PoliticsGarikapati Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona-central-ap-sivasena-bjp90dd63c3-c8aa-4c2f-ba72-00783caa60fb-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/politics/politics_latestnews/carona-central-ap-sivasena-bjp90dd63c3-c8aa-4c2f-ba72-00783caa60fb-415x250-IndiaHerald.jpgక‌రోనా నెమ్మ‌ది నెమ్మ‌దిగా రెండోద‌శ‌న ప్ర‌భావాన్ని చూపించ‌డం ప్రారంభించింది. దేశంలోని మిగ‌తా రాష్ట్రాల‌తో పోలిస్తే మ‌హారాష్ట్రలో ప‌రిస్థితి తీవ్రంగా ఉంది. నాలుగురోజుల్లో 15వేల‌కు పైగా కేసులు న‌మోద‌వ‌డం ఆందోళ‌న క‌లిగిస్తోంది. యాక్టివ్ కేసుల సంఖ్య ల‌క్ష‌కుపైగా ఉంది. ప్ర‌జ‌లు నిర్లక్ష్యంగా వ్య‌వ‌హ‌రించ‌డంవ‌ల్లే ఇక్క‌డ క‌రోనా ఉధృతి తీవ్రంగా ఉన్న‌ట్లు అభిప్రాయ‌ప‌డుతున్నారు. carona, central, ap, sivasena, bjp;view;letter;central government;mantraక‌రోనా విల‌య‌తాండ‌వంక‌రోనా విల‌య‌తాండ‌వంcarona, central, ap, sivasena, bjp;view;letter;central government;mantraTue, 16 Mar 2021 13:34:00 GMTకేంద్ర బృందం అక్క‌డ వారంరోజులు ప‌ర్య‌టించి ఒక నివేదిక‌ను కేంద్ర ప్ర‌భుత్వానికి అంద‌జేసింది. దీనిపై మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి కేంద్ర ప్ర‌భుత్వం ఒక లేఖ రాసింది.

క‌రోనా నియంత్ర‌ణ చ‌ర్య‌లు తూతూమంత్రం
కొవిడ్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌డం, పాజిటివ్ వ‌చ్చిన‌వారిని గుర్తించ‌డం, క్వారంటైన్ చేయించ‌డ‌లాంటి ప్ర‌భుత్వ ప్ర‌య‌త్నాలు త‌తూమంత్రంగానే ఉన్నాయి. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ ఇరు ప్రాంతాల్లోని ప్ర‌జ‌లు కొవిడ్ నిబంధ‌న‌లు పాటించ‌డంలేదు. ఆయా జిల్లాల యంత్రాంగంలో కూడా ఎటువంటి ఆందోళ‌న క‌న‌ప‌డ‌టంలేదు. ఇప్ప‌టికే చాలా ఎక్కువ చ‌ర్య‌లు చేప‌ట్టామ‌న్న భావ‌న‌లో వారుండ‌టంవ‌ల్లే రెండోద‌శ‌లో క‌రోనా పెర‌గ‌డానికి కార‌ణ‌మ‌వుతోంది. గ‌తేడాది ఆగ‌స్టు - సెప్టెంబ‌రు మ‌ధ్య మ‌హారాష్ట్ర‌లో క‌రోనా నియంత్ర‌ణ‌కు కేంద్రం, రాష్ట్రం సంయుక్తంగా ఎటువంటి చ‌ర్య‌లు చేప‌ట్టామో ఇప్పుడు కూడా అవే చ‌ర్య‌లు చేప‌ట్టాల‌ని లేఖ‌లో సూచించింది.

లాక్‌డౌన్‌వ‌ల్ల ఉప‌యోగంలేదు
మ‌హారాష్ట్ర‌లో నాలుగు రోజులుగా 15వేల‌కు పైగా క‌రోనా కేసులు బ‌య‌ట‌ప‌డుతున్నాయి. దేశ‌వ్యాప్తంగా న‌మోదవుతున్న కేసుల్లో స‌గ‌భాగం ఈ ఒక్క రాష్ట్రంలోనే ఉంటున్నాయి. యాక్టివ్ కేసుల సంఖ్య కూడా ల‌క్ష దాటింది. ఔరంగాబాద్‌, నాసిక్‌, జ‌ల‌గావ్‌, నాగ‌పూర్ వంటి ప్రాంతాల్లో వారాంత‌పు లాక్‌డౌన్లు, క‌ర్ఫ్యూల్లాంటివి త‌క్కువ ప్ర‌భావం చూపుతున్నాయి. దీంతో రాష్ట్ర ప్ర‌భుత్వం ధియేట‌ర్ల‌లో కెపాసిటీని స‌గానికి స‌గం త‌గ్గించింది. శుభకార్యాల‌కు హాజ‌ర‌య్యేవారి సంఖ్య‌ను ప‌రిమితం చేయ‌డం, పాఠ‌శాల‌ల మూసివేత‌, ఉద్యోగుల‌కు ఇంటిద‌గ్గ‌ర నుంచి ప‌నిచేసే సౌల‌భ్యం క‌ల్పించ‌డంలాంటి చ‌ర్య‌లు చేప‌ట్టింది. కేంద్ర ఆరోగ్య‌శాఖ ఇచ్చిన మార్గ‌ద‌ర్శ‌కాల‌కు అనుగుణంగా కంటైన్‌మెంట్ లాంటి వ్యూహాల‌పై దృష్టిపెడితే సాధ్య‌మైనంత త‌క్కువ స‌మ‌యంలో కోరాను నియంత్రించ‌వ‌చ్చ‌ని కేంద్ర ప్ర‌భుత్వం మ‌హారాష్ట్ర ప్ర‌భుత్వానికి సూచించింది. 


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Garikapati Rajesh]]>