Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/archer-refused-to-shake-hands-with-moeen-ali5fd6581a-d283-4879-b4e7-2a3163602010-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/archer-refused-to-shake-hands-with-moeen-ali5fd6581a-d283-4879-b4e7-2a3163602010-415x250-IndiaHerald.jpgటీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆర్చర్ చక్కటి బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ గెలిచిన తరువాత ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. ఒకరినొకరు హగ్‌ చేసుకుంటూ కంగ్రాట్స్‌ చెప్పుకుంటున్నారు. ఇంతలో అదిల్‌ రషీద్‌ వద్దకు వచ్చిన ఆర్చర్‌ అతన్ని హగ్‌ చేసుకొని కంగ్రాట్స్‌ చెప్పాడు. రషీద్‌ వెనుకే ఉన్న మొయీన్‌ అలీ కూడా ఆర్చర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలని..cricket;ali;rahul new;rahul;rani;k l rahul;rahul sipligunj;shikhar dhawan;nijam;santosham;paruguఅలీని పట్టించుకోని ఆర్చర్.. వీడియో వైరల్అలీని పట్టించుకోని ఆర్చర్.. వీడియో వైరల్cricket;ali;rahul new;rahul;rani;k l rahul;rahul sipligunj;shikhar dhawan;nijam;santosham;paruguSun, 14 Mar 2021 19:43:57 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియాతో జరిగిన తొలి టీ20లో ఆర్చర్ చక్కటి బౌలింగ్ చేసిన విషయం తెలిసిందే. మ్యాచ్ గెలిచిన తరువాత ఇంగ్లండ్‌ ఆటగాళ్లు సంతోషంలో మునిగిపోయారు. ఒకరినొకరు హగ్‌ చేసుకుంటూ కంగ్రాట్స్‌ చెప్పుకుంటున్నారు. ఇంతలో అదిల్‌ రషీద్‌ వద్దకు వచ్చిన ఆర్చర్‌ అతన్ని హగ్‌ చేసుకొని కంగ్రాట్స్‌ చెప్పాడు. రషీద్‌ వెనుకే ఉన్న మొయీన్‌ అలీ కూడా ఆర్చర్‌కు షేక్‌ హ్యాండ్‌ ఇవ్వాలని ప్రయత్నించాడు. అయితే ఆర్చర్‌ మాత్రం అలీని పట్టించుకోలేదు. దీంతో మైండ్‌ బ్లాంక్‌ అయిన అలీ.. ఆర్చర్‌ను చూస్తూనే ఉండిపోయాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ అవుతోంది.

ఆర్చర్, అలీని ఇలా నెటిజన్లు మాత్రం దీనికి కారణాలను వెతికే పనిలో పడ్డారు. కొందరైతే.. ఆర్చర్‌, అలీ మధ్య విభేదాలున్నాయని.. అందుకే అలీని ఆర్చర్‌ పట్టించుకోలేదని కామెంట్లు చేశారు. ‘ఇ‍ద్దరి మధ్య ఏవేనా పాత గొడవలున్నాయేమో. అందుకే అలీ షేక్ ఇస్తున్నా ఆర్చర్ చూసీ చూడనట్లు ఉండిపోయాడు’ అంటూ మరికొందరు అభిప్రాయపడుతున్నారు. అయితే వీరిద్దరి మధ్య నిజంగా మనస్పర్థలున్నాయా..? లేక నిజంగానే అలీని ఆర్చర్ గమనించకపోవడం వల్లనే షేక్ హ్యాండ్ ఇవ్వలేదా..? అనే విషయాలు మాత్రం తెలియాల్సి ఉంది. కాగా..తుది జట్టులో రషీద్‌కు చోటు దక్కడంతో తొలి టీ20లో అలీ రిజర్వ్ బెంచ్‌కు పరిమితమయ్యాడు.

ఇదిలా ఉంటే ఇదిలా ఉంటే తొలి టీ20లో భారత జట్టుపై ఇంగ్లండ్ జట్టు ఘన విజయం సాధించింది. టీమిండియా టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌‌ను ఇంగ్లీస్ పేసర్లు ఆర్చర్, మార్క్ ఉడ్ బెంబేలెత్తించారు. ఓపెనర్లు కేఎల్ రాహుల్(1)‌ను రెండో ఓవర్లోనే అవుట్ చేసి ఆర్చర్ బోణీ కొట్టగా.. ఆ తరువాత టీమిండయా కెప్టెన్ కోహ్లీని రషీద్ ఖాన్ డక్ అవుట్ చేశాడు. ఇక మరో ఓపెనర్ శిఖర్ ధావన్(4) కూడా రెండంకెల స్కోర్ కూడా చేయకుండానే మార్క్ ఉడ్ బౌలింగ్‌లో పెవిలియన్ చేరాడు.

ఇంగ్లండ్ బౌలర్ల ధాటికి టీమిండియా కేవలం 124 పరుగులే చేయగలిగింది. అది కూడా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌(67) అర్థ సెంచరీతో రాణించడంతో ఆ స్కోర్ అయినా చేయగలిగింది. ఇక ఆ తరువాత భారత బౌలర్లను ఇంగ్లండ్ బ్యాట్స్‌మెన్ ఆడుకున్నారు. స్పిన్నర్ల బౌలింగ్‌లో బౌండరీల మోత మోగించారు. దీంతో మ్యాచ్‌లో ఇంగ్లీస్ జట్టు సునాయాసమైన విజయం సాధించింది.




నాగ్ స‌ర‌స‌న చంద‌మామ‌..క్లారిటీ ఇచ్చేసిందిగా.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>