PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-capital-vizagfcd351b6-f3cc-4638-922f-3aaea40e0343-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/jagan-capital-vizagfcd351b6-f3cc-4638-922f-3aaea40e0343-415x250-IndiaHerald.jpgప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం రాజధానిని తరలించడం సాధ్యం కాకపోయినా... సీఎం జగన్ మాత్రం త్వరలో విశాఖ నుండి తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైనట్టుగా ప్రచారం జరుగుతోంది. జగన్ కోసం సీఎం క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా విశాఖకు చెందిన ఒక ప్రముఖ స్వామీజీ దీనికోసం మే ఆరున ముహూర్తం పెట్టినట్టుగా తెలుస్తోంది.jagan capital vizag;visakhapatnam;jagan;vijayawada;vishakapatnam;capital;local language;ycp;tadepalli;mantraరాజధాని తరలింపు డేట్ ఇదేనా!రాజధాని తరలింపు డేట్ ఇదేనా!jagan capital vizag;visakhapatnam;jagan;vijayawada;vishakapatnam;capital;local language;ycp;tadepalli;mantraTue, 16 Mar 2021 19:28:45 GMTవైసీపీ ప్రభంజనం వీచింది. రాజధాని అమరావతికి సమీపంలో ఉన్న విజయవాడ, గుంటూరు నగరాలతో పాటు వైసిపి ప్రభుత్వం ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా ప్రకటించిన విశాఖలోనూ వైసీపికి ఎదురు లేకుండా పోయింది.  దీంతో తమ ప్రభుత్వం తీసుకున్న మూడు రాజధానుల నిర్ణయానికి ప్రజల మద్దతు పూర్తిగా ఉందని వైసీపీ ప్రకటించుకుంటోంది. ఇదే వేడిలో రాజధాని తరలింపు కూడా చేపట్టాలని జగన్ ప్రభుత్వం నిర్ణయించినట్లుగా తెలుస్తోంది .

 గతంలో అనేక ముహూర్తాలు పెట్టినా.. కోర్టు కేసుల వల్ల అప్పట్లో అవన్నీ వాయిదా పడ్డాయి. అయితే తాజాగా పుర ప్రజల తీర్పుతో ఇక రాజధాని తరలింపులో ఎంతమాత్రం ఆలస్యం చేయకూడదని ప్రభుత్వం నిర్ణయానికి వచ్చింది .తాజా ఎన్నికల ఫలితాలను ఉదహరణగా చూపించి.. తమ నిర్ణయాలకు ప్రజామోదం కూడా ఉందని చెప్పొచ్చని భావిస్తోంది. ఒకవేళ ప్రస్తుత పరిస్థితుల్లో మొత్తం రాజధానిని తరలించడం  సాధ్యం కాకపోయినా... సీఎం జగన్ మాత్రం త్వరలో విశాఖ నుండి తన కార్యకలాపాలు ప్రారంభించేందుకు సిద్ధమైనట్టుగా  ప్రచారం జరుగుతోంది. జగన్ కోసం  సీఎం క్యాంపు కార్యాలయం కూడా సిద్ధమైనట్టుగా వార్తలు వస్తున్నాయి.. తాజాగా విశాఖకు చెందిన ఒక ప్రముఖ స్వామీజీ దీనికోసం మే ఆరున ముహూర్తం పెట్టినట్టుగా  తెలుస్తోంది.

ప్రస్తుతం తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి జగన్ పాలనా వ్యవహారాలు చూస్తుండగా   మే ఆరో తారీఖు నుండి వైజాగ్ నుంచే పాలన జరిపేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. పరిపాలన కోసం అవసరమైన  ప్రభుత్వ భవనాలు పూర్తిగా సమకూరే వరకు.. ఎటువంటి ఇబ్బంది లేకుండా.. అంతా అనుకూలంగా ఉండే ప్లేస్ ను ఇప్పటికే సీఎం ఖరారు చేసినట్టుగా వార్తలు వస్తున్నాయి .

 భ‌వ‌నాల నిర్మాణానికి ఉగాధి రోజున  శంకుస్థాప‌న చేసే అవ‌కాశం ఉంద‌ని తెలుస్తోంది. దీనిపై సీఎం జగన్ ఇప్పటికే తన మంత్రులకు సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. సీఎం విశాఖ వచ్చిన వెంటనే.. అన్ని వసతులతో కూడిన క్యాంప్ కార్యా‌ల‌యం కూడా స్థానికంగా సిద్ధం చేసినట్టుగా  ప్రచారం జరుగుతోంది. నగరంలో ఉన్న ప్రముఖ వెల్ నెస్ రిసార్ట్ ను క్యాంప్ కార్యాలయం కోసం సెలెక్ట్ చేశారని తెలుస్తోంది. తాత్కాలికంగా సీఎం  ఇక్క‌డ నుంచే ప‌రిపాల‌న కొన‌సాగించే అవ‌కాశాలు ఉన్న‌ట్లుగా సమాచారం.  వైజాగ్ లో పాలనకు అనుకూలంగా చాలా ప్రదేశాలు ఉన్నప్పటికీ.. ఈ రిసార్ట్  ప్ర‌భుత్వ స్థ‌లంలో ఉండడంతో సీఎం జగన్ దీన్నే ఎంపిక చేసిన‌ట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సుమారు 28 ఎకారాల్లో విస్త‌రించి ఉన్న ఈ వెల్ నెస్ రిసార్ట్ లో  పూర్తి స్థాయి విలాసావంత‌మైన సౌక‌ర్య‌లు అందుబాటులో  ఉన్నాయి. 


బాలీవుడ్ చూపు టాలీవుడ్ లో ఒక్కడి మీదే ?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>