PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy-nagarjuna-sagar31f4f191-5f32-4cba-9891-dcacd8eb11dc-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/janareddy-nagarjuna-sagar31f4f191-5f32-4cba-9891-dcacd8eb11dc-415x250-IndiaHerald.jpgనాగార్జున సాగర్ ఉప ఎన్నిక జానారెడ్డికి అగ్నిపరీక్షే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి ఇక్కడ గెలిచి రాష్ట్రంలో మళ్లీ సత్తా చాాటాలని జానారెడ్డి భావిస్తున్నారు. తన కంచకోటగా చెప్పుకునే సాగర్ లో జానారెడ్డి ఏం మేజిక్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. janareddy nagarjuna sagar;nagarjuna akkineni;tiru;hyderabad;bharatiya janata party;nagarjuna sagar dam;congress;district;nalgonda;king;assembly;mla;minister;janareddy;local language;april;march;reddy;josh;partyజానారెడ్డి మేజిక్ చేసేనా!జానారెడ్డి మేజిక్ చేసేనా!janareddy nagarjuna sagar;nagarjuna akkineni;tiru;hyderabad;bharatiya janata party;nagarjuna sagar dam;congress;district;nalgonda;king;assembly;mla;minister;janareddy;local language;april;march;reddy;josh;partyWed, 17 Mar 2021 08:04:40 GMTనల్గొండ జిల్లా నాగార్జున సాగర్‌ అసెంబ్లీ ఉప ఎన్నిక పార్టీలకు ప్రధాన సవాల్ గా మారింది.వరుస ఓటములతో డీలా పడిన అధికార పార్టీని ఈ సీటును ప్రతిష్టాత్మంకగా తీసుకుంది. దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ఫలితాల జోష్ తో  సాగర్ లోనూ జెండా పాతాలని బీజేపీ తహతహలాడుతోంది. తమకు పట్టున నాగార్జున సాగర్ లో విజయం సాధించి తిరిగి సత్తా చాటాలని  కాంగ్రెస్ పార్టీ భావిస్తోంది. దీంతో ఉప ఎన్నిక హోరాహోరీగా జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి.

నాగార్జున సాగర్ కు అందరి కంటే ముందే అభ్యర్థిని ప్రకటించింది కాంగ్రెస్. పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి  జానారెడ్డిని  ఉప ఎన్నిక బరిలో నిలుపుతున్నట్లు ఏఐసీసీ అధికారికంగా ప్రకటించింది.గతంలో ఇక్కడి నుంచి ఏడుసార్లు విజయం సాధించారు జానా రెడ్డి. 2018 ఎన్నికల్లో మాత్రం ఓడిపోయారు. నాగార్జున సాగర్ నుంచి జానా రెడ్డి పోటీ చేస్తారని చాలా రోజుల క్రితమే క్లారిటీ ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. నియోజకవర్గంలో ఆయన ప్రచారం కూాడా చేసేస్తున్నారు. ఇప్పటికే జానారెడ్డి ఒక రౌండ్ ప్రచారం పూర్తి చేసుకున్నారని చెబుతున్నారు.

నాగార్జున సాగర్ ఉప ఎన్నిక జానారెడ్డికి అగ్నిపరీక్షే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అత్యంత సీనియర్ నేతగా ఉన్న జానారెడ్డి ఇక్కడ గెలిచి రాష్ట్రంలో మళ్లీ సత్తా చాాటాలని జానారెడ్డి భావిస్తున్నారు. తన కంచకోటగా చెప్పుకునే సాగర్ లో జానారెడ్డి ఏం మేజిక్ చేస్తారన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది. ఎందుకంటే ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ గడ్డు పరిస్థితుల్లో ఉంది. స్థానిక ఎన్నికల్లో సాగర్ లో కాంగ్రెస్ ఎలాంటి ప్రభావం చూపలేకపోయింది. అందుకే  ఈ ఎన్నికల్లో ఆయన సర్వశక్తులు ఒడ్డనున్నారు జానారెడ్డి. నిజానికి సాగర్ లో జానారెడ్డి కొడుకు పోటీ చేస్తారని ముందు ప్రచారం జరిగినా.. ఎన్నిక అత్యంత కీలకం కావడంతో జానారెడ్డినే పోటీ చేయాలని కాంగ్రెస్ పెద్దలు సూచించినట్లు తెలుస్తోంది.

నాగార్జున సాగర్‌ ఎమ్మెల్యే నోముల నర్సింహయ్య ఇటీవల అనారోగ్యంతో మృతి చెందడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. 2018 శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన జానారెడ్డిపై టీఆర్‌ఎస్‌ అభ్యర్థి నోముల నర్సింహయ్య తిరుగులేని విజయం సాధించారు. నాగార్జున సాగర్‌ నియోజకవర్గ ఉప ఎన్నికకు ఈ నెల 23న ఎన్నికల నోటిఫికేషన్‌ విడుదల కానుంది. మార్చి 30 వరకు నామినేషన్లు స్వీకరణ.. 31న నామినేషన్ల పరిశీలన ఉంటుంది.  ఏప్రిల్‌ 3 వరకు నామినేషన్ల ఉపసంహరణ గడువు. 17న ఉప ఎన్నిక పోలింగ్‌, మే 2న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు.




ఆగ‌ని అమ‌రావ‌తి నిర‌స‌న‌లు... కొత్త నినాద‌మే హైలెట్‌

జీరో అయిన చంద్రబాబును జగన్ మళ్లీ హీరో చేస్తున్నారా..?

బాబుకు సీఐడీ పెట్టిన ఆ 7 షరతులేంటో తెలుసా.. తేడా వస్తే అరెస్టేనా..?

పయ్యావుల, పరిటాల పార్టీకి దూరమా...?

హెరాల్డ్ సెటైర్ : చంద్రబాబు వీపు ఎప్పుడో పగలాల్సిందట

హెరాల్డ్ స్మ‌రామీ : కల్పనా చావ్లా అంటే ఓ ధైర్యం..ఓ తెగువ..ఓ చరిత్ర

జూనియర్ ఎన్టీఆర్, మంచు మనోజ్ మధ్య ఉన్న సిమిలారిటీస్ ఏంటో తెలుసా..!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>