PoliticsChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-jagan19363b09-7138-40a5-acac-aa907c33f3c3-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/nimmagadda-jagan19363b09-7138-40a5-acac-aa907c33f3c3-415x250-IndiaHerald.jpgనిమ్మగడ్డ రమేశ్ కుమార్.. ఈ పేరు చెబితేనే కొన్ని నెలలుగా వైసీపీ నాయకులు మండిపడేవారు. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నంత కాలం అసలు ఎన్నికలు నిర్వహించేదే లేదని భీష్మించుకున్నారు. చివరకు సుప్రీంకోర్టు వరకూ పోరాడారు. కానీ ఫలితం దక్కలేదు. నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా సీన్ మారిపోయింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయాలు అందుకోవడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులు మిగిలిన ఎన్నికలు కూడా పెట్టండి ప్లీజ్ అంటూ బతిమాలుకుంటున్నాయి. nimmagadda-jagan;kumaar;jagan;peddireddy ramachandra reddy;police;panchayati;court;minister;ycp;chief commissioner of elections;vప్లీజ్.. నిమ్మగడ్డా.. ఆ ఒక్కటీ కానిచ్చేయండి.. బతిమాలుకుంటున్న జగన్ టీమ్ ?ప్లీజ్.. నిమ్మగడ్డా.. ఆ ఒక్కటీ కానిచ్చేయండి.. బతిమాలుకుంటున్న జగన్ టీమ్ ?nimmagadda-jagan;kumaar;jagan;peddireddy ramachandra reddy;police;panchayati;court;minister;ycp;chief commissioner of elections;vWed, 17 Mar 2021 00:00:00 GMTవైసీపీ నాయకులు మండిపడేవారు. ఆయన ఎన్నికల కమిషనర్‌గా ఉన్నంత కాలం అసలు ఎన్నికలు నిర్వహించేదే లేదని భీష్మించుకున్నారు. చివరకు సుప్రీంకోర్టు వరకూ పోరాడారు. కానీ ఫలితం దక్కలేదు. నిమ్మగడ్డ ఆధ్వర్యంలోనే పంచాయతీ, మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. అయితే.. ఇప్పుడు అనూహ్యంగా సీన్ మారిపోయింది.

పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో వైసీపీ అద్భుత విజయాలు అందుకోవడంతో ఇప్పుడు వైసీపీ శ్రేణులు మిగిలిన ఎన్నికలు కూడా పెట్టండి ప్లీజ్ అంటూ బతిమాలుకుంటున్నాయి. ప్లీజ్ నిమ్మగడ్డ గారూ.. మధ్యలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు కూడా మీరే నిర్వహించండి ప్లీజ్ అంటూ కోరుతున్నారు. హైకోర్టు తీర్పుతో ఏకగ్రీవాలకు అడ్డు తొలగిపోయిందని, న్యాయపరమైన అవరోధాలన్నీ తొలగిపోయాయని.. అందుకే మధ్యలో నిలిచిపోయిన జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలను నిమ్మగడ్డ నిర్వహించాలని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కోరారు.

నిమ్మగడ్డ తలచుకుంటే ఆరు రోజుల్లో  ఈ ఎన్నికలు నిర్వహించ వచ్చని మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  చెబుతున్నారు. కరోనా కారణంగా పరిషత్‌ ఎన్నికలు వాయిదా వేసిన ఎన్నికల కమిషనర్‌ నిమ్మగడ్డ రమేష్‌..ఆ తరువాత ఎక్కడ నుంచి నిలిపివేశామో అక్కడి నుంచి మొదలుపెడుతామని కోర్టుకు చెప్పారని పెద్దిరెడ్డి గుర్తు చేశారు. ఇప్పుడు జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణకు ఎలాంటి అడ్డంకులు లేవని.. ఆరు రోజుల్లో ఎన్నికలు పూర్తి చేయవచ్చని చెబుతున్నారు.


ఎన్నికల కమిషనర్ తప్పకుండా ఈ ఎన్నికలు నిర్వహించాలని.. అన్ని ఎన్నికలు నిమ్మగడ్డనే నిర్వహించారు కాబట్టి..ఈ ఎన్నికలు కూడా పూర్తి చేసి రిటైర్డు అయితే బాగుంటుందని పెద్దిరెడ్డి కోరారు. ఎన్నికల ప్రక్రియలో ఎలాంటి అవంతరాలు చోటు చేసుకోకుండా ఎన్నికల కమిషనర్‌ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. తొందరగా ఎన్నికలు ముగిస్తే..ప్రభుత్వం వ్యాక్సినేషన్‌పై దృష్టి సారిస్తుందని.. ఇప్పటికే పోలీసులు, అధికారులు ఎన్నికలకు సంసిద్ధత వ్యక్తం చేశారని ఆయన అంటున్నారు. మొత్తానికి నిమ్మగడ్డ వద్దే వద్దన్న వారే.. ఇప్పుడు ఆయనే కావాలని కోరడం వింతగా లేదూ..?


అసలు నిజాలు బయట పెట్టిన జేసీ...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>