Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/alchohol63390b76-111a-43b2-b55b-2712c9bc5774-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/alchohol63390b76-111a-43b2-b55b-2712c9bc5774-415x250-IndiaHerald.jpgగత సంవత్సరకాలంగా యావత్ ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా వైరస్‏కు వ్యాక్సిన్ వచ్చేసింది. కొవిడ్ వ్యాక్సిన్ రావడం అందిరికి సంతోషపెట్టే వార్త అయినా.. మందు తాగేవారికి నిరాశే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కరోనా వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందుగానీ లేదా ఆ తర్వాత కానీ మద్యం తాగకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. alchohol;health;king;king 1;coronavirusకరోనా వ్యాక్సిన్ తరువాత ఆల్కహాల్ తీసుకోవచ్చా..?కరోనా వ్యాక్సిన్ తరువాత ఆల్కహాల్ తీసుకోవచ్చా..?alchohol;health;king;king 1;coronavirusSun, 14 Mar 2021 16:00:00 GMT

బేసిక్ గానే ఆల్కహాల్ తీసుకోవడం ఆరోగ్యానికి మంచిది కాదు. అయితే, వ్యాక్సిన్ తరువాత ఆల్కహాల్ తీసుకోవడం వల్ల నష్టమేదైనా జరుగుతుందా? లేదా, వ్యాక్సిన్ పని చేయకుండా ఉంటుందా? లేదా, మీకేవైనా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయా? ఇలాంటి కొన్ని ప్రశ్నలకి ఇక్కడ సమాధానాలు ఉన్నాయి, వీటిని చదవడం వల్ల మీరు వ్యాక్సిన్ తీసుకోవడానికి ప్రిపేర్ అయి ఉంటారు.


నిజానికి, ఆల్కహాల్ వల్ల వ్యాక్సిన్ కి చెడు జరుగుతుందని సైంటిఫిక్ గా ఎక్కడా ప్రూవ్ కాలేదు. ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వ్యాక్సిన్ పని చేయకుండా పోతుందని చెప్పడానికి క్లినికల్ ఎవిడెన్స్ లేదు. అలాగే, మెడికల్ బోర్డ్స్ ఏవీ కూడా ఇలాంటి మార్గదర్శకాలు విడుదల చేయలేదు. భవిష్యత్‌లో ఇంఫెక్షన్ నుండి రక్షించడానికి వ్యాక్సిన్ వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్ యొక్క ప్రొడక్షన్ ని ఆల్కహాల్ డైరెక్ట్ గా ఎఫెక్ట్ చేయదు. అసలు, ఆల్కహాల్ యొక్క ప్రభావం తో కలిపి ఏ వ్యాక్సిన్ నీ స్టడీ చేయలేదు. కాబట్టి, ఆల్కహాల్ తీసుకోవడం మానేయాలనో, వ్యాక్సిన్ తీసుకోవద్దనో ప్రజలు వర్రీ అవ్వాల్సిన పనేమీ లేదు. అయినా కూడా, ఆల్కహాల్, ఇంకా ఇతర ఎడిటివ్స్ ని రెడ్యూస్ చేయడం లేదా తగ్గించడం అనేది సహజంగానే మంచి పద్ధతి. ఇందు వల్ల వ్యాక్సిన్ కి హెల్దీ రెస్పాన్స్ ఇచ్చే ఛాన్సెస్ పెరుగుతాయి.


వ్యాక్సిన్ కీ ఆల్కహాల్ తీసుకోవడానికీ డైరెక్ట్ గా సంబంధం ఏదీ లేకపోయినా, ఆల్కహాల్ వల్ల మన ఇమ్యూన్ ఫంక్షన్ ప్రభావితమవుతుంది. అందుకనే, వ్యాక్సిన్ తరువాత నలభై ఐదు రోజుల వరకూ ఆల్కహాల్ తీసుకోవద్దని చెబుతున్నారు. వ్యాక్సిన్ వల్ల ఉత్పత్తి అయ్యే యాంటీ బాడీస్ అవసరమైన రెస్పాన్స్ బిల్డ్ చేయడానికి సాధారణంగా మూడు వారాల సమయం తీసుకుంటాయి. స్పుత్నిక్ వీ వద్ద ఇచ్చిన రికమెండేషన్ మాత్రం బింజ్ డ్రింకింగ్ యొక్క ప్రతికూల ప్రభావం గురించి ప్రజలని హెచ్చరించడానికి ఇవ్వబడింది. ఇతర చేయవలసిన, చేయకూడని పనుల లాగానే, మాస్క్ ధరించడం, భౌతిక దూరం పాటించడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం ఆల్కహాల్ లిమిటెడ్ గా తీసుకోవడం వల్ల హెల్త్ ప్రాబ్లమ్స్ ని ప్రొటెక్ట్ చేయబడతారు, అంతే కానీ, వ్యాక్సిన్ తీసుకోవడానికి ఆల్కహాల్ మానేయడం కంపల్సరీ ఏమీ కాదు, అలాగే అది వ్యాకిన్ ఎఫెక్టివ్ గా పని చేయకుండా చేస్తుంది అనే దానికి క్లినికల్ ప్రూఫ్ ఏమీ లేదు.


వ్యాక్సిన్ తో సంబంధం లేకుండా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం అనేది బాడీకి మంచిది కాదు. ఇలా ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడమనేది చాలా కాలం జరిగితే ఇమ్యూనోసప్రెషన్ జరుగుతుంది. ఎక్కువ ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మీ ఇమ్యూనిటీ లెవెల్స్ కూడా రెడ్యూస్ అవుతాయి, కాబట్టి జాగ్రత్తగా ఉండడం అవసరం. లివర్ డిసీజ్, స్ట్రెస్ వంటి అనేక ఇతర సమస్యలకి కూడా ఎక్కువగా ఆల్కహాల్ తీసుకోవడం అనేది దారి తీస్తుంది. ఇవన్నీ కూడా శారీరక ఆరోగ్యానికి హానికరం. పైగా ఇవన్నీ కొవిడ్ 19 యొక్క కోమార్బిడిటీస్ కూడా. అందుకే, ఈ మహమ్మారి సమయంలో ఆల్కహాల్ తగ్గించడం మంచిదని సలహా ఇస్తున్నారు.


నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>