SportsKISHOREeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/i-didnt-know-until-kohli-bhai-said-ishaan-kishan386a1430-7931-49a3-88f6-6a962643f42b-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/i-didnt-know-until-kohli-bhai-said-ishaan-kishan386a1430-7931-49a3-88f6-6a962643f42b-415x250-IndiaHerald.jpgభారత్-ఇంగ్లాండ్ మద్య జరిగిన రెండవ టీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నా సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ లో ఆటగాళ్లు అందరూ కూడా సమిష్టిగా విఫలం అవడంతో ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో టీమిండియా బ్యాట్స్ మెన్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రెండవ టీ20లో విజయం సాధించి ఆ విమర్శలు టీమిండియా చెక్ పెట్టింది. అయితే ఈ రెండవ మ్యాచ్ లో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ పై అందరి దృష్టి పడింది. ఆరంగేట్ర మ్యాచ్ తోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తనకు హాఫ్ సెంచరీ పూరsports news;bhavana;ishaan actor;rohit;mumbai;virat kohli;ishan kishan;india;england;jersey;interview;cheque;letter;yuva;international;paruguకోహ్లీ భాయ్ చెప్పేదాకా తెలియలేదు..: ఇషాన్ కిషన్ !!కోహ్లీ భాయ్ చెప్పేదాకా తెలియలేదు..: ఇషాన్ కిషన్ !!sports news;bhavana;ishaan actor;rohit;mumbai;virat kohli;ishan kishan;india;england;jersey;interview;cheque;letter;yuva;international;paruguMon, 15 Mar 2021 18:00:00 GMTభారత్-ఇంగ్లాండ్ మద్య జరిగిన రెండవ టీ20లో టీమిండియా అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నా సంగతి తెలిసిందే. మొదటి మ్యాచ్ లో ఆటగాళ్లు అందరూ కూడా సమిష్టిగా విఫలం అవడంతో ఘోర ఓటమిని చవి చూసింది. దీంతో టీమిండియా బ్యాట్స్ మెన్స్ పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో రెండవ టీ20లో విజయం సాధించి ఆ విమర్శలు టీమిండియా చెక్ పెట్టింది. అయితే ఈ రెండవ మ్యాచ్ లో యువ ఆటగాడు ఇషాన్ కిషన్ పై అందరి దృష్టి పడింది. ఆరంగేట్ర మ్యాచ్ తోనే హాఫ్ సెంచరీతో అదరగొట్టి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. అయితే తనకు  హాఫ్ సెంచరీ పూర్తి చేసిన విషయం అసలు తెలియలేదని అన్నాడు.

 మ్యాచ్ అనంతరం భారత బౌలర్‌ యజువేంద్ర చహల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఇషాన్‌ పలు విషయాలు వెల్లడించాడు. తన ఫిఫ్టీ కంప్లీట్ అయిన సంగతి విరాట్ భాయ్ చెప్పేదాక తెలియలేదని అన్నాడు. ‘‘ఓయ్‌.. టాప్‌ ఇన్నింగ్స్‌.. బ్యాట్‌ పైకెత్తు... స్టేడియం నలువైపులా చూడు’’ కోహ్లీ  అన్నడని, ఆ తరువాతే రియలైజ్ అయ్యనని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు. ఇంకా కోహ్లీ గురించి చెబుతూ.. కోహ్లి ఎనర్జీ సూపర్‌ అని, తనతో కలిసి ఆడటం సరికొత్త అనుభూతినిచ్చిందని పేర్కొన్నాడు.

ఇక ఐపీఎల్‌ జట్టు ముంబై ఇండియన్స్‌లో రోహిత్‌ శర్మ సారథ్యంలో ఆడిన ఇషాన్‌, రోహిత్‌ తనకు ఇచ్చిన సలహాల గురించి మీడియాతో పంచుకున్నాడు. ‘‘నేను మంచి క్రికెటర్‌గా ఎదగడంలో ఎంతో మంది పాత్ర ఉంది. అంతర్జాతీయ టీ20లో ఆడే ముందు రోహిత్‌ భాయ్‌ నాకు ఎన్నో సూచనలు చేశాడు. అలాగే ఐపీఎల్‌ మాదిరే స్వేచ్ఛగా ఆడుతూ పరుగులు రాబట్టాలని, ఒత్తిడి ఫీలైతే కష్టమని రోహిత్ సూచించినట్లు ఇషాన్ తెలిపాడు. మైదానంలో అడుగు పెడుతున్న సమయంలో కాస్త బెరుకుగా ఉన్నప్పటికి.. జాతీయ జట్టుకు ఆడుతున్నాననే భావన, టీమిండియా జెర్సీ వేసుకోగానే.. సరికొత్త ఉత్సాహం ఇచ్చిందని ఇషాన్ కిషన్ చెప్పుకొచ్చాడు.   


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - KISHORE]]>