MoviesChakravarthi Kalyaneditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarangadariya4bfe9f4c-0d48-4a48-8f2d-6686da2c1344-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/movies/movies_latestnews/sarangadariya4bfe9f4c-0d48-4a48-8f2d-6686da2c1344-415x250-IndiaHerald.jpgసారంగ దరియా పాట ట్రెండ్ కావడంతో ఇప్పుడు అందరి దృష్టి... తెలుగు సినిమాల్లో జానపదాల్ని దోపిడీ చేయడం మీద చర్చ మొదలైంది. సుద్దాల అశోక్ తేజ అన్నట్లు జానపదం ఎవరి సొత్తూ కాదా..? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వాడుకోవచ్చా...? నిజమైన కళాకారులు పేదరికం లో మునిగి ఉంటే.... కాపీ కొట్టిన వాళ్లు మాత్రం ఎలా లక్షలు సంపాదిస్తున్నారు..? దీనికి పరిష్కారం ఏమిటి...? రచయిత, విమర్శకుడు చందు తులసి చెబుతున్న సమాధానం ఇది.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ అస్తిత్వ స్పృహ పెరిగాక... తెలంగాణ లోని పండుగలకు ముఖ్యంగా బతsarangadariya;view;ashok;sampada;srinivas;teja;thulasi;vandemataram srinivas;kamma;andhra pradesh;telangana;cinema;sri venkateswara swamy;television;youtube;you tube;writer;car;tulasi;manam;mangliసారంగ దరియా తెచ్చిన చిక్కుప్రశ్న.. ఇదిగో సమాధానం..?సారంగ దరియా తెచ్చిన చిక్కుప్రశ్న.. ఇదిగో సమాధానం..?sarangadariya;view;ashok;sampada;srinivas;teja;thulasi;vandemataram srinivas;kamma;andhra pradesh;telangana;cinema;sri venkateswara swamy;television;youtube;you tube;writer;car;tulasi;manam;mangliTue, 16 Mar 2021 06:00:00 GMTఅశోక్ తేజ అన్నట్లు జానపదం ఎవరి సొత్తూ కాదా..? ఎవరికి ఇష్టం వచ్చినట్టు వారు వాడుకోవచ్చా...? నిజమైన కళాకారులు పేదరికం లో మునిగి ఉంటే....
కాపీ కొట్టిన వాళ్లు మాత్రం ఎలా లక్షలు సంపాదిస్తున్నారు..? దీనికి పరిష్కారం ఏమిటి...?

రచయిత, విమర్శకుడు చందు తులసి చెబుతున్న సమాధానం ఇది..  

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత తెలంగాణ అస్తిత్వ స్పృహ పెరిగాక... తెలంగాణ లోని పండుగలకు ముఖ్యంగా బతుకమ్మ పండుగకు యూట్యూబ్ లో పాటలు చేయడం మొదలైంది. తేలు విజయ, సత్యవతి  (మంగ్లీ ) లాంటి వాళ్ళు బాగా క్రేజ్ సంపాదించారు. సై టీవీ లో నన్ను కొట్టుకో...లాంటి పాటలు కోట్ల వ్యూస్ సంపాదించాయి. ఈ నేపథ్యంలో యూట్యూబ్ లో జానపద పాటల ఛానెళ్లు పుట్టకొక్కుల్లా పుట్టుకొచ్చాయి.


ఈ క్రేజ్ సొమ్ము చేసుకొనేందుకు టీవీ ఛానళ్ల లో కూడా జానపద కార్యక్రమాలు, ముఖ్యంగా తెలంగాణ ప్రాంత కళాకారులతో  టీవీ కార్యక్రమాలు మొదలయ్యాయి. వీటికి జానపదంతో పాటు సినిమా రంగంతో  సంబంధం ఉన్న సుద్దాల, వందేమాతరం శ్రీనివాస్, గోరెటి వెంకన్న లాంటి వారు జడ్జి లుగా ఉన్నారు. ఈ కార్యక్రమంలో బాగా గుర్తింపు పొందిన వారికి సినిమా అవకాశాలు కూడా ఒకటి రెండు వచ్చాయి.


సినిమాలో సందర్భానుసారంగా జానపదాలు వాడుకోవడం ఎవరికీ అభ్యంతరం ఉండదు. కానీ దాన్ని కొందరు తమ క్రెడిట్ లో వేసుకోకూడదు. సొమ్ము చేసుకోకూడదు. నిజమైన జానపద కళాకారులు పేదరికం లో కొట్టు మిట్టాడుతుంటే... ఆ పాటలు కొట్టేసిన కాపీ రాయుళ్లు మాత్రం లక్షలు సంపాదిస్తున్నారు. ఆ సినిమాలు కోట్లు కొల్లగొడుతున్నాయి. ఇక ఈ గొడవకి పరిష్కారం ఏమిటంటే తెలంగాణ లో కానీ అటు ఆంధ్రప్రదేశ్ లో కానీ సాహిత్య అకాడమీలో జానపదాలకి ఒక కమిటీ ఉండాలి.


వివిధ జిల్లాల్లో ఉన్న జానపదాలు సేకరించి ఒక గ్రంథంగా విడుదల చేయాలి. ఆ పాటలు ఎవరైనా సినిమా వాళ్లు వాడుకోవాలంటే జానపద అకాడమీ కి రాయల్టీ చెల్లించాలి. ఆ డబ్బు తో ప్రభుత్వం జానపద కళాకారుల కి పెన్షన్ అందించాలి. కాపీ రాయుళ్లకి  కోట్లు సంపాదించి పెడుతున్న జానపద పాటలు... కళాకారుల సంక్షేమం కోసం ఉపయోగపడేలా చొరవ చూపాలి. ప్రభుత్వాలు ముందుకు రాకుంటే సాహిత్య కారులు, కళాకారులే ఒక కమిటీ గా ఏర్పడాలి. జానపదం ఎవడి సొమ్ము కాదు అని సుద్దాల అశోక్ తేజ అన్నారు కానీ ..వాస్తవానికి జానపదం జనం సొమ్ము. మనందరి వారసత్వ సంపద. 


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chakravarthi Kalyan]]>