Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/fans-wondering-for-rahul-spectacular-catch9521521f-2cf6-42e7-8213-c0b584758829-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/fans-wondering-for-rahul-spectacular-catch9521521f-2cf6-42e7-8213-c0b584758829-415x250-IndiaHerald.jpgటీమిండియా ఫిట్‌నెస్ ప్రస్తుతం టాప్‌క్లాస్‌లో ఉంది. ఆటగాళ్లంతా మైదానంలో చిరుతల్లా కదులుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నారు. ఇక బౌండరీల వద్ద మన వాళ్ల ఫీల్డింగ్ చూస్తే ఎవరైనా ఔరా..! అనాల్సిందే. అలాంటి అసాధ్యమైన ఫీట్స్ చేస్తూ బౌండరీ లైన్‌ను కాపలా కాస్తున్నారు. దీనికి ఉదాహరణే....kl rahul;chiranjeevi;rahul new;rahul;k l rahul;cricket;twitter;rahul sipligunj;icc t20;sardar vallabhai patel;fidaa;paruguరాహుల్ సూపర్ క్యాచ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్రాహుల్ సూపర్ క్యాచ్.. ఫిదా అవుతున్న ఫ్యాన్స్kl rahul;chiranjeevi;rahul new;rahul;k l rahul;cricket;twitter;rahul sipligunj;icc t20;sardar vallabhai patel;fidaa;paruguSat, 13 Mar 2021 13:31:56 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియా ఫిట్‌నెస్ ప్రస్తుతం టాప్‌క్లాస్‌లో ఉంది. ఆటగాళ్లంతా మైదానంలో చిరుతల్లా కదులుతూ ప్రత్యర్థిని బెంబేలెత్తిస్తున్నారు. ఇక బౌండరీల వద్ద మన వాళ్ల ఫీల్డింగ్ చూస్తే ఎవరైనా ఔరా..! అనాల్సిందే. అలాంటి అసాధ్యమైన ఫీట్స్ చేస్తూ బౌండరీ లైన్‌ను కాపలా కాస్తున్నారు. దీనికి ఉదాహరణే.. తాజాగా ఇంగ్లండ్‌తో జరిగిన టీ20 సిరీస్‌లో కేఎల్ రాహుల్ ఆపిన్ ఓ సిక్స్. ఏ మాత్రం క్షణకాలం మిస్ అయినా సిక్స్ అయ్యే బంతిని అమాంతం గాల్లోకి ఎగిరి అందుకోవడమే కాకుండా.. దానిని తిరిగి మైదానంలోకి విసిరేశాడు. అయితే అక్కడ ఫీల్డర్ ఎవరూ లేకపోవడంతో బంతి కిందపడింది. సిక్స్ ఖాయం అనుకుంటే కేవలం రెండు పరుగులు మాత్రమే ఇచ్చాడు. కానీ రాహుల్ చేసిన ఈ అత్యద్భుత ఫీల్డింగ్‌కు మాత్రం క్రికెట్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు.

ఇంగ్లండ్ ఇన్నింగ్స్‌‌లో ఐదో ఓవర్‌ను అక్షర్ పటేల్ వేశాడు. తొలి బంతికే బట్లర్ లాంగాన్ మీదుగా భారీ షాట్ బాదాడు. అది కచ్చితంగా సిక్స్ అని అందరూ అనుకున్నారు. కానీ బౌండరీ లైన్ వద్ద ఫీల్డింగ్ చేస్తున్న రాహుల్ గాల్లోకి ఎగిరి క్యాచ్ అందుకున్నాడు. ఆ తరువాత తాను బౌండరీ లైన్ బయట పడిపోతున్నానని తెలియగానే వెంటనే బంతిని బౌండరీ లైన్ లోపలికి విసిరేశాడు. దీంతో సిక్స్ అనుకున్న చోట కేలం 2 పరుగులే వచ్చాయి. ప్రస్తుతం రాహుల్ చేసిన ఈ స్పెక్టాక్యులర్ ఫీల్డింగ్‌కు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇక టెస్ట్ సిరీస్‌లానే టీ20 సిరీస్‌ను కూడా టీమిండియా ఓటమితోనే ఆరంభించింది. శుక్రవారం జరిగిన తొలి టీ20లో ఇంగ్లండ్ బౌలర్లను భారత బ్యాట్స్‌మెన్ ఎదుర్కోలేకపోయారు. ప్రధానంగా ఇంగ్లీష్ పేసర్లు మ్యాచ్‌లో పూర్తి ఆధిపత్యం చెలాయించారు. టీమిండియా టాపార్డర్‌ను పేకమేడల్లా కూల్చేశారు. మిడిలార్డర్ బ్యాట్స్‌మెన్(67) ఒక్కడే ఒంటరి పోరాటం చేయడంతో నిర్ణీత 20 ఓవర్లలో కేవలం 124 పరుగులు మాత్రమే చేసింది. అనంతరం బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ భారత బౌలర్లను దీటుగా ఎదుర్కొంది. దీంతో కేవలం 2 వికెట్లు మాత్రమే కోల్పోయి 125 పరుగుల టార్గెట్‌‌ను మరో 27 బంతులు మిగిలుండగానే మ్యాచ్‌ను కైవసం చేసుకుంది.
" style="height: 369px;">






చంద్రబాబుపై కేసు విషయంలో వైసీపీ చేసిన పెద్ద తప్పుఇదేనా...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>