Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hair93a21257-228c-4d82-84cf-562dd547d92f-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/hair93a21257-228c-4d82-84cf-562dd547d92f-415x250-IndiaHerald.jpg జుట్టు అందంగా ఉండాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అన్నీ మనం అనుకున్నట్లు ఉండదు. జుట్టు ఒత్తుగా ఉండి, చివర్లో వంకీలు తిరిగి ఉండటం అందంగా కనిపిస్తుంది. అలా ఉండాలంటే ఈ క్రింది టిప్స్ ను పాటించండి.. hair;tiru;eggఅలల్లా మెరిసే జుట్టు కావాలా... అయితే ఈ టిప్స్ పాటించండి...!అలల్లా మెరిసే జుట్టు కావాలా... అయితే ఈ టిప్స్ పాటించండి...!hair;tiru;eggSat, 13 Mar 2021 09:00:00 GMT
 అర కప్పు పాలు, అరకప్పు నీళ్లు ఒక  బాటిల్ లోకి తీసుకోవాలి. తర్వాత చిక్కు  లేకుండా తీసుకొని ఇప్పుడు బాటిల్లోని  మిశ్రమాన్ని తలంతా  బాగా అప్లై చేయాలి. కొద్దిసేపు తర్వాత బాగా దువ్వుకోవాలి. 30  నిమిషాల తరువాత బాగా కడుక్కొని  తడిగా  ఉన్నప్పుడే పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనతో దువ్వుకోవాలి. వారానికి రెండు మూడు సార్లు ఇలా చేయడం వల్ల వెంట్రుకలు అడుగు భాగం నుండి వంకీల్లా తిరగడం ప్రారంభమవుతుంది.

 ఒక కప్పు ముల్తానామట్టి తీసుకొని అందులోకి ఒక గుడ్డులోని తెల్లసొన, రెండు టీ స్పూన్లు బియ్యప్పిండి, కొద్దిగా నీళ్లు వేసి పేస్ట్ లా తయారు చేసుకోవాలి. ఈ పేస్ట్ ను తలంతా మర్దనా చేసి అర్ధగంట  తర్వాత దువ్వుకోవాలి. అలాగే రెండు గంటల సేపు ఉండి తలస్నానం చేయడం వల్ల వెంట్రుకలు  వంకీల్లా తిరగడం మొదలవుతుంది.

 కొబ్బరికాయ తీసుకొని అందులోనే కొబ్బరి పాలను తయారు చేసుకోవాలి. అందులోకి  ఒక నిమ్మకాయ రసం పిండి ఒక డబ్బాలో పెట్టి  ఫ్రిడ్జ్ లో  స్టోర్ చేసుకోవాలి. మరుసటి రోజుకి ఆ క్రీము  గట్టిగా అవుతుంది. దీన్ని వెంట్రుకలకు బాగా మర్దన చేయాలి. తర్వాత వేడినీళ్ళలో ముంచిన టవల్ తో తలకు చుట్టుకోవాలి. గంట తర్వాత తలస్నానం చేసి పెద్ద పళ్ళు ఉన్న దువ్వెనతో దువ్వుకోవాలి. ఈ విధంగా వారానికి మూడు సార్లు చేయడం వల్ల వెంట్రుకలు వంకీల్లా తిరుగుతాయి.

 ఒక  కప్పు నీటిలో ఒక స్పూన్ తేనె వేసి తలంతా బాగా మసాజ్ చేయాలి. ఐదు నిమిషాలు అలాగే వదిలేసి ఆ తర్వాత నీళ్లతో స్నానం చేయాలి. ఇలా వారానికి రెండు మూడు సార్లు చేయడం వల్ల వెంట్రుకలు అడుగుభాగం నుంచి వంకిల్లా తిరగడం  మొదలవుతుంది.


ఆర్ ఆర్ ఆర్... అభిమానుల టెన్షన్...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>