Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/afghanistan-spinner-rashid-khan-rare-record-in-test-cricket4062a866-7931-4481-b27d-e0d4b0971cab-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/afghanistan-spinner-rashid-khan-rare-record-in-test-cricket4062a866-7931-4481-b27d-e0d4b0971cab-415x250-IndiaHerald.jpgఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టులో అత్యధికంగా 99.2 ఓవర్లు వేసినన తొలి బౌలర్‌ చరిత్ర సృష్టించాడు. అబుదాబిలో జింబాబ్వేతో జరిగిన టెస్టులో రషీద్ ఈ ఘనత సాధించాడు. ఒక టెస్టులో ఓ బౌలర్‌ ఇన్ని ఓవర్లు వేయడం గత 22 ఏళ్లలో ..rashid khan;sri lanka;zimbabwe;history;bobby;paruguఓ టెస్టుల్లో ఇన్ని ఓవర్లు ఎలా వేశావ్ సామీ.. రికార్డు స్థాయిలో..ఓ టెస్టుల్లో ఇన్ని ఓవర్లు ఎలా వేశావ్ సామీ.. రికార్డు స్థాయిలో..rashid khan;sri lanka;zimbabwe;history;bobby;paruguMon, 15 Mar 2021 08:04:17 GMTఇంటర్నెట్ డెస్క్: ఆఫ్ఘనిస్తాన్‌ స్పిన్నర్‌ రషీద్‌ ఖాన్‌ అత్యంత అరుదైన రికార్డు నెలకొల్పాడు. ఒక టెస్టులో అత్యధికంగా 99.2 ఓవర్లు వేసినన తొలి బౌలర్‌ చరిత్ర సృష్టించాడు. అబుదాబిలో జింబాబ్వేతో జరిగిన టెస్టులో రషీద్ ఈ ఘనత సాధించాడు. ఒక టెస్టులో ఓ బౌలర్‌ ఇన్ని ఓవర్లు వేయడం గత 22 ఏళ్లలో ఇదే మొదటిసారి. అంతకుముందు 1998 ఆగస్టులో శ్రీలంక స్నిన్నర్‌ ముత్తయ్య మురళీధరన్‌ ఒక టెస్టులో 113.5 ఓవర్లు వేశాడు. ఇంగ్లండ్‌తో ఓవల్‌లో జరిగిన మ్యాచ్‌లో మురళీధన్ ఈ రికార్డు సృష్టించాడు. అత్యధిక ఓవర్లు విసిరిన రికార్డును ఇంగ్లాండ్‌కు చెందిన బాబీ పీల్‌ కలిగి ఉన్నాడు. 1985 జనవరిలో ఆస్ట్రేలియాతో మెల్బోర్న్‌‌లో జరిగిన టెస్ట్‌లో పీల్ ఏకంగా 146.1 ఓవర్లు విసిరాడు. 6 వికెట్లు పడగొట్టాడు.

కాగా.. ఈ మ్యాచ్‌లో ఆదివారం ఆఫ్ఘనిస్తాన్‌ జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో రషీద్‌ మొత్తం 11 వికెట్లు పడగొట్టాడు. తొలి ఇన్నింగ్స్‌లో 36.3 ఓవర్లు వేసిన రషీద్.. 138 పరుగులు ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. ఇక రెండో ఇన్నింగ్స్‌లో 62.5 ఓవర్లు వేసిన రషీద్.. 137 పరుగులు ఇచ్చి ఏకంగా 7 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్‌ మొత్తంలో 11 వికెట్లు తీసినట్లైంది. అంతేకాకుండా రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఫస్ట్ స్పెల్‌లో 20 ఓవర్లు వేశాడు. రషీద్‌ ఇప్పటివరకు 5 టెస్టుల్లో 34 వికెట్లు పడగొట్టాడు. అయితే వాటన్నింటిలోకీ ఈ మ్యాచ్‌లో రషీద్‌ కెరీర్ బెస్ట్ గణాంకాలను నమోదు చేశాడు. మొత్తం 104 పరుగులకు అతని 11 వికెట్లు పడగొట్టి సత్తా చాటాడు. అయితే ఓ టెస్టులో అత్యధికంగా 16 వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా శ్రీలంక స్పిన్నర్ మురళీధరన్ పేరిట రికార్డు ఉంది.

ఇదిలా ఉంటే జింబాబ్వేతో జరిగిన మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘనిస్తాన్ 4 వికెట్ల నష్టానికి ఏకంగా 545 పరుగులు చేసి ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. ఆఫ్ఘన్ తరపున హజ్మతుల్లా షాహిదీ అజేయ డబుల్ సెంచరీతో నిలిచాడు. కెప్టెన్ అజ్గర్ ఆఫ్ఘాన్ కూడా 164 పరుగులు చేశాడు. ఆ తర్వాత బ్యాటింగ్‌కు దిగిన జింబాబ్వే జట్టు 287 పరుగులకే ఆలౌట్ అయింది. దీంతో ఫాలో ఆన్‌లో పడింది. అయితే ఫాలో ఆన్‌లో కూడా 365 పరుగులకు ఆలౌట్ అయింది. దీంతో 107 పరుగుల ఆధిక్యం సంపాదించిన జింబాబ్వే ఆఫ్ఘనిస్తాన్ ముందు 108 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. ఈ టార్గెట్‌ను కేవలం 4 వికెట్లు కోల్పోయిన ఆఫ్ఘన్ ఛేధించింది.




నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>