెళ్లారు. అదిరింది, బొమ్మ అదిరింది అంటూ రెండు సీజన్ల పాటు సాగిన ఈ షో ప్రస్తుతానికి ప్రసారం అవడం లేదు. ఇతర కార్యక్రమాలతో ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్‌గా ఉంటారు మెగా బ్రదర్ నాగబాబు.ఈ క్రమంలోనే  తన కెరీర్‌కు సంబంధించిన విషయాలతో పాటు వ్యక్తిగత విశేషాలను కూడా ఫ్యాన్స్‌తో పంచుకుంటుంటారు.


తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్ ద్వారా ఫాలోవర్లతో లైవ్ చాట్ నిర్వహించారు నాగబాబు.  ఈ సందర్భంగా నెటిజన్లు అడిగిన చాలా ప్రశ్నలకి తన దైన శైలిలో జవాబులు ఇచ్చారు.  ఈ సందర్భంగా ఒక నెటిజన్ జూనియర్ ఎన్టీఆర్ గురించి చెప్పమంటే ఊహించని రీతిలో  కామెంట్ చేశారు. ఈ చాట్‌లో ఓ నెటిజన్ ‘వీరరాఘవ గురించి చెప్పు నారప్ప రెడ్డి' అని ప్రశ్నించాడు. ఆ ప్రశ్నకి సమాధానంగా నాగబాబు ఇలా జవాబు ఇచ్చాడు. ‘ఇప్పటి తరం నటుల్లో టార్చ్‌ బేరర్' అంటూ అనూహ్యమైన కామెంట్ చేశారు నాగబాబు. వేరే ఫ్యామిలీకి చెందిన హీరోని పొగుడుతూ ఆయన చేసిన కామెంట్స్ పై నెటిజన్లు  ప్రశంసలు కురిపిస్తున్నారు. నాగబాబు, జూనియర్ ఎన్టీఆర్ ఇద్దరు కలిసి ‘అరవింద సమేత.. వీరరాఘవ'లో తండ్రి కొడుకులుగా నటించారు.. ఏది ఏమి అయిన నాగబాబు చేసిన కామెంట్స్ కి అభిమానులు అందరు ఫుల్ జోష్ లో ఉన్నారు.. !


ఆ సింగర్ భర్తకు గోల్డెన్ ఛాన్స్ ఇచ్చిన గీతా ఆర్ట్స్..!!!

బికినీలో దర్శనమిచ్చిన శివగామి..! కాకపోతే..?!

శర్వాకు నేనున్నా అంటున్న చిరంజీవి...?

జమ్మలమడుగు వైసీపీలో ముసలం.. చైర్ పర్సన్ ఎంపిక ముందు షాక్ !

హెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?

మహేష్ బాబు వాట్సాప్ కి నందమూరి బాలకృష్ణకి మధ్య సంబంధం ఏంటో తెలుసా?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>