PoliticsSRISHIVAeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-rama6f14a5e-a27f-4416-884e-bd5ab491eb40-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_latestnews/modi-rama6f14a5e-a27f-4416-884e-bd5ab491eb40-415x250-IndiaHerald.jpgశ్రీరాముడు సమాజ హితం కోరి పనిచేశారు. అందుకే భగవంతుడయ్యాడు. రాబోయే రోజుల్లో ప్రధని నరేంద్ర మోదీ కూడా అలా కానున్నారని ఉత్తరాఖండ్ సీఎం తీర్థసింగ్ రావత్ అన్నారు. రుషికుల్ ఆయుర్వేదిక్ మహావిద్యాలయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేశారు.modi ram;modi;deva;kirti;ramu;bharatiya janata party;india;uttarakhand;narendra modi;american samoa;prime minister;chief minister;sri krishna;narendraమోడీని రాముడితో పోల్చిన బీజేపీ సీఎంమోడీని రాముడితో పోల్చిన బీజేపీ సీఎంmodi ram;modi;deva;kirti;ramu;bharatiya janata party;india;uttarakhand;narendra modi;american samoa;prime minister;chief minister;sri krishna;narendraMon, 15 Mar 2021 20:22:23 GMTఉత్తరాఖండ్ కొత్త ముఖ్యమంత్రి తీర్థసింగ్ రావత్ సంచలన వ్యాఖ్యలు చేశారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని భగవంతుడితో పోల్చారు. ‘ద్వాపర, త్రేతాయగాలలో శ్రీరాముడు, శ్రీకృష్ణుడు వచ్చారు. శ్రీరాముడు సమాజ హితం కోరి పనిచేశారు. అందుకే భగవంతుడయ్యాడు. రాబోయే రోజుల్లో ప్రధని నరేంద్ర మోదీ కూడా అలా కానున్నారని ఉత్తరాఖండ్ సీఎం తీర్థసింగ్ రావత్  అన్నారు. రుషికుల్ ఆయుర్వేదిక్ మహావిద్యాలయ్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో పాల్గొన్న ముఖ్యమంత్రి.. ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధాని నరేంద్ర మోడీని ఆకాశానికెత్తేశారు.

ప్రధాని నరేంద్ర మోడీ పాలనాకాలంలో నూతన భారతం ఉదయించిందని చెప్పారు సీఎం రావత్. మోడీతో ఫొటో తీయించుకోవాలని వివిధ దేశాల అధ్యక్షులు, ప్రధానులు తాపత్రయ పడుతూ క్యూ కడుతున్నారన్నారు. తమ వంతు ఎప్పుడు వస్తుందోనని ఎదురు చూన్తున్నారని తెలిపారు.  మోడీ అధికారంలోకి రాకముందు దేశంలో అరాచకం తాండవించేదని.. ఇప్పుడు అంతా బాగుందని కీర్తించారు ఉత్తరాఖండ్ సీఎం  తీర్థసింగ్ రావత్.

భారత ప్రధాని, రాష్ట్రపతి ఏ దేశానికైనా వెళితే అక్కడి దేశాధినేతలు లేచి నిలుచుంటారని రావత్ అన్నారు. ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలో ప్రపంచంలోనే భారత్ తన శక్తియుక్తులను చాటింది. 200 ఏళ్ల పాటు భారత్‌ను బానిసగా చేసుకున్న అమెరికా ఇప్పుడు భారత్ దారిలో నడుస్తున్నదన్నారు. ఇది నరేంద్ర మోడీతోనే సాధ్యమయ్యిందన్నారు బీజేపీ ముఖ్యమంత్రి రావత్.

ఉత్తరాఖండ్ బీజేపీ తీర్థసింగ్ రావత్ వ్యాఖ్యలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాని మోడీని పొగడటంలో తప్పు లేదు కాని.. దేవుళ్లతో పోల్చడమేంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. పదవులు రావాలంటే, వచ్చిన పదవిని నిలబెట్టుకోవాలంటే ఇలాంటి ట్రిక్స్ చేయడం తప్పదని కొందరు సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. సీఎం రావత్ వ్యాఖ్యలపై కొన్ని హిందూ సంఘాల నుంచి కూడా వ్యతిరేకత వస్తోంది.

తీర్థసింగ్ రావత్ ఇటీవలే ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. గతంలో ఉన్న ముఖ్యమంత్రిని బీజేపీ హైకమాండ్ అర్ధాంతరంగా దింపేసి తీర్థసింగ్ కు ఆ పదవి కట్టబెట్టింది. ఇందుకు కృతజ్ఞతగానే ఆయన మోడీని రాముడితో పోల్చి  మాట్లాడారని చెబుతున్నారు.








కాజల్ అగర్వాల్ ని సడన్ గా అక్కయ్య అని సంబోధించిన మంచు విష్ణు.. !!

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - SRISHIVA]]>