Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/74/icc-shares-the-pic-of-hardik-smashin-a-boundary-in-a-unique-way4f3022a2-541a-43ff-bd0c-61969cbd0df9-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/74/icc-shares-the-pic-of-hardik-smashin-a-boundary-in-a-unique-way4f3022a2-541a-43ff-bd0c-61969cbd0df9-415x250-IndiaHerald.jpgఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. దీంతో ఇంగ్లీష్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ కొట్టిన కొన్ని షాట్లు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా కొట్టిన ఓ షాట్‌ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో..cricket;cricket;hardik pandya;twitter;international;ben stokes;fidaa‘ఈ షాట్‌కు మేం పేరు పెట్టలేం మీరే పెట్టుకోండి’‘ఈ షాట్‌కు మేం పేరు పెట్టలేం మీరే పెట్టుకోండి’cricket;cricket;hardik pandya;twitter;international;ben stokes;fidaaSat, 13 Mar 2021 23:08:31 GMTఇంటర్నెట్ డెస్క్: ఇంగ్లండ్‌తో జరిగిన తొలి టీ20లో టీమిండియా ఘోరంగా విఫలమైంది. బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్.. అన్ని విభాగాల్లోనూ విఫలమైంది. దీంతో ఇంగ్లీష్ జట్టు సునాయాసంగా విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్‌లో టీమిండియా బ్యాట్స్‌మెన్ కొట్టిన కొన్ని షాట్లు మాత్రం ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. తాజాగా టీమిండియా ఆల్‌రౌండర్ హార్దిక్‌ పాండ్యా కొట్టిన ఓ షాట్‌ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఈ షాట్‌కు ఏకంగా అంతర్జాతీయ క్రికెట్‌ మండలి(ఐసీసీ)సైతం ఫిదా అవుతోంది. ఇదొక అసాధారణమైన షాట్‌ అంటూ తన ట్విటర్ ఖాతాలో  పోస్ట్‌ చేసింది. అంతేకాదు.. ఈ షాట్‌కు ఏం పేరు పెట్టాలో అర్థం కావడం లేదని, ఫ్యాన్సే ఈ షాట్‌కు మంచి పేరు పెట్టాలని సవాల్‌ చేసింది.

టీమిండియా ఇన్నింగ్స్‌ సమయంలో బెన్‌ స్టోక్స్‌ వేసిన 15వ ఓవర్‌లో హార్దిక్‌ ఓ ఫోర్‌ కొట్టాడు. స్టోక్స్‌ విసిరిన షార్ట్‌ పిచ్‌ బంతిని వికెట్ కీపర్ తలపైనుంచి సునాయాసంగా కట్‌ షాట్‌ చేశాడు. అంతే ఆ బంతి నేరుగా బౌండరీకి వెళ్లిపోయింది. దీనికోసం తన శరీరాన్ని దాదాపు నేలగా ఆన్చి మరీ హార్దిక్‌ ఆ ఫ్లిక్‌ చేశాడు. ఆ బంతిని కచ్చితంగా చూడకపోయినప్పటికీ కేవలం టైమింగ్‌తోనే దాన్ని బౌండీరి తరలించారు. ఆ షాట్‌ చూసిన బౌలర్ స్టోక్స్, కీపర్ బట్లర్‌లు షాకవ్వడం తప్ప ఏమీ చేయలేకపోయారు. ఈ షాట్‌ సంబంధించిన ఫోటోను ఐసీసీ తన ట్విటర్‌లో షేర్ చేసింది. ఈ షాట్‌ను ఏమని పిలవాలో అర్థం కావడం లేదని, అభిమానులే ఓ పేరు పెట్టాలని కోరింది.

ఐసీసీ విసిరిన సవాల్‌కు ఫ్యాన్స్ కూడా అదే స్థాయిలో రియాక్ట్ అవుతున్నారు.  హార్దిక్ షాట్‌కు ‘ద సోఫా’ షాట్‌ పేరు పెట్టాలని ఓ నెటిజన్ కామెంట్ చేస్తే..  మరో నెటిజన్ ‘ద మ్యాట్రిక్స్‌ షాట్‌’ అని పేరు పెట్టాలంటూ సలహా ఇచ్చారు. ‘హార్దిక్‌కట్‌’ అని పేరు పెట్టాలని మరొకరు సూచించగా.. మరో క్రికెట్ అభిమాని మరింత ముందుకెళ్లి.. హార్దిక్‌ నేలకు పడిపోయినంతలా వెనక్కి వంగి ఈ షాట్‌ ఆడాడడం వల్ల దీనికి ‘పారలెల్‌ గ్రౌండ్‌ షాట్‌’ అని పెట్టాలని సూచించారు. మరికొందరైతే ఇది పాండ్యా స్కూప్‌ అని చమత్కరిస్తున్నారు. మరి ఈ షాట్‌కు మీరు కూడా పేరు పెట్టాలనుకుంటే ఐసీసీ ట్వీట్‌కు రిప్లై ఇవ్వండి. ఇంకెందుకు ఆలస్యం.

" style="height: 370px;">






చంద్రబాబుపై కేసు విషయంలో వైసీపీ చేసిన పెద్ద తప్పుఇదేనా...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>