HealthDivyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kidni-a50c0009-ed1b-4eed-83ec-4c1af69f66b4-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/kidni-a50c0009-ed1b-4eed-83ec-4c1af69f66b4-415x250-IndiaHerald.jpgప్రపంచ కిడ్నీ దినోత్సవంగా మార్చ్ 11 న ఒక ప్రత్యేక కథనంగా మీ ముందుకు తీసుకువస్తున్నాము. చాలామంది ఆరోగ్య విషయంపై శ్రద్ధ వహించక పోవడం వల్ల ఎంతో మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా రెండున్నర లక్షల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. అలాగే ప్రతి సంవత్సరం మూడున్నర కోట్ల మందికి డయాలసిస్ చేయాల్సి వస్తోంది. అయితే ఈ కిడ్నీ సమస్య రోజురోజుకూ పెరిగిపోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరి మదిలో ఎన్నో అనుమానాలు రkidni,;india;kathanamనిజానికి కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలానో తెలుసా ..?నిజానికి కిడ్నీ సమస్యను గుర్తించడం ఎలానో తెలుసా ..?kidni,;india;kathanamMon, 15 Mar 2021 11:00:00 GMTప్రపంచ కిడ్నీ దినోత్సవంగా మార్చ్ 11 న ఒక ప్రత్యేక కథనంగా మీ ముందుకు తీసుకువస్తున్నాము. చాలామంది ఆరోగ్య విషయంపై శ్రద్ధ వహించక పోవడం వల్ల ఎంతో మంది కిడ్నీ సమస్యలతో బాధపడుతున్నారు. ముఖ్యంగా మన భారతదేశంలో ప్రతి సంవత్సరం కొత్తగా రెండున్నర లక్షల మంది కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నట్లు ఒక అధ్యయనం ద్వారా తెలిసింది. అలాగే ప్రతి సంవత్సరం మూడున్నర కోట్ల మందికి డయాలసిస్ చేయాల్సి వస్తోంది. అయితే ఈ కిడ్నీ సమస్య రోజురోజుకూ పెరిగిపోవడంతో సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకూ ప్రతి ఒక్కరి మదిలో ఎన్నో అనుమానాలు రేకెత్తుతున్నాయి. అయితే ముందుగా కిడ్నీ సమస్యలు ఎందుకు ఎదురవుతాయో..? మన శరీరం లో కిడ్నీ సమస్యలు వచ్చే ముందు ఎలాంటి  మార్పులు సంభవిస్తాయో..?ఇప్పుడు తెలుసుకుందాం..


ముఖ్యంగా మనలో కిడ్నీ సమస్యలు రావడానికి ముఖ్య కారణం తీసుకునే ఆహరం పై ప్రత్యేక శ్రద్ధ వహించకపోవడమే.. మరీ ముఖ్యంగా మహిళలు పని ధ్యాసలో పడి అసలు తినడమే మానేస్తారు. మన శరీరంలో ఈ కిడ్నీ ల పని ఏంటంటే.. జీర్ణ వ్యవస్థ నుంచి వచ్చే వ్యర్థాలను, అదనపు ద్రవాలను బయటకు పంపించడానికి మొదటి పాత్ర వహిస్తుంది. మనం తీసుకునే ఆహారంలో మన శరీరానికి కావలసిన పోషకాలను మాత్రమే తీసుకొని  ఇక మిగతా పదార్థాన్ని విసర్జన రూపంలో బయటకు పంపిస్తుంది.


అలాగే రక్తపోటు ఎలక్ట్రోలైట్ స్థాయిలను నియంత్రించడానికి ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేస్తూ,  ఆరోగ్యకరమైన ఎముకలకు భరోసా ఇస్తుంది. అయితే ఇలాంటి కిడ్నీల విషయంలో జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ వీటి విషయంలో నిర్లక్ష్యం వహించినట్లయితే ప్రాణాలకే ముప్పు అని హెచ్చరిస్తున్నారు కూడా..


అయితే వీటిని ఎలా గుర్తించాలి అంటే మూత్రం రంగు మారినా, మూత్రం అసాధారణంగా ఉన్నా, కిడ్నీ సమస్య ఉన్నట్లే అని గుర్తించాలి. మరీ ముఖ్యంగా కిడ్నీలు పూర్తిగా చెడిపోతే రుచిని సరిగా ఆస్వాదించలేకపోవడం,  ఆకలి బాగా తగ్గిపోతుంది. తరచూ వికారం, వాంతులు రావడం లాంటివి జరుగుతాయి. ఎర్రరక్త కణాల ఉత్పత్తి తగ్గిపోవడం వల్ల అలసట, నీరసం, క్రమంగా మెదడు సంబంధిత అనారోగ్య సమస్యలు వస్తాయి. అలాగే రక్తహీనత కూడా ఏర్పడుతుంది. ముఖ్యంగా కిడ్నీలు ఉండే ప్రదేశంలో తీవ్రమైన నొప్పి, ఇన్ఫెక్షన్లు, రాళ్ల కు కూడా కారణమవుతాయి. వాతావరణం వేడిగా ఉన్నప్పటికీ చల్లగా ఉన్న ఫీలింగ్ కలుగుతుంది. ఇవన్నీ మన కిడ్నీలు సరిగా పనిచేయడం లేదనడానికి సంకేతంగా భావించాలి..


 కాబట్టి ఫ్రెండ్స్.. మీలో ఎవరైనా ఇలాంటి సమస్యలతో ఎదుర్కొంటున్నట్లు అయితే తక్షణమే వైద్యులను సంప్రదించి, అందుకు కావాల్సిన వైద్యం చేయించుకోవాల్సిందిగా కోరుచున్నాము..


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Divya]]>