PoliticsGiddaluri Srinivasa Raoeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/banks-strike-31b31122-3811-4434-a9e4-2f39d00b1ab1-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/banks-strike-31b31122-3811-4434-a9e4-2f39d00b1ab1-415x250-IndiaHerald.jpgప్రైవేటీకరణపై జోరుగా నిర్ణయాలు తీసుకుంటున్న మోదీ ప్రభుత్వానికి త్వరలోనే పెద్ద షాక్ తగలబోతోంది. రెండు రోజుల సమ్మె పేరుతో రంగంలోకి దిగిన బ్యాంకు ఉద్యోగులు, అవసరమైతే రైతు పోరాటంలాగా నిరవధిక సమ్మెతో షాకిస్తామంటున్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే తమ సత్తా చూపిస్తామంటున్నారు. రెండు రోజుల సమ్మెను, సమస్య పరిష్కారమయ్యే వరకు కొనసాగించే విషయంపై చర్చలు జరుపుతున్నారు. అదే జరిగిదే దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించడం ఖాయంగా కనిపిస్తోంది. banks strike,;narendra modi;rbi;vishakapatnam;hushaaru;bank;prime minister;strike;minister;central government;narendraమోదీ ప్రభుత్వానికి ఊహించని షాక్..మోదీ ప్రభుత్వానికి ఊహించని షాక్..banks strike,;narendra modi;rbi;vishakapatnam;hushaaru;bank;prime minister;strike;minister;central government;narendraTue, 16 Mar 2021 07:00:00 GMTమోదీ ప్రభుత్వానికి త్వరలోనే పెద్ద షాక్ తగలబోతోంది. రెండు రోజుల సమ్మె పేరుతో రంగంలోకి దిగిన బ్యాంకు ఉద్యోగులు, అవసరమైతే రైతు పోరాటంలాగా నిరవధిక సమ్మెతో షాకిస్తామంటున్నారు. ప్రైవేటీకరణపై కేంద్రం వెనక్కి తగ్గకపోతే తమ సత్తా చూపిస్తామంటున్నారు. రెండు రోజుల సమ్మెను, సమస్య పరిష్కారమయ్యే వరకు కొనసాగించే విషయంపై చర్చలు జరుపుతున్నారు. అదే జరిగిదే దేశ ఆర్థిక వ్యవస్థ స్తంభించడం ఖాయంగా కనిపిస్తోంది.

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ విషయంలో కేంద్రం హుషారుగా ఉంది. ఇటు ఉక్కు ఉద్యోగులు ఉద్యమం చేస్తున్నా పట్టీ పట్టనట్టే ఉంది. అటు కేంద్ర మంత్రి ప్రైవేటీకరణపై పదే పదే ప్రకటనలు చేస్తూనే ఉన్నారు. పెట్టుబడుల ఉపసంహరణపై వెనకాడేది లేదని తెగేసి చెబుతున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా వ్యాపారం ప్రభుత్వ లక్షణం కాదని తేల్చి చెప్పారు. ఈ దశలో బ్యాంక్ ఉద్యోగుల సమ్మెతో ప్రభుత్వం దిగి రావాల్సిన పరిస్థితి.

దేశవ్యాప్తంగా 9 లక్షలమంది ఉద్యోగులు తొలిరోజు సమ్మెలోకి వెళ్లారు. ఏపీలో 25వేలమందికి పైగా ఉద్యోగులు విధులు బహిష్కరించి రోడ్లెక్కారు. వీరందరి నినాదం ఒక్కటే, విలీనాలు వద్దు, బ్యాంకుల ప్రైవేటీకరణ వద్దు. ప్రైవేటీకరణతో దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలుతుందని, ప్రైవేటు శక్తుల గుత్తాధిపత్యంలోకి బ్యాంకులు వెళ్లిపోతాయని అంటున్నారు ఉద్యోగులు. ఉద్యోగ భద్రత విషయంలో కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

బ్యాంకు ఉద్యోగుల సమ్మెతో సామాన్య ప్రజలు కొంతవరకు ఇబ్బంది పడ్డారు. రెండో శనివారం, ఆదివారం సెలవు దినాల తర్వాత వరుసగా సోమ, మంగళ వారాల్లో బ్యాంక్ ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడం వ్యూహాత్మకమైన నిర్ణయమే. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామంటూ ఉద్యోగులు హెచ్చరిస్తున్నారు. ఈ సమ్మెతో కేంద్రం దిగి వచ్చే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు. ఉద్యోగులు నిరవధిక సమ్మెలోకి వెళ్తే పలు దుష్పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, వాటినుంచి బయటపడటానికి మరికొన్నాళ్లు సమయం పడుతుందని, అందుకే ముందుగానే ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు. 


ఆ నిర్మాతకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన బాలకృష్ణ.. ఎందుకో...???

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Giddaluri Srinivasa Rao]]>