PoliticsSuma Kallamadieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kidnapped304a1b10-3492-41fd-a5c8-9859925b3e03-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/kidnapped304a1b10-3492-41fd-a5c8-9859925b3e03-415x250-IndiaHerald.jpgఅనుకున్నదే జరిగింది. ఆ తల్లికి పుత్రశోకమే మిగిలింది. నిన్న మధ్యాహ్నం నుంచి కనిపించకుండా పోయిన ఏడేళ్ల భార్గవ్‌తేజ ఆచూకి కోసం వెదికిన తల్లిదండ్రులకు జీర్ణించుకోలేని నిజం కళ్లముందు కనిపించింది. ఒక్కసారిగా కుటుంబమేకాదు, మొత్తం గ్రామాన్నే కంటతడి పెట్టిస్తోంది. స్నేహితులు, బంధువులు ఎవరైనా తీసుకెళ్లి ఉంటారేమోనని ఆరా తీశారు.kidnapped;amala akkineni;teja;district;police;police station;murder.;traffic police;tadepalli;nayak;paruguఆరేళ్ల కొడుకు.. కిడ్నప్.. 24 గంటల్లోనే శవం.. అసలు ఏం జరిగిందంటే..!?ఆరేళ్ల కొడుకు.. కిడ్నప్.. 24 గంటల్లోనే శవం.. అసలు ఏం జరిగిందంటే..!?kidnapped;amala akkineni;teja;district;police;police station;murder.;traffic police;tadepalli;nayak;paruguTue, 16 Mar 2021 11:00:00 GMT
పోలీసులు రంగంలోకి దిగి ఆ బాలుడి ఆచూకీ తెలుసుకునేలోపే వారికి ఓ దారుణ వార్త తెలిసింది. ఇంటికి దగ్గరలోనే పొలంలోనే ఆ బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడన్న వార్త వాళ్లకు తెలిసింది. అంతే పరుగు పరుగున అక్కడకు ఆ తల్లిదండ్రులు వెళ్లి చూశారు. నిర్జీవంగా పడి ఉన్న కొడుకును చూసి కుప్పకూలిపోయారు. గుంటూరు జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం మెల్లంపూడిలో భాగవానియా నాయక్, అమల దంపతులకు ఇద్దరు కొడుకులు. ఈ దంపతుల రెండో కుమారుడు, ఆరేళ్ల భార్గవ తేజ ఆదివారం సాయంత్రం నుంచి కనిపించకుండా పోయాడు. బంధువులు, స్నేహితులు ఎవరైనా తీసుకుని వెళ్లి ఉంటారని మొదట్లో ఆ తల్లిదండ్రులు భావించారు. కానీ ఎవరిని కనుక్కున్నా తమకు తెలియదని అంటుండటంతో వారిలో ఆందోళన పెరిగింది. కొడుకు కనిపించకుండా పోవడంతో వారిలో టెన్షన్ పెరిగింది. చివరకు తాడేపల్లి పోలీస్ స్టేషన్ కు ఆ భార్యాభర్తలిద్దరూ వెళ్లారు. తమ కొడుకు అదృశ్యం గురించి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదుచేశారు.

పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే ఆ తల్లిదండ్రులకు షాకింగ్ న్యూస్ తెలిసింది. వారి ఇంటికి కాస్త దగ్గరలోనే పొలాల్లో ఆ ఆరేళ్ల బాలుడు విగతజీవిగా పడి ఉన్నాడు. తల్లిదండ్రులు ఆ వార్త తెలిసి ఉరుకులు పరుగుల మీద అక్కడకు చేరుకున్నారు. బాలుడిని నిర్జీవంగా చూసి కన్నీటిపర్యంతమయ్యారు. అయితే బాలుడి దేహంపై గాయాల గుర్తులు ఉండటంతో ఎవరో హత్య చేసి, అక్కడ పడేసి ఉంటారని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. అతడిని ఎవరు చంపి ఉంటారు? ఏం జరిగి ఉంటుందన్న దానిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు.


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Suma Kallamadi]]>