WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/lose-weight-after-delivery80903fa0-2bc2-42b5-8e3a-1e59a50f2ca2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/lose-weight-after-delivery80903fa0-2bc2-42b5-8e3a-1e59a50f2ca2-415x250-IndiaHerald.jpgగర్భిణులు డెలివరీ తర్వాత సాధారణ బరువు కంటే అధికంగా ఊబకాయులు అవుతారు. బరువు తగ్గడానికి ఎంత ప్రయత్నించినా.. నిరాశే మిగులుతుంది. కాబట్టి ముందే నుంచే శరీర బరువుని గర్భిణులు కంట్రోల్‌లో పెట్టుకోవాలి. అయితే బరువు తగ్గడానికి కొన్ని అంశాలను దృష్టిలో పెట్టుకోవాలి. డెలివరీ తర్వాత శరీర బరువు తగ్గాలని కఠినంగా నిర్ణయం తీసుకోవాలి.lose weight, after delivery;tara;iron;oil;aqua;yoga;dehydration;shaktiఅమ్మ: డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..!అమ్మ: డెలివరీ తర్వాత బరువు తగ్గాలంటే..!lose weight, after delivery;tara;iron;oil;aqua;yoga;dehydration;shaktiWed, 17 Mar 2021 15:00:00 GMT
ఈ కాలంలో నార్మల్ డెలివరీ కష్టతరమవుతోంది. ఎక్కువ మంది సిజేరియన్ డెలివరీలే జరుగుతున్నాయి. డెలివరీ తర్వాత తల్లులు కచ్చితంగా 2-3 వారాలపాటు విశ్రాంతి తీసుకోవాలి. అప్పుడే డెలివరీ అప్పుడు కట్టిన కుట్లు మానుతాయి. ప్రసవం తర్వాతే బరువు తగ్గాలంటే కొంచెం కష్టమైన పని. అందుకే కొంచెం సమయం తీసుకుని ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. ఒక వేళ ప్రసవం తర్వాత బరువు తగ్గాలని అనుకుంటే కచ్చితంగా డాక్టర్ల సలహా తీసుకోవాలి. శరీరానికి తగిన పోషకాలు అందేలా చూసుకుని ఆహార నియమాలు పాటించాలి. రోజూ నార్మల్ ఎక్సర్‌సైజులు చేస్తూ.. శరీరానికి కొంతమేరా ఫిట్ చేసుకోవాలి. ఒకేసారి కఠినమైన వ్యాయామం చేయకూడదు. ఎదైనా మెల్లిమెల్లిగా వార్మప్ వ్యాయామాలు చేస్తే సరిపోతుంది. యోగా అలవాటు ఉంటే చేసుకోవచ్చు. యోగా చేయడం వల్ల మనస్సు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి, అలసట అనిపించదు.

డెలివరీ సమయంలో శరీరంలో ఉన్న పోషకాలు, శక్తి తగ్గిపోతాయి. శరీరం నీరసంగా మారుతుంది. అప్పుడు హెల్తీ ఆకుకూరలు, ఫ్రూట్స్, పాలు వంటివి తీసుకోవాలి. శరీరానికి పోషకాలు, విటమిన్లు సమపాలల్లో అందేలా చూసుకోవాలి. తగిన జాగ్రత్తలు పాటిస్తూ బరువు తగ్గేందుకు ప్రయత్నించాలి. శరీరంలోని టాక్సిన్స్ బయటకు పోవడంతో డీహైడ్రేషన్ ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో నీరు ఎక్కువగా తీసుకోవాలి. రోగ నిరోధక శక్తి పెంచుకోవాలి. రోజూ అలోకాడో, ఆలివ్ ఆయిల్, సాల్మన్ ఫిష్, అవిసె గింజలు ఆహారంలో ఉండేలా చూసుకోవాలి. వీటిని తినడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

గర్భిణులు డెలివరీ తర్వాత బచ్చలికూర తింటే శరీరానికి అవసరమైన పోషకాలు, విటమిన్లు అందడంతోపాటు శరీర బరువు పెరగకుండా ఉంటుంది. పుంటికూరలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉంటుంది. పిల్లలకు పాలిచ్చే తల్లలు కచ్చితంగా పుంటి కూరను తీసుకోవాలి. ఇలా చేస్తే పుట్టిన పిల్లాడికి పాల రూపంలో కాల్షియం, ఐరన్ దొరుకుతుంది. డెలివరీ తర్వాత పాలు ఎక్కువగా తాగాలి. శరీరానికి కాల్షియం అందించడంతోపాటు శరీర బరువును నియంత్రణలో ఉంచుతుంది. నిమ్మకాయ శరీర బరువు తగ్గించడంలో ఎంతో ఉపయోగపడుతుంది. పరిగడపున వెచ్చటి నీటిలో నిమ్మరసం, తేనే వేసుకుని తాగాలి. దీంతో శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యర్థాలను కూడా బయటకు పోతాయి.


జూనియర్ ఎన్టీఆర్ కోసం రెడీ అంటున్న అగ్ర నిర్మాత...?

హెరాల్డ్ సెటైర్:బెజవాడ టీడీపీలో వంశీ చిచ్చు పెట్టారా...?

మహేష్ బాబు వాట్సాప్ కి నందమూరి బాలకృష్ణకి మధ్య సంబంధం ఏంటో తెలుసా?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>