PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-second-wave3838ced8-c2b6-4fae-9392-fa65e2d47d2c-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/corona-second-wave3838ced8-c2b6-4fae-9392-fa65e2d47d2c-415x250-IndiaHerald.jpgప్రపంచవ్యాప్తంగా కరోనా కొత్త కేసులు నమోదవుతూ ఉన్నాయి. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా తాజా కేసుల సంఖ్య పెరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. దేశవ్యాప్తంగా కొన్ని రాష్ట్రాల్లో కరోనా కేసులు పెరుగుతూ వస్తున్నాయి. వీటిలో మహారాష్ట్ర కూడా ఒకటి. గతేడాది కరోనా తొలిదశలో అల్లాడిన మహారాష్ట్ర ఆ తర్వాత వైరస్ బారి నుంచి కోలుకుంటూ వచ్చింది.corona second wave;maharashtra - mumbai;bari;maharashtra;letter;central governmentదేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్..!?దేశంలో పెరుగుతున్న కరోనా కేసులు.. ఆ రాష్ట్రంలో కరోనా సెకండ్ వేవ్..!?corona second wave;maharashtra - mumbai;bari;maharashtra;letter;central governmentWed, 17 Mar 2021 10:00:00 GMTమహారాష్ట్ర కూడా ఒకటి. గతేడాది కరోనా తొలిదశలో అల్లాడిన మహారాష్ట్ర ఆ తర్వాత వైరస్ బారి నుంచి కోలుకుంటూ వచ్చింది. కానీ, ప్రజలు కరోనా నిబంధనలు పాటించకపోవడం, మాస్కులు ధరించకపోవడంతో నెల రోజులుగా కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నాయి.

కాంటాక్టు ట్రేసింగ్ నిర్వహించకపోవడం, కేసుల గుర్తింపులో అధికారుల అలసత్వం, బాధితులను ఆస్పత్రిలో ఆలస్యంగా జాయిన్ చేయించడం, పర్యవేక్షణ లోపం, తదితర కారణాలు వల్ల మహారాష్ట్రలో వైరస్ తీవ్రత ఎక్కవగా పెరిగింది. గతవారం కేసుల తీవ్రతపై కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక బృందాన్ని పంపించారు. పరిశీలనలో తేలిన అంశాలను కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ మహారాష్ట్ర ప్రభుత్వానికి లేఖ అందించారు. ఈ లేఖలో మహారాష్ట్రలో కరోనా సెకండ్ వేవ్ ప్రారంభమయ్యే సూచనలున్నాయని పేర్కొంది.

మహారాష్ట్రలో ఈ వైరస్ ఒకరి నుంచి 20 మందికి వేగంగా సోకుతుందని, వైరస్‌ను కట్టడి చేయడంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ప్రస్తుతం కరోనా సెకండ్ వేవ్ ప్రారంభ దశలో ఉందని, అందరూ జాగ్రత్తగా ఉండాలని రాజేశ్ భూషణ్ తెలిపారు. గతేడాది ఆగస్టు-సెప్టెంబర్‌లో చేపట్టిన తరహాలోనే అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలన్నారు. ముంబైలో పాజిటివ్ రేటు 5.1, ఔరంగాబాద్‌లో 30గా ఉందని, పాజిటివ్ వచ్చిన వారికి పరీక్షించడంలో నిర్లక్ష్యం వహించడం వల్లే కేసులు సంఖ్య పెరిగిందని ఆయన తెలిపారు.

దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య పెరుగుతూ వస్తున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 24,492 కరోనా కేసులు నమోదు కాగా, 131 మంది వైరస్ బారిన పడి ప్రాణాలు విడిచారు. తాజాగా మహారాష్ట్రలో 15,051 కరోనా కేసులు, కేరళలో 1,054, పంజాబ్‌లో 1,818 కరోనా కొత్త కేసులు నమోదు అయ్యాయి.


వేసవికాలంలో శరీరం కూల్ గా ఉండడానికి, ఈ పండ్లు అద్భుతంగా పని చేస్తాయి...!

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?

వైసీపీకి అది చాలా చిన్న టార్గెట్..

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>