MoviesGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/chiranjeevi-little-warning-to-his-directors6aba6ae0-d0d2-4dbd-8067-a91af7b011c1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/business_videos/chiranjeevi-little-warning-to-his-directors6aba6ae0-d0d2-4dbd-8067-a91af7b011c1-415x250-IndiaHerald.jpgచిరంజీవి నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేస్తున్నారు. ఆచార్య తర్వాత చిరంజీవి చేస్తున్న లూసిఫర్ రీమేక్ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్తుంది. జనవరి నెలలో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. మోహన్‌ రాజా దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. సినిమా షూటింగ్ చకచకా పూర్తి చేయాలని దర్శకుడు మోహన్ రాజాకు చిరంజీవి టార్గెట్ పెట్టినట్టు తెలుస్తోంది. aacharya, chiranjeevi, lucifer;chiranjeevi;koratala siva;raja;cinema;january;konidela production;producer;industry;remake;producer1చిరంజీవి ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పగలరా..?చిరంజీవి ఆ విషయాన్ని ఇప్పుడు చెప్పగలరా..?aacharya, chiranjeevi, lucifer;chiranjeevi;koratala siva;raja;cinema;january;konidela production;producer;industry;remake;producer1Wed, 17 Mar 2021 12:00:00 GMTసినిమా మొదలు పెడితే.. త్వర త్వరగా షూటింగ్ పూర్తి చేయాలి. అలా చేయకపోతే నిర్మాతలు ఇబ్బంది పడతారు. ఆచార్య సినిమా మొదలయ్యే ముందు చిరంజీవి చెప్పిన డైలాగులివి. దర్శకుడు కొరటాల శివతో టార్గెట్ పెట్టి మరీ పని మొదలు పెట్టించారు. అయితే అనుకోకుండా కరోనా వల్ల సినిమా ఆగిపోయింది. ఆ తర్వాత కొన్నాళ్లపాటు చిరంజీవి సినిమా షూటింగ్ కి ధైర్యం చేయలేదు. చివరకు ఎలాగోలా సినిమా ఓ కొలిక్కి వచ్చింది. అయితే చిరంజీవి కొడుకు నిర్మాత కాబట్టి.. ఆచార్య మూవీ విషయంలో చిరంజీవి అలాంటి కామెంట్ చేశారనే విమర్శలు కూడా వచ్చాయి. ఇన్నాళ్లూ బయట నిర్మాతలకు సినిమాలు చేసిన చిరంజీవి.. ఎప్పుడూ షూటింగ్ త్వరగా కంప్లీట్ చేయాలంటూ దర్శకులకు చెప్పలేదని, ఆచార్య విషయంలో మాత్రమే సొంత బ్యానర్ కాబట్టి అలా చెప్పారని అన్నవారు కూడా ఉన్నారు. ఎవరి వాదన ఎలా ఉన్నా.. షూటింగ్ టైమ్ పెరిగే కొద్దీ నిర్మాతకు ఆర్థికంగా కష్టమే. సినిమా సూపర్ హిట్ అయినా కూడా.. ముందు చేసిన అదనపు ఖర్చు ఆయన ఖాతాలోకే వెళ్తుంది కాబట్టి అది ఇబ్బంది పెట్టే అంశమే. ఒకరకంగా చిరంజీవి చెప్పిన మాట మంచిదేనని, దర్శకులంతా టార్గెట్ పెట్టుకుని సినిమాలు తీస్తే, నిర్మాతలకు మంచిదని ఇండస్ట్రీలో ఓ చర్చ మొదలైంది.

ఆ సంగతి పక్కనపెడితే.. ఇప్పుడు చిరంజీవి నెక్స్ట్ మూవీ స్టార్ట్ చేస్తున్నారు. ఆచార్య తర్వాత చిరంజీవి చేస్తున్న లూసిఫర్ రీమేక్ ఏప్రిల్ లో సెట్స్ పైకి వెళ్తుంది. జనవరి నెలలో ఈ సినిమా లాంఛనంగా మొదలైంది. ఏప్రిల్ నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు పెట్టబోతున్నారు. మోహన్‌ రాజా దర్శకత్వంలో ఎన్వీ ప్రసాద్‌, కొణిదెల ప్రొడక్షన్స్‌ సంయుక్తంగా ఈ సినిమా నిర్మిస్తున్నాయి. మరి ఈ సినిమాకి కూడా చిరంజీవి దర్శకుడికి టార్గెట్ పెడతారా అనేది తేలాల్సి ఉంది.

ప్రస్తుతం చిరంజీవిసినిమా చేసినా.. అసలు నిర్మాతలతోపాటు.. కొణిదెల ప్రొడక్షన్స్ కూడా భాగస్వామిగా ఉంటోంది. మరి ఈ సినిమా విషయంలో కూడా చిరంజీవి త్వరగా షూటింగ్ పూర్తి చేయాలని అంటారా, నిర్మాతలకు లాభం చేకూర్చేలా పనిచేయాలని దర్శకుడికి కండిషన్ పెడతారా అనేది తేలాల్సి ఉంది. ఒకవేళ అదే జరిగితే.. చిరంజీవి నుంచి వెంట వెంటనే సినిమాలు ఆశించవచ్చు. అటు నిర్మాతలు కూడా సంతోషపడతారు. ఈ ఆనవాయితీ కేవలం చిరంజీవి సినిమాలకే కాదు, ఇతర దర్శకులు కూడా పాటిస్తేనే.. ఇండస్ట్రీ కళకళలాడుతుంది. 


గురువు గారినే లైట్ తీసుకున్న లోకేష్...?

అఖిల్ అక్కినేని పూజాహెగ్డేల మధ్య రొమాన్స్ మాములుగా లేదుగా..!?

చాలా విచిత్రంగా.. నాగ అశ్విన్ ప్రేమ పెళ్లి.. ఎలా జరిగిందో తెలుసా..!?

పెళ్లి తర్వాత గౌతమ్ చాలామారిపోయాడు..కాజల్ సంచలన వ్యాఖ్యలు..!!

బూమ్రా భార్య గురించి... ఎవరికీ తెలియని నిజాలు ఇవే..?

బాబు దెబ్బ‌తో క‌మ్మోళ్లంతా ఇరుక్కుపోయారే... !

ఆ జంపింగ్ ఎమ్మెల్యేకు జ‌గ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్‌.. మొఖం వాడిపోయిందా ?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>