PoliticsChagantieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sec-nimmagadda-counter-affidavit-in-high-court74f4a9cc-f27d-4237-87e8-b049c0af8766-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/74/sec-nimmagadda-counter-affidavit-in-high-court74f4a9cc-f27d-4237-87e8-b049c0af8766-415x250-IndiaHerald.jpgఆంధ్ర‌ ప్ర‌దేశ్ హైకోర్టు పరిషత్ ఏకగ్రీవాలపై ఎన్నికల రాష్ట్ర ఎన్నిక‌ల సంచం ఇచ్చిన ఆదేశాల విషయంలో ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌తంలో ఏక‌గ్రీవమైన‌వారంద‌రికీ వెంట‌నే డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని ఆదేశించింది. ఏక‌గ్రీవాల‌పై ద‌ర్యాప్తు చేసే అధికారం ఎన్నిక‌ల సంఘానికి లేదని తేల్చిచెప్పిన కోర్టు ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీ స్థానాల్లో గ‌తంలో ఏక‌గ్రీవ‌మైన‌ వాటి మీద ద‌ర్యాప్తు జ‌ర‌పాలంటూ ఎన్నిక‌ల అధికారులకు క‌మిష‌న్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కోర్టు కొట్టేసింది. నిజానnimmagadda;district;court;local language;ycpపరిషత్ ఎన్నికలు ఇప్పుడు నిమ్మగడ్డ కోర్టులో పెడతారా ? పెట్టరా ?పరిషత్ ఎన్నికలు ఇప్పుడు నిమ్మగడ్డ కోర్టులో పెడతారా ? పెట్టరా ?nimmagadda;district;court;local language;ycpTue, 16 Mar 2021 16:00:00 GMTఆంధ్ర‌ ప్ర‌దేశ్ హైకోర్టు పరిషత్ ఏకగ్రీవాలపై ఎన్నికల రాష్ట్ర ఎన్నిక‌ల సంచం ఇచ్చిన ఆదేశాల విషయంలో ఈరోజు తుది తీర్పు వెలువరించింది. ఈ క్రమంలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీ ఎన్నిక‌ల‌కు సంబంధించి గ‌తంలో ఏక‌గ్రీవమైన‌వారంద‌రికీ వెంట‌నే డిక్ల‌రేష‌న్ ఇవ్వాల‌ని ఆదేశించింది. ఏక‌గ్రీవాల‌పై ద‌ర్యాప్తు చేసే అధికారం ఎన్నిక‌ల సంఘానికి లేదని తేల్చిచెప్పిన కోర్టు ఎంపీటీసీలు, జ‌డ్పీటీసీ స్థానాల్లో గ‌తంలో ఏక‌గ్రీవ‌మైన‌ వాటి మీద ద‌ర్యాప్తు జ‌ర‌పాలంటూ ఎన్నిక‌ల అధికారులకు క‌మిష‌న్ ఇచ్చిన ఉత్త‌ర్వుల‌ను కోర్టు కొట్టేసింది. నిజానికి గ‌తేడాది ఏపీలో స్థానిక సంస్థ‌ల ఎన్నిక‌ల ప్ర‌క్రియ ప్రారంభ‌మైన క్రమంలో ఎంపీటీసీ, జ‌డ్పీటీసీల్లో అధిక భాగం స్థానాలు అధికార వైసీపీ ఏక‌గ్రీవంగా గెలుచుకుంది. 

అప్పట్లోనే ఇవి బలవంతపు ఏకాగ్రీవాలు అని ప్రతిపక్షాలు ఎంత గగ్గోలు పెట్టినా నిమ్మగడ్డ వినలేదు. అయితే అనుకోని పరిస్థితుల్లో క‌రోనా కార‌ణంగా ఎన్నిక‌ల‌ను వాయిదా వేశారు. అదే సమయంలో అన్ని ఎన్నికలు వాయిదా వేసినా పరిషత్ ఎన్నికలు తప్ప మిగతా అన్ని ఎన్నికలు అంటే పంచాయితీ, న‌గ‌ర‌పాల‌క సంస్థ‌, న‌గ‌ర పంచాయితీ, పుర‌పాల‌క సంఘాల‌కు ఎన్నిక‌లు పూర్తయ్యాయి. మండ‌ల ప‌రిష‌త్‌ల‌కు, జిల్లా ప‌రిష‌త్ ల‌కు మాత్ర‌మే ఎన్నిక‌లు జ‌ర‌గాల్సి ఉంది. అయితే ఈ ప్రక్రియ గతంలో ఎక్క‌డైతే ఆగిందో అక్క‌డినుంచే ప్రారంభ‌మ‌వుతాయ‌ని ఎస్ఈసీ ప్ర‌క‌టించింది.

కానీ ఏక‌గ్రీవ‌మైన‌వాటిపై ద‌ర్యాప్తు జ‌ర‌పాలంటూ ఎన్నిక‌ల సంఘం ఎన్నికల అధికారులు అయిన జిల్లా క‌లెక్ట‌ర్ల‌కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ విషయం మీద ప్రభుత్వం కోర్టుకు వెళ్లింది. ఈ ఎన్నికలకు లైన్ క్లియర్ అవడంతో ఎన్నికల నిర్వహణపై నిమ్మగడ్డ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కోర్టు వ్యవహారాలు క్లియరైతే పరిషత్ ఎన్నికల నిర్వహణపై నిర్ణయం తీసుకుంటానని నిమ్మగడ్డ గతంలో చెప్పిన నేపధ్యంలో సర్వత్రా ఉత్కంట నెలకొంది. ఎందుకంటే ఈ నెల 19 నుంచి ఎస్ఈసీ సెలవుల్లో వెళ్లనున్నారు. ప్రస్తుతానికి డెప్యూటేషన్ మీద ఎస్ఈసీ కార్యాలయానికి వచ్చిన సిబ్బందిని వెనక్కి పంపే పనిలో ఉన్నారు నిమ్మగడ్డ. దీంతో ఎస్ఈసీ నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. 


బిబి3 టైటిల్ అనౌన్స్ మెంట్ ఆ రోజే ఫిక్స్ .... ??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Chaganti]]>