Viralyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/paraglidinga33175b1-82e3-4cba-8653-150004c29626-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/viral/127/paraglidinga33175b1-82e3-4cba-8653-150004c29626-415x250-IndiaHerald.jpg అడ్వెంచర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ అడ్వెంచర్స్ చేయాలని అనుకుంటారు. అలాగే ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే అడ్వెంచర్ చేయాలనే ఆలోచన మనసులో ఉంటే సరిపోదు. ధైర్యంగా ముందుకెళ్లగలిగే సత్తా కూడా ఉండాలి. లేకపోతే నవ్వులపాలైపోతారు. తాజాగా ఓ అమ్మాయి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. వెకేషన్ కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చిన ఆ యువతి అక్కడ..paragliding;heart;girlపారా గ్లైడింగ్ చేస్తూ ఆ అమ్మాయి చేసిన పనికి..పారా గ్లైడింగ్ చేస్తూ ఆ అమ్మాయి చేసిన పనికి..paragliding;heart;girlWed, 17 Mar 2021 12:26:00 GMTఇంటర్నెట్ డెస్క్: అడ్వెంచర్స్ అంటే ఎవరికి ఇష్టం ఉండదు. ప్రతి ఒక్కరూ అడ్వెంచర్స్ చేయాలని అనుకుంటారు. అలాగే ఎంజాయ్ చేయాలని అనుకుంటారు. అయితే అడ్వెంచర్ చేయాలనే ఆలోచన మనసులో ఉంటే సరిపోదు. ధైర్యంగా ముందుకెళ్లగలిగే సత్తా కూడా ఉండాలి. లేకపోతే నవ్వులపాలైపోతారు. తాజాగా ఓ అమ్మాయి ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంది. వెకేషన్ కోసం హిమాచల్ ప్రదేశ్‌కు వచ్చిన ఆ యువతి అక్కడ పారా గ్లైడింగ్ చేయాలని అనుకుంది. దానిని చూడగానే ఎంతో ముచ్చట పడింది. వెంటనే గ్లైడింగ్‌కు సిద్ధమైంది. అయితే తీరా గ్లైడింగ్‌కు రెడీ అయి గాలిలో ఎగరగానే ఆమె మైండ్ సెట్ పూర్తిగా మారిపోయింది.

హిమాచల్ ప్రదేశ్‌లోని ఖజియార్‌ ప్రాంతం పారా గ్లైడింగ్‌కు మంచి స్టాప్. అక్కడ గ్లైడింగ్ చేసేందుకు ఓ యువతి వెళ్లింది. అందరూ గాలిలో ఎగురుతుంటూ ఆమెకు చాలా థ్రిల్లింగ్‌గా అనిపించింది. వెంటనే తాను కూడా గ్లైడింగ్‌కు రెడీ అయింది. సూట్ వేసుకుంది. పైలట్‌తో కలిసి ఫ్లైయింగ్‌కి రెడీ అయింది. అలా గాలిలోకి ఎగరగానే ఆమెకు ఒక్కసారిగా గుండె జారినంత పనైంది. కొంత దూరం వెళ్లేసరికి నేలవైపు చూడగానే ఒక్కసారిగా ఆమెకు ఎక్కడలని భయం కలిగింది. అంతే అరుపులు, కేకలు పెట్టి గట్టిగా ఏడుస్తూ.. తనను కిందకు దించేయాలని వెనకున్న పైలట్‌తో ప్రాధేయపడింది.

ఆమె అరుపులు, ఏడుపులు చూసి పైలెట్ కూడా కొంత కంగారు పడ్డాడు. అయితే అతడో ప్రొఫెషనల్ కావడం, ఇలా భయపడేవారిని చాలామందిని చూసి ఉండడంతో ఆమెకు ధైర్యం చెప్పేందుకు ప్రయత్నించాడు. ఏమీ కాదంటూ భరోసా ఇచ్చాడు. గ్లైడింగ్‌ను ఎంజాయ్ చేయాలని, తాను వెనకే ఉన్నానని, తాను చూసుకుంటానని చెప్పాడు. కానీ ఆమె మాత్రం భయంతో కేకలు పెడుతూనే.. గట్టిగా కళ్లు మూసుకుని గ్లైండింగ్ చేయసాగింది. దీనిని గమనించిన పైలెట్ దీర్ఘ శ్వాస తీసుకోవాలని ఆమెకు చెబుతూ, మరింత ఉత్సాహపరిచాడు. కానీ ఆమె భయం మాత్రం తగ్గలేదు.

తనను వెంటనే కిందకు దింపేయాలని చివరివరకు అతడిని వేడుకుంటూనే ఉంది. ఈ దృశ్యాలు మొత్తం కెమెరాలో రికార్డు కావడంతో ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్‌గా మారింది. ఈ వీడియోను చూసిన వారంతా తెగ నవ్వుకుంటున్నారు. ‘అంత భయంగా ఉంటే నీకెందుకు గ్లైడింగ్’ అని కొందరు కామెంట్స్ చేస్తుంటే మరి కొందరు మాత్రం.. ఆమెకు భయపడాల్సిందేమీ లేదని చీరప్ చేస్తున్నారు.
" style="height: 370px;">






కరోనాతో మాజీ కేంద్రమంత్రి మృతి.. సంతాపం తెలిపిన అమిత్ షా.. !!

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>