CookingPurushottham Vinayeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/how-to-make-tasty-veg-biryani-46d35437-3e5f-4bf8-8f78-5dbd73868f74-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/cooking/81/how-to-make-tasty-veg-biryani-46d35437-3e5f-4bf8-8f78-5dbd73868f74-415x250-IndiaHerald.jpgబిర్యాని అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. అది చాలా రుచికరమైన వంటకం. అయితే బిర్యాని చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని అనుకుంటారు. కాని వీటికంటే వెజిటేబుల్ బిర్యాని ఇంకా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఇలా తయారు చేసుకోని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇక ఆ రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన వెజిటేబుల్ బిర్యాని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి.... కావలసిన పదార్థాలు: 1. బిర్యాని ఆకు - 1 2. లవంగం - 1 3. దాల్చిన స్టిక్ - 1 4. ఏలకులు - 1 5. రైస్ - 2 కప్పులు (కడిగి మరియు పొడిగా) 6. రుచికి తగినంత ఉప్పు 7. ఉడికించిన మిశ్రమ కాVeg biryani;chicken biriyani;chicken;onion;beans;chilli;oil;garlic;cumin;mutton biryani;ghee;coriander.;cheese;cinnamon;dhaniya powder;masalaరుచికరమైన వెజిటేబుల్ బిర్యాని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....రుచికరమైన వెజిటేబుల్ బిర్యాని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....Veg biryani;chicken biriyani;chicken;onion;beans;chilli;oil;garlic;cumin;mutton biryani;ghee;coriander.;cheese;cinnamon;dhaniya powder;masalaTue, 16 Mar 2021 12:00:00 GMTబిర్యాని అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు. అది చాలా రుచికరమైన వంటకం. అయితే బిర్యాని చికెన్ బిర్యాని, మటన్ బిర్యాని అనుకుంటారు. కాని వీటికంటే వెజిటేబుల్ బిర్యాని ఇంకా రుచికరంగా ఉంటుంది. ఇంకా ఇలా తయారు చేసుకోని తింటే చాలా రుచికరంగా ఉంటుంది. ఇక ఆ రుచికరమైన ఇంకా ఆరోగ్యకరమైన వెజిటేబుల్ బిర్యాని ఎలా తయారు చెయ్యాలో తెలుసుకోండి....


కావలసిన పదార్థాలు:

1. బిర్యాని ఆకు - 1
2. లవంగం - 1
3. దాల్చిన స్టిక్ - 1
4. ఏలకులు - 1
5. రైస్ - 2 కప్పులు (కడిగి మరియు పొడిగా)
6. రుచికి తగినంత ఉప్పు
7. ఉడికించిన మిశ్రమ కాయగూరలు - 2 కప్పులు (క్యారెట్లు, బీన్స్, బంగాళాదుంపలు, కాలీఫ్లవర్, బటానీలు, మొదలైనవి)
8. నూనె - 2 టేబుల్ స్పూన్లు
9. కాటేజ్ చీజ్ - ¼ కప్ (చిన్న ముక్కలుగా కట్)
10. జీలకర్ర - ½ స్పూన్
11. ఉల్లిపాయలు - ¾ కప్ (చిన్న ముక్కలుగా కట్)
12. పసుపు పౌడర్ - ¼ స్పూన్
13. అల్లం-వెల్లుల్లి-పచ్చిమిర్చి పేస్టు - 2 స్పూన్స్ 14. గరం మసాలా పౌడర్ - ½ స్పూన్
15. కొత్తిమీర పౌడర్ - 2 స్పూన్స్
16. పాలు - ¼ కప్
17. కారం - 1 స్పూన్
18. టొమాటోస్ - 1 కప్పు (సన్నగా తరిగి పెట్టుకోవాలి)
19. ఉప్పు రుచికి తగ్గట్లు
20. చక్కెర చిటికెడు
21. పెరుగు - ¼ కప్
22. కొత్తిమీర ఆకులు - ¼th కప్
23. తినదగిన కుంకుమ కలర్ - కొన్ని చుక్కలు

24. నెయ్యి - 2 టేబుల్ స్పూన్లు 25 క్రీమ్ - 1 స్పూన్

తయారు చేసే విధానం....

ముందుగా ఒక అరగంటసేపు బియ్యం నాననివ్వండి మరియు ఆ తరువాత అందులో నీటిని తీసివేయండి. ఇప్పుడు, ఒక పెద్ద పాత్రను తీసుకొని దానిలో నీరు పోయాలి. ఆ నీటిని వేడి చేయండి. ఆ నీటిలో దాల్చిన చెక్క, లవంగం, ఏలకులు మరియు బిర్యాని ఆకు వేయండి.ఇప్పుడు నానపెట్టిన బియ్యం అందులో వేయండి. 10 నిముషాల వరకు ఉడకనివ్వండి. బియ్యాన్ని మరీ ఎక్కువగా ఉడకనివ్వవద్దు: ఎక్కువగా ఉడికిస్తే మెత్తగా గుజ్జులాగా అవుతుంది. ఇప్పుడు అందులో మిగిలిన నీటిని తీసివేసి పక్కకు పెట్టుకోండి.ఇప్పుడు వెజిటబుల్ గ్రేవీ చేసుకోవాలి. ఒక పాన్ లో నూనె వేసి వేడి చేయండి. దానిలో జీలకర్ర వేయండి. జీలకర్ర చిటపటలాడుతుండగా ఉల్లిపాయ ముక్కలను వేయండి. అవి బంగారు రంగులో వొచ్చేవరకు వేయించండి. ఇప్పుడు దానికి అల్లం వెల్లుల్లి-మిరప కాయ పేస్ట్, పసుపు, ధనియాల పొడి, కారం, గరం మసాలా పౌడర్ మరియు టమోటాలు కలపండి.


టమోటాలను, మసాలాలో బాగా ఉడికించాలి. బాగా ఉడకటానికి, 2 టేబుల్ స్పూన్ల నీరు పోయండి మరియు టమోటాలు బాగా ఉడికేట్లుగా చూడాలి. ఇప్పుడు, దీనిలో ఉడికించిన కూరగాయలు, పనీర్ మరియు రుచికి తగినంత ఉప్పు వేయండి. బాగా కలియపెట్టండి. ఇప్పుడు, కూరగాయలలో పాలు పోసి, బాగా కలపండి. దీనిని కొద్దిగా మందంగా మరియు గుజ్జుగా తయారుకావడానికి ఒక చిటికెడు చక్కెర మరియు క్రీమ్ ఒక చిటికెడు కలపండి.గ్రేవీ చిక్కగా తయారయిన తరువాత, కూరగాయలను సిద్ధంగా ఉంచుకోండి. వాటిని పక్కన ఉంచండి.



బియ్యంతో కూరగాయలు కలపాలి. దానికన్నా ముందు, మీరు అన్నంలోకి మిక్శ్చర్ తయారుచేసుకోవాలి.పెరుగును తీసుకోండి మరియు దానికి తరిగిన కొత్తిమీర, కుంకుమ రంగు కలపండి. ఇప్పుడు, అన్ని పదార్ధాలను కలపండి మరియు అన్నానికి కలపండి. బాగా కలపండి, ఇప్పుడు సగం వైట్ రైస్ మరియు సగం సాఫరాన్ రైస్ తయారవుతుంది.అప్పుడు, తయారయిన అన్నం ఒక పొరలాగా సిద్ధం చేసుకోండి. దానిపైన, మీరు తయారు చేసుకున్న కూరగాయల గ్రేవీ జోడించండి. ఇది సమంగా చదునుగా వేయండి మరియు దానిపై మిగిలిన అన్నాన్ని వేయండి. దానిపైన నెయ్యి లేదా పాలు వేయండి.ఒక పెద్ద హాండితో కవర్ చేయండి. పొయ్యి మీద ఒక తవా ఉంచండి. దాని పైన ఆ పెద్ద హాండిని ఉంచండి. అందువలన బిర్యానీ అడుగంటాడు. కనీసం అరగంటసేపు కూరగాయల బిర్యాని ఉడికించాలి. ఇక రుచికరమైన వెజిటేబుల్ బిర్యాని తయారైనట్లే.



బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Purushottham Vinay]]>