PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanb8863d9b-75e5-4288-bb0c-99a12f079520-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/pawan-kalyanb8863d9b-75e5-4288-bb0c-99a12f079520-415x250-IndiaHerald.jpgప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తి అవ‌స‌రం. ఇటు జ‌గ‌న్‌, అటు చంద్ర‌బాబు ఎవ‌రూ కూడా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఢిల్లీలో నోరు విప్పేందుకు వివిధ కేసులు వెంటాడుతున్నాయ‌ని ప్ర‌చారంలో ఉంది. ఈ క్ర‌మంలో తెలుగు వారి త‌ర‌ఫున వాయిస్ వినిపించే బ‌ల‌మైన నాయ‌కుడి అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని .. ఏపీ ప్ర‌జ‌లు భావిస్తున్నారు. ఈ క్ర‌మంలో జ‌న‌సేనాని ప్ర‌త్యామ్నాయంగా నిల‌బ‌డితే.. ప్ర‌జ‌లు గుండుగుత్తుగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. ముందుగా ఆయ‌న బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. త్వ‌రpawan kalyan;geetha;tiru;delhi;bharatiya janata party;andhra pradesh;vishakapatnam;media;letter;central government;amaravathi;youthప‌వ‌న్‌లో తెలుగు పౌరుషం ఏమైంది..?ప‌వ‌న్‌లో తెలుగు పౌరుషం ఏమైంది..?pawan kalyan;geetha;tiru;delhi;bharatiya janata party;andhra pradesh;vishakapatnam;media;letter;central government;amaravathi;youthTue, 16 Mar 2021 09:26:00 GMTమైకు ప‌ట్టుకుంటే పూనకం వ‌చ్చిన వ్య‌క్తిగా డైలాగులు పేల్చే జ‌న‌సేన అధినేత ప‌వ‌న్ క‌ళ్యాణ్‌.. పౌరుషం.. రోషం.. హ‌క్కులు.. అణిచి వేత వంటి అనేక అంశాల‌పై రెచ్చిపోయి మ‌రీ మాట్లాడ‌డం తెలిసిందే. ఆయ‌న ఎప్పుడు మీడియా ముందుకు వ‌చ్చినా.. ఆయ‌న డైలాగులు ఈ రేంజ్‌లోనే ఉంటాయి. ``ప‌డి ఉండ‌డానికి ఇక్క‌డ ఎవ‌రూ లేరు. మేం కూడా ఉప్పూ కారం తింటున్నాం.. మాకూ పౌరుషం.. రోషం.. అన్నీ ఉన్నాయి. మేం కూడా గీత దాటితే.. మీరు త‌ట్టుకోలేరు!!`` కొన్నాళ్ల కింద‌ట ఏపీ సీఎం జ‌గ‌న్‌ను ఉద్దేశించి.. ప‌వ‌న్ చేసిన వ్యాఖ్య‌లు ఇవి. ఇక‌, 2017లో ప్ర‌త్యేక హోదా బ‌దులు ప్యాకేజీ ప్రక‌టించిన స‌మ‌యంలో వీటిని పాచిపోయిన ల‌డ్డూలుగా అభివ‌ర్ణించి.. ఆ స‌మ‌యంలోనూ తెలుగు వారి పౌరుషాన్ని ఉత్త‌రాది నేత‌ల‌కు చాటి చెబుతాం.. అంటూ వ్యాఖ్యానించి సంచ‌ల‌నం రేపారు.

ఇవ‌న్నీ ఇప్పుడు ఎందుకు గుర్తు చేయాల్సి వ‌స్తోందంటే.. ప్ర‌స్తుతం ఉన్న ప‌రిస్థితిలో ఏపీ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు, కీల‌క‌మైన జాతి సంప‌ద‌గా.. ఆంధ్రుల హ‌క్కుగా ప‌రిగ‌ణిస్తున్న విశాఖ ఉక్కు విష‌యంలోనూ... రాజ‌ధాని అమ‌రావ‌తి, ప్ర‌త్యేక హోదా.. వెనుక‌బ‌డిన‌ జిల్లాల నిధులు ఇలా.. అనేక ‌విష‌యాల్లో ఏపీని అత్యంత హీనంగా చూస్తున్న కేంద్రంలోని బీజేపీ కి ప‌వ‌న్ సాగిల‌ప‌డుతున్నార‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నందునే. ప్ర‌స్తుతం రాష్ట్రంలో ప్ర‌త్యామ్నాయ రాజ‌కీయ శ‌క్తి అవ‌స‌రం. ఇటు జ‌గ‌న్‌, అటు చంద్ర‌బాబు ఎవ‌రూ కూడా రాష్ట్ర ప్ర‌యోజ‌నాల విష‌యంలో ఢిల్లీలో నోరు విప్పేందుకు వివిధ కేసులు వెంటాడుతున్నాయ‌ని ప్ర‌చారంలో ఉంది. ఈ క్ర‌మంలో తెలుగు వారి త‌ర‌ఫున వాయిస్ వినిపించే బ‌ల‌మైన నాయ‌కుడి అవ‌స‌రం ఎంతైనా ఉంద‌ని .. ఏపీ ప్ర‌జ‌లు భావిస్తున్నారు.

ఈ క్ర‌మంలో జ‌న‌సేనాని ప్ర‌త్యామ్నాయంగా నిల‌బ‌డితే.. ప్ర‌జ‌లు గుండుగుత్తుగా ఆయ‌న‌కు మ‌ద్ద‌తు ఇచ్చే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. ముందుగా ఆయ‌న బీజేపీ నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చి.. త్వ‌ర‌లోనే జ‌ర‌గ‌నున్న తిరుప‌తి ఉప ఎన్నిక‌ల్లో ఒంట‌రిగానే పోటీకి దిగి.. కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల‌కు బుద్ధి చెబుదాం.. రండి అంటే.. క‌ద‌లి వ‌చ్చే యువ‌త కోకొల్ల‌లు. కానీ, ఆదిశ‌గా ఆయ‌న అడుగులు వేయ‌క‌పోగా.. ఇక్క‌డి స్థానాన్ని సైతం బీజేపీకి ఇచ్చేసి చోద్యం చూస్తున్నారు. రాష్ట్రంలో అరాచ‌క పాల‌న సాగుతోంద‌ని.. అందుకే బీజేపీకి ఇచ్చేశాన‌ని చెబుతున్నారు.

అయితే.. ఏపీకి హ‌క్కులు, హోదా, ఆస్తుల‌ను సైతం మిగ‌ల కుండా చేస్తున్న బీజేపీ జ‌న‌సేన‌కు న‌చ్చ‌డం.. దానిని ప‌ట్టుకుని ఊరేగ‌డం.. వంటివి తీవ్ర విమ‌ర్శ‌లకు దారితీస్తున్నాయి. ఈ నేప‌థ్యంలోనే ప‌వ‌న్‌లో పౌరుషం ఏమైంద‌నే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తున్నాయి. రాజ‌కీయాలు ఈరోజు ఉంటాయి.. రేపు పోతాయి.. కానీ వ్య‌క్తిగా ప‌వ‌న్ చ‌రిత్ర‌లో క‌లిసిపోయే ప్ర‌మాదం ఉంద‌ని.. ఆయ‌న నాయ‌కుడిగా అచిర‌కాలం గుర్తుండాలంటే.. ఒక చ‌రిత్ర సృష్టించాలంటే.. ఢిల్లీ పెద్ద‌ల ముందు మోక‌రిల్ల‌డం స‌రికాద‌నే సూచ‌న‌లు కూడా వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. 


బిట్‌కాయిన్‌పై కేంద్రం నిషేధం??

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?

సారంగ దరియాకు ముందు ఈ జానపద దోపిడీ సంగతి మీకు తెలుసా..?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>