Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/to-watch-ipl-live-streaming-use-these-plans091c3ce0-50af-453a-b0b7-abf70a3ff1b0-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/to-watch-ipl-live-streaming-use-these-plans091c3ce0-50af-453a-b0b7-abf70a3ff1b0-415x250-IndiaHerald.jpg క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ మొదలవుతుందంటే చాలు క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం టాప్‌కు చేరుతుంది. తమ అభిమాన జట్టు గెలుస్తుందంటే.. కాదు తమ జట్టు గెలుస్తుందంటూ తెగ హల్‌చల్ చేస్తుంటారు. ఇక వారిలో ఉత్సాహాన్ని మరింత పెంచుతూ 2021 టోర్నీ షెడ్యూల్‌ను..ipl 2021;rohit;virat kohli;cricket;reliance;jio;indian;kaliఐపీఎల్ లైవ్ ఫ్రీగా చూడాలా.. ఇలా చేయండిఐపీఎల్ లైవ్ ఫ్రీగా చూడాలా.. ఇలా చేయండిipl 2021;rohit;virat kohli;cricket;reliance;jio;indian;kaliTue, 16 Mar 2021 22:19:56 GMTఇంటర్నెట్ డెస్క్: క్రికెట్లో ఇండియన్ ప్రీమియర్ లీగ్‌కు ఉండే క్రేజ్ అంతా ఇంతా కాదు. ఐపీఎల్ మొదలవుతుందంటే చాలు క్రికెట్ అభిమానుల్లో ఉత్సాహం టాప్‌కు చేరుతుంది. తమ అభిమాన జట్టు గెలుస్తుందంటే.. కాదు తమ జట్టు గెలుస్తుందంటూ తెగ హల్‌చల్ చేస్తుంటారు. ఇక వారిలో ఉత్సాహాన్ని మరింత పెంచుతూ 2021 టోర్నీ షెడ్యూల్‌ను భారత క్రికెట్ బోర్డు ఈ మధ్యనే ప్రకటించింది. తొలి మ్యాచ్‌లోనే రోహిత్ వర్సెస్ కోహ్లీ పోరుతో ఈ టోర్నీ ప్రారంభం కాబోతోంది. మరి ఇంత స్థాయిలో క్రేజ్ ఉన్న ఈ టోర్నీని ఆన్‌లైన్‌లో లైవ్ చూడాలంటే మాత్రం ఎంతో కొంత చెల్లించుకోవాల్సిందే. దానికి తోడు నెట్ బ్యాలెన్స్ వేయించుకోవాల్సిందే. డిస్నీ+హాట్‌స్టార్‌లో ఐపీఎల్ లైవ్‌లో ప్రసారం కానుంది.

సాధారణంగా ఇందులో మ్యాచ్‌లను లైవ్‌లో చూడాలంటే ప్రతీ నెలా రూ.399 చెల్లించాల్సిందే. అయితే ఎయిర్‌టెల్, జియో కస్టమర్లయితే మాత్రం ఈ మ్యాచ్‌లను ఫ్రీగా చూసే అవకాశం ఉంది. తమ వినియోగదారుల కోసం ఈ టెలికం కంపెనీలు డిస్నీ+హాట్‌స్టార్‌కు ఉచిత చందాతో కూడిన ప్రత్యేక రీచార్జ్‌లను అందిస్తున్నాయి. దీనివల్ల మీరు ఐపీఎల్ మ్యాచ్‌లను ఉచితంగా చూడవచ్చు. అలాగే మీరు ఉచిత కాలింగ్, డేటా, ఎస్ఎంఎస్ ప్రయోజనాలు పొందవచ్చు. మరి ఆ రీచార్జ్ ప్లాన్స్ ఏంటో ఇప్పుడు చూద్దాం.

రూ.401, రూ.499, రూ.599, రూ.777, 2,599 ప్లాన్స్‌లో ఆయా ప్లాన్స్ ప్రకారం ప్రతి రోజూ ఉచిత డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్, మెసేజింగ్ సర్వీసెస్‌ను రిలయన్స్ జియో తమ వినియోగదారులకు అందిస్తోంది. వాటి ద్వారా డిస్నీ+హాట్‌స్టార్ ఫ్రీ సబ్‌స్క్రిప్షన్‌ను ఆయా ప్లాన్‌ల వ్యాలిడిటీ ప్రకారం అందిస్తోంది. ఇక ఎయిర్‌టెల్ కూడా తమ వినియోగదారులుకు రూ.401, రూ.448, రూ.499, రూ.599, రూ.2,698 రీఛార్జ్ ప్లాన్‌లతో రీఛార్జ్ చేసుకుంటే ఉచితంగా ఐపీఎల్ లైవ్ స్ట్రీమింగ్ చూడవచ్చు. జియో మాదిరిగానే ఎయిర్‌టెల్ కస్టమర్లు రీఛార్జ్ ప్లాన్‌లతో డిస్నీ+హాట్‌స్టార్ వీఐపీ ఉచిత సబ్‌స్క్రిప్షన్‌ను పొందవచ్చు. అలాగే ఉచిత వాయిస్ కాల్స్, డేటా, ఎస్ఎంఎస్‌లతో పాటు ఇతర ప్రయోజనాలు కూడా ఈ ప్లాన్ కింద లభిస్తాయి.


తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>