PoliticsGullapally Rajesheditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mlc-voting465109bc-506e-4b6b-a505-6b20e088a0a9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/mlc-voting465109bc-506e-4b6b-a505-6b20e088a0a9-415x250-IndiaHerald.jpgఎమ్మెల్సీ ఎన్నిక కౌంటింగ్ కు విస్తృత ఏర్పాట్లు చేసారు అధికారులు. మొత్తం ఎనిమిది చాంబర్లు ఏడు టేబుళ్ల చొప్పున మోత్తం 56 టేబుళ్లు ఉంటాయి ఉంటాయి అని అధికారులు పేర్కొన్నారు. ఉదయం 7 గంటలకు స్ట్రాంగ్ రూమ్ లకు పోటీచేసిన అభ్యర్థులు, ఏజెంట్ల సమక్షంలో తెరుస్తారు అని ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 6 .30 గంటల వరకు పోటీ చేసిన అభ్యర్థులు, ఏజెంట్లు కౌంటింగ్ హాల్ కు చేరు కోవాలి అని సూచించారు. బ్యాలెట్ బాక్సులను ముందుగా ఏజెంట్లచే పరిశీలన చేసి వారి సంతకం తీసుకున్న మీదటే తెరుస్తారు అని అన్నారు. కౌంటింగ్ హాల్ లోకmlc,ts;hyderabad;indore;huzur nagar;ranga reddy;mahbubnagarఎమ్మెల్సీ ఓట్లు ఎలా లెక్కిస్తారు...? ఇదీ ప్రాసెస్...!ఎమ్మెల్సీ ఓట్లు ఎలా లెక్కిస్తారు...? ఇదీ ప్రాసెస్...!mlc,ts;hyderabad;indore;huzur nagar;ranga reddy;mahbubnagarTue, 16 Mar 2021 20:00:00 GMT
కౌంటింగ్ హాల్ లోకి వచ్చే కౌంటింగ్ ఏజెంట్లు సెల్ ఫోన్లు గానే, పెన్ను,నోట్ బుక్ లను  తేవడాన్ని అనుమతించరు అని, ఏజెంట్లకు ఎన్నికల అధికారులే పెన్సిల్, నోట్ బుక్ లను అందిస్తారు అని పేర్కొంది. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల లెక్కింపు ప్రక్రియను  ఎల్.బి. నగర్ ఇండోర్ స్టేడియం లో రేపు, 17న జరిపేందుకు విస్తృత ఏర్పాట్లు చేసారు. హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్ నగర్ నియోజకవర్గం పరిధిలోని  మొత్తం 357354  ఓట్లన్నీ ఇక్కడే లెక్కించనుండటం వలన, ఈ ప్రక్రియకు సుదీర్ఘ సమయం పెట్టె అవకాశం ఉంది అని తెలుస్తుంది.

దీంతో షిఫ్తుల వారీగా పనిచేసేందుకు అధికారులకు, సిబ్బందికి డ్యూటీలు వేశారు.  లెక్కింపునకు మొత్తం 8 హాళ్లను వినియోగిస్తున్నారు అని, ఒక్కో హాళ్లో 7 టేబుల్స్‌ చొప్పున మొత్తం 56 టేబుళ్లను ఏర్పాటు చేస్తారు. వీటిపై 799  పోలింగ్‌ కేంద్రాల నుంచి వచ్చిన ఓట్లను లెక్కిస్తారు అని అధికారులు పేర్కొన్నారు. ఒక్కో టేబుల్‌పై బ్యాలెట్‌ పత్రాలను ఉంచిన అనంతరం 25 బ్యాలెట్‌ పత్రాలకు ఒకటి చొప్పున కట్ట కడతారు అని అధికారులు వివరించారు. ప్రస్తుతం పోలైన ఓట్ల ప్రకారం 25 చొప్పున బ్యాలెట్‌ పత్రాను ఒక కట్ట కట్టడానికే అధిక సమయం పట్టేఅవకాశం ఉంది.. అంటే ఉ.8గం.లకు లెక్కింపు ప్రారంభమైతే రాత్రి 8గం.వరకు కేవలం బ్యాలెట్‌ పత్రాలను కట్ట కట్టే ప్రక్రియ సాగే అవకాశం ఉందని తెలుస్తుంది.

అనంతరం కట్ట కట్టిన బ్యాలెట్‌ పత్రాలను తెరిచి అందులో చెల్లనివి, చెల్లుబాటయ్యే ఓట్లను రిటర్నింగ్‌, సహాయ రిటర్నింగ్‌ అధికారులు, మైక్రో అబ్జర్వర్లు, కౌంటింగ్‌ ఏజెంట్‌ల సమక్షంలో వేరు చేస్తారని అధికారులు పేర్కొన్నారు. అప్పుడు మొదటి ప్రాధాన్య ఓట్లను అభ్యర్థుల వారీగా లెక్కిస్తారు. ఇలా 56 టేబుళ్లపైనా ఏకకాలంలో ప్రక్రియ సాగుతుంది. ఇది సుమారు గంటన్నర సమయం పట్టే అవకాశాలున్నట్లు అధికారులు వెల్లడించారు. రాత్రి తొమ్మిదిన్నర తర్వాతే తొలి సమాచారం తెలిసే అవకాశం ఉంది. టేబుల్‌కు వేయి చొప్పున 56 వేల ఓట్లను ఏకకాలంలో లెక్కిస్తారని పేర్కొన్నారు.


ఆర్ ఆర్ ఆర్... అభిమానుల టెన్షన్...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Gullapally Rajesh]]>