WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/70/pregnant78b89930-596a-4c00-8c8f-fc1f3496b695-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/women/70/pregnant78b89930-596a-4c00-8c8f-fc1f3496b695-415x250-IndiaHerald.jpgమునకాయను ఇష్టపని వారంటూ ఉంటారు. చిన్న పిల్లల నుండి ముసలి వాళ్ళ వరకు అందరు మునకాయను ఎంతో ఇష్టంగా తింటారు. అయితే గర్భిణులు మునకాయ తినొచ్చా..? మునకాయను తినడం వలన ఏమైనా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో.. లేవో ఒక్కసారి చూద్దమా. మునగలో విటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. pregnant;jeevitha rajaseskhar;nithya new;vitamin;drumstick;aqua;ayurveda;ishtam;shaktiఅమ్మ: గర్భిణులు ములక్కాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?అమ్మ: గర్భిణులు ములక్కాయ తింటే ఏం జరుగుతుందో తెలుసా..?pregnant;jeevitha rajaseskhar;nithya new;vitamin;drumstick;aqua;ayurveda;ishtam;shaktiSat, 13 Mar 2021 15:00:00 GMTవిటమిన్ ఎ, సి, లతోపాటు క్యాల్షియం పుష్కలంగా ఉంది. నిత్య జీవితంలో ఎదుర్కొనే అనేక వ్యాధులను తగ్గించే శక్తి మునగ కలిగి ఉంది. కొన్ని వందల శారీరక రుగ్మతలు మునగ వల్ల నయమవుతాయి.

ఆరోగ్యంగా జీవించడానికి కావలసిన అన్ని రకాల పోషక పదార్థాలు మునగలో ఉన్నాయి. మునక్కాయ రుచిలో ఎంతో కమ్మనిది. అంతేకాదు ఇందులో మేలు చేసే పోషకాలు ఎన్నో ఉన్నాయి. వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరచడానికి మునక్కాయ ఎంతగానో దోహదపడుతుంది. మునక్కాయలో విటమిన్ ‘సి’ ఎక్కువ మోతాదులో ఉంటుంది. గొంతు బొంగురు పోయినపుడు, జలుబు చేసినపుడు మునక్కాయ తింటే ఉపశమనం లభిస్తుంది.

ఇక మునగలో లభించే పీచు, ఇతర పోషకాలు మలబద్ధకం సమస్య లేకుండా చేస్తాయి. జీవక్రియలను క్రమబద్దీకరిస్తాయి. ఆయుర్వేదం ప్రకారం మునగ వల్ల ఆస్తమా, శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. ఫలితంగా ఎముకలు ధృఢంగా ఉంటాయి. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. మునగ కాయలే కాకుండా ఆకులు కూడా చాలా బలమైన ఆహారం. మునక్కాయలో ‘బి’ విటమిన్ కూడా తగిన మోతాదులో ఉంది. జీర్ణక్రియను వేగవంతం చేస్తుంది.

అయితే శక్తిని అందించే ఫోలేట్లూ, విటమిన్ బి6, థయామిన్, రైబోఫ్లెవిన్ వంటివి మునక్కాయలో పుష్కలంగా ఉన్నాయి. గర్భిణులు మునక్కాయను ఎక్కువగా తినడం వల్ల ప్రసవ సమయంలో నొప్పుల బాధ తగ్గుతుంది. ప్రసవం తర్వాత వచ్చే చాలా సమస్యలకు పరిష్కారంగా పనిచేస్తుంది. వాంతులు, తల తిరగడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. తల్లిపాలు వృద్ధి అవుతాయి. మునక్కాయలో ఉంటే యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఇన్‌ఫెక్షన్లు రాకుండా కాపాడతాయి. మునగలోని యాంటీ ఆక్సిడెంట్లు అనేక వ్యాధులకు కారణమైన ఫ్రీరాడికల్స్‌ను బయటకు పంపించడంలో కీలకపాత్ర పోషిస్తాయి.


ఆర్ ఆర్ ఆర్... అభిమానుల టెన్షన్...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>