Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fatf307335a-ce3e-4016-8560-6a1c77f43bc2-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/fatf307335a-ce3e-4016-8560-6a1c77f43bc2-415x250-IndiaHerald.jpgప్రస్తుత కాలంలో అనేకమంది బాధపడుతున్న సమస్యల్లో అధిక బరువు సమస్య ఒకటి. ఈ అధిక బరువు సమస్యతో ఎంతోమంది తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు.అదేవిధంగా బరువు పెరగడంతో పాటు మరికొంత మందిలో పొట్ట చుట్టూ అధికంగా కొవ్వు పేరుకుపోయి ఎంతో అందవిహీనంగా కనిపిస్తుంటారు.ఈ కొవ్వును తగ్గించుకోవడం కోసం ఎన్నో రకాల ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఎలాంటి ఫలితం కనిపించదు. అయితే పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును,శరీర బరువును తగ్గించుకోవడానికి అద్భుతమైన ఈ టీ లను తాగటం వల్ల తొందరగా బరువును తగ్గించుకోవచ్చని ఆయుర్వేద నిపుణులు తెలfat;green tea;ayurveda;cholesterol;cinnamonపొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును... బరువును తగ్గించే అద్భుతమైన "టీ" లు..!పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును... బరువును తగ్గించే అద్భుతమైన "టీ" లు..!fat;green tea;ayurveda;cholesterol;cinnamonSun, 14 Mar 2021 10:00:00 GMTఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు. ఇంతకీ ఆ "టీ" లు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం..

*గ్రీన్ టీ:
ప్రతి రోజూ ఉదయం ఒక కప్పు గ్రీన్ టీ తాగడం వల్ల శరీర బరువును తొందరగా నియంత్రించుకోవచ్చు. గ్రీన్ టీ లో అధిక శాతం యాంటీబయాటిక్స్ కలిగి ఉండటం వల్ల శరీర బరువును నియంత్రించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అదేవిధంగా మన శరీరంలో మెటబాలిజం పెరగడంతో బరువును తగ్గించుకోవచ్చు.

*అల్లం టీ:
రెండు కప్పుల నీటిని బాగా మరిగించి అందులో కొద్దిగా అల్లం ముక్కలను వేసి బాగా మరిగించాలి.తరువాత దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ తేనె రెండు చుక్కల నిమ్మరసం కలుపుకొని తాగడం వల్ల మన శరీరంలో పేరుకుపోయిన కొవ్వు కరిగిపోయి శరీర బరువును తగ్గించుకోవచ్చు.

*దాల్చిన చెక్క టీ:
రెండు కప్పుల నీటిలోకి దాల్చిన చెక్క వేసి బాగా మరిగించాలి. తర్వాత ఈ నీటిలో ఒక టేబుల్ స్పూన్ తేనె కలిపి గోరువెచ్చగా త్రాగాలి.

*పసుపు దాల్చిన చెక్క టీ:
రెండు కప్పుల నీటిలో చిటికెడు పసుపు, ఒక టేబుల్ టీస్పూన్ దాల్చిన చెక్క పొడి, టేబుల్ టీస్పూన్ అల్లం తురుము వేసి బాగా మరిగించాలి.తర్వాత ఈ నీటిలో ఒక టేబుల్ టీ స్పూన్ తేనె కలుపుకొని తాగడం వల్ల మన శరీరంలో జీవక్రియ రేటు మెరుగుపడి, శరీరంలో పేరుకుపోయిన కొవ్వును కరిగించి శరీర బరువును నియంత్రిస్తుంది.

*బ్లాక్ టీ:
టీ పొడిని బాగా నీటిలో మరిగించి డికాషన్ చేసుకొని గోరువెచ్చగా ఉన్న వాటిలో కొద్దిగా నిమ్మరసం కలిపి తాగడం వల్ల సులభంగా బరువు తగ్గవచ్చు.

*పుదీనా టీ:
దాదాపు ఒక పది ఆకులు పుదీనా తీసుకుని రెండు కప్పుల నీటిలో బాగా మరిగించాలి. దీనిలోకి ఒక టేబుల్ స్పూన్ తేనె, అర టేబుల్ స్పూన్ నిమ్మరసం కలిపి త్రాగాలి. ఈ విధంగా ప్రతి రోజూ తాగటం వల్ల శరీర బరువును సులభంగా నియంత్రించుకోవచ్చు. పై తెలిపిన అన్ని టీ లలో అధికశాతం యాంటీఆక్సిడెంట్లు ఉండటం వల్ల మన శరీరానికి రక్షణ కల్పిస్తాయి.అదేవిధంగా హానికర బ్యాక్టీరియాలతో పోరాడి ఎటువంటి అంటు వ్యాధులను రాకుండా కూడా ఈ టీ లు కాపాడుతాయి.అదేవిధంగా మన శరీరానికి కావలసినంత రోగనిరోధక శక్తిని అందించడంలో ఇవి ముఖ్యపాత్ర వహిస్తాయని ఆయుర్వేద నిపుణులు తెలియజేస్తున్నారు


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>