CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/pamu-kaatu96d4e488-598f-4f85-ac6c-bef9eec1a9c4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/crime/135/pamu-kaatu96d4e488-598f-4f85-ac6c-bef9eec1a9c4-415x250-IndiaHerald.jpgపాముకాటుతో చిన్నారి మృతిచెందిన విషాద సంఘ‌ట‌న కృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం రామవరపుమోడిలో చోటు చేసుకుంది. అక్కకు తోడుగా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన చిన్నారిని పాము రూపంలో మృత్యువు వెంటాడింది. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత భవనం లేక కొన్నేళ్లుగా స్థానిక పంచాయతీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ భవనం సైతం శిథిలావస్థకు చేరింది.ఇలాంటి అంగ‌న్‌వాడి కేంద్రానికి వెళ్లిన చిన్నారి వెళ్ళిన పది నిమిషాలకే తాచుపాముకాటుకు బ‌లైంది.కూతురు కళ్ల ముందే మరణించడంతో తల్లి, తండ్రి, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయpamu kaatu;krishna river;district;panchayati;mandalam;village;car;krishna district;local language;central government;fatherపాపం చిన్నారి..అంగ‌న్‌వాడికి వెళ్లి పాముకాటుకు బ‌లైంది..పాపం చిన్నారి..అంగ‌న్‌వాడికి వెళ్లి పాముకాటుకు బ‌లైంది..pamu kaatu;krishna river;district;panchayati;mandalam;village;car;krishna district;local language;central government;fatherWed, 17 Mar 2021 09:00:00 GMTకృష్ణా జిల్లా బంటుమిల్లి మండలం రామవరపుమోడిలో  చోటు చేసుకుంది. అక్కకు తోడుగా అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లిన  చిన్నారిని పాము రూపంలో మృత్యువు వెంటాడింది. గ్రామంలో అంగన్‌వాడీ కేంద్రానికి శాశ్వత భవనం లేక కొన్నేళ్లుగా స్థానిక పంచాయతీ భవనంలో నిర్వహిస్తున్నారు. ఈ భవనం సైతం శిథిలావస్థకు చేరింది.ఇలాంటి అంగ‌న్‌వాడి కేంద్రానికి వెళ్లిన చిన్నారి వెళ్ళిన పది నిమిషాలకే తాచుపాముకాటుకు బ‌లైంది.కూతురు కళ్ల ముందే మరణించడంతో తల్లి, తండ్రి, కుటుంబసభ్యులు కన్నీరు మున్నీరయ్యారు. మండలంలోని రామవరపుమోడి అంగన్‌వాడీ పాఠశాలలో  ఈ సంఘటన జరిగింది.  


 నాగఅనూష, నాగమల్లేశ్వరరావుల పెద్ద కుమార్తె గూడవల్లి వర్షిణి(4) స్థానికంగా ఉన్న అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్తోంది. ఈ చిన్నారితోపాటు చెల్లెలు స్నేహస్వాతి(3) కూడా మంగళవారం అక్కడికి వెళ్లింది. వెళ్ళిన పది నిమిషాలకే ఆమె ఏడవడంతో పక్కపిల్లలు కొట్టారనే భ్రమలో పాము కరచిన విషయాన్ని గమనించలేకపోయారు. పాప ఏడుస్తున్న సమాచారం తెలుసుకుని వచ్చిన తల్లిదండ్రులు ఆమెను చినపాండ్రాక ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువచ్చారు. అప్పటికే రంగుమారి అపస్మారక స్థితికి చేరడంతో వైద్యాధికారి ఇమ్రాన్‌ ప్రాథమిక వైద్యం చేసి, మచిలీపట్నం తీసుకు వెళ్లాలనిసూచించారు. అయితే మార్గం మధ్యలోనే చిన్నారి మృతి చెందింది. అంగన్‌ వాడీలో దాదాపు 30 మంది విద్యార్థులు, అంగన్‌వాడీ టీచర్‌, ఆయా, ఇద్దరు పిల్లల తల్లులు అక్కడే ఉన్న పామును గమనించకపోవడం ఆశ్చర్యాన్ని కలిగించింది.


 ప్రహరీ లేకపోవడం, సమీపంలో పొదలు ఎక్కువగా ఉండటంతో విష పురుగులు, పాములు కేంద్రంలోకి వస్తున్నాయని స్థానికులు ఆరోపిస్తున్నారు. అంగన్‌వాడీ అధి కారులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు తెలుసు కున్నారు. ఉన్నతాధికారులకు సమా చారం ఇచ్చామని, వారి ఆదేశాల మేరకు తదుపరి చర్యలు చేపడతామన్నారు.  అంగన్‌వాడీ  చుట్టూ మొక్కలు, పొదలు ఉన్నాయని, తరగతి గదిలో నాపరాయి కూడా సరైన రీతిలో లేదనే విషయం రాళ్ళ కింద పాముని పట్టి చంపడంతో అర్థమౌతోందని పలువురు పేర్కొన్నారు. పేరుకే 30 పడక గదుల  ఆసుపత్రని, అత్యవసర పరిస్థితులలో వైద్య సేవలు అందుబాటులో ఉండడం లేదని, చిన్నపిల్లల వైద్యులు లేరని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.  


మహిళ నా..మజాకానా.. నడిరోడ్డు లో భర్తకు దేహశుద్ది..

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?

బీజేపీ తొండి.. ఏపీ మాదిరిగానే తెలంగాణ‌కు కూడా షాక్ ?

తిరుపతి ఉప ఎన్నిక జరగడం డౌటే!

ఫ్లాప్ సినిమాల డైరెక్టర్ తో వైష్ణవ్ తేజ్ సినిమా.. పైగా మామ రికమెండేషనా ?

వైసీపీకి అది చాలా చిన్న టార్గెట్..

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>