Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/74/former-cricketer-virender-sehwang-criticised-kohli-for-dropping-rohit-from-1st-test0cb74333-9b1f-4dd1-919b-929563599966-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore//images/sports/74/former-cricketer-virender-sehwang-criticised-kohli-for-dropping-rohit-from-1st-test0cb74333-9b1f-4dd1-919b-929563599966-415x250-IndiaHerald.jpgటీమిండియా కెప్టెన్ కోహ్లీపై మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాడు. ‘ఇలాంటి రూల్స్ నీకు కూడా వర్తిస్తాయా..?’ అంటూ మండిపడ్డాడు. తొలి టీ20లో టీమిండియా ఓటమి తరువాత వీరేంద్ర సెహ్వాగ్ ఈ వ్యఖ్యలు చేశాడు. మ్యాచ్ ముందు వరకు జట్టులో హిట్‌ మ్యాన్‌ రోహిత్ శర్మ ఉంటాడని చెబుతూనే చివర్లో అతడిని తుది జట్టు నుంచి తొలగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు..cricket;ajay;rahul new;rahul;rani;rohit;varsha;virat kohli;k l rahul;ravindra jadeja;rohit sharma;india;television;rahul sipligunj;icc t20;shikhar dhawan;kollu ravindra;parugu‘రోహిత్‌కేనా.. నీకు ఆ రూల్స్ లేవా..?’ కోహ్లీపై విరుచుకుపడ్డ వీరూ‘రోహిత్‌కేనా.. నీకు ఆ రూల్స్ లేవా..?’ కోహ్లీపై విరుచుకుపడ్డ వీరూcricket;ajay;rahul new;rahul;rani;rohit;varsha;virat kohli;k l rahul;ravindra jadeja;rohit sharma;india;television;rahul sipligunj;icc t20;shikhar dhawan;kollu ravindra;paruguSat, 13 Mar 2021 23:00:00 GMTరోహిత్ శర్మ ఉంటాడని చెబుతూనే చివర్లో అతడిని తుది జట్టు నుంచి తొలగించడాన్ని తీవ్రంగా తప్పుబట్టాడు. మ్యాచ్ ప్రారంభానికి ముందు వరకు రోహిత్ శర్మ జట్టులో ఉంటాడని అందరూ భావించినప్పటికీ.. కెప్టెన్‌ కోహ్లి అనూహ్య నిర్ణయంతో అభిమానులందరూ ఒక్కసారిగా షాక్‌కు గురయ్యారు.

టీ20 ప్రపంచకప్ సన్నాహకాల్లో భాగంగా రోహిత్‌ శర్మకు తొలి రెండు టీ20లకు విశ్రాంతినిస్తున్నట్లు కోహ్లి ప్రకటించడంతో అంతా ఆశ్చర్యపోయారు. అది కూడా టాస్ సమయంలో కోహ్లీ ఈ ప్రకటన చేయడం అనేకమందికి ఆగ్రహం కూడా తెప్పించింది. ఈ క్రమంలోనే కోహ్లీపై వీరూ విమర్శలు గుప్పించాడు.

ఆఖరి నిమిషంలో కీలక ఆటగాళ్లకు విశ్రాంతినిస్తున్నట్లు ప్రకటించడం ఎంత వరకు సమంజసమో ఆలోచించుకోవాలని కోహ్లిని నిలదీశాడు. ‘విశ్రాంతి పేరుతో జట్టులో నుంచి తప్పించే రూల్‌ నీకు కూడా వర్తిస్తుందా..?’ అంటూ కోహ్లిపై ధ్వజమెత్తాడు. జట్టు కెప్టెన్‌‌గా ఎలాంటి విశ్రాంతి లేకుండానే కోహ్లీ ఆడుతున్నాడని, కానీ ఇతర ఆటగాళ్లకు మాత్రం విశ్రాంతినిస్తుండడం ఏంటని..? ప్రశ్నల వర్షం కురిపించాడు. ‘రోహిత్‌ లాంటి ఆటగాడు మ్యాచ్‌లో లేకపోతే నా టీవీ ఆటోమేటిక్‌గా ఆఫ్‌ అవుతుందం’టూ చురకలంటించాడు. ఇక తొలి టీ20లో భారత్ ఓటమికి స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మను పక్కన పెట్టడమే కారణమంటూ మాజీ క్రికెటర్‌ అజయ్ జడేజా కూడా ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఇది చాలా చెత్త ఆలోచనంటూ విమర్శించాడు.

ఇదిలా ఉంటే రోహిత్ గైర్హాజరీతో బరిలోకి దిగిన భారత జట్టు తగిన మూల్యమే చెల్లించుకుంది. ముఖ్యంగా టాపార్డర్ బ్యాట్స్‌మెన్‌ దారుణంగా విఫలమైంది. ఓపెనర్లు కేఎల్ రాహుల్(1), శిఖర్ ధావన్(4) సింగిల్ డిజిట్‌కే పరిమితం కాగా.. కెప్టెన్ కోహ్లీ(0) కనీసం ఆ స్కోరు కూడా చేయలేకపోయాడు. ఆదిల్ రషీద్ బౌలింగ్ 5 బంతులు ఆడిన కోహ్లీ అనవసరమైన షాట్‌కు ప్రయత్నించి మిడ్ ఆన్‌లో ఆర్చర్‌కు సులభమైన క్యాచ్ ఇచ్చి పెవిలియన్‌కు చేరాడు. దీంతో భారత్ 7 వికెట్ల నష్టానికి కేవలం 124 పరుగులే చేయగలిగింది. అది కూడా మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్ శ్రేయాస్ అయ్యర్‌(67) అర్థ సెంచరీతో రాణించడంతో ఆ స్కోర్ అయినా చేయగలిగింది. ఇక ఆ తరువాత భారత బౌలర్లు కూడా విఫలమయ్యారు. స్పెషలిస్ట్ పేసర్ లకపోవడం, పేస్ వికెట్‌పై ముగ్గురు స్పిన్నర్లతో బరిలోకి దిగడం టీమిండియాను తీవ్రంగా దెబ్బతీశాయి.




ఆర్ ఆర్ ఆర్... అభిమానుల టెన్షన్...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>