Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-virus-aokakunda-patinchalsina-jagrathalu4a494936-d676-4d67-a443-b07ee536a311-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/corona-virus-aokakunda-patinchalsina-jagrathalu4a494936-d676-4d67-a443-b07ee536a311-415x250-IndiaHerald.jpgదేశవ్యాప్తంగా ప్రజలందరికీ కరోనా మహమ్మారి కి కావడానికి దేశమంతా ప్రణాళికబద్ధంగా చర్యలు ప్రారంభం అవుతున్న వేళ కరోనా వ్యాక్సిన్ వేయించుకోవడానికి అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే ప్రతి ఒక్కరికి టీకాలు అందడానికి చాలా సమయం పట్టే అవకాశం ఉంది. వైరస్ ఇన్ఫెక్షన్ సోకిన వారిలో జ్వరం,దగ్గు మరియు అలసట అనేవి సాధారణ లక్షణాలు గా ఇప్పటికీ వైద్య నిపుణులు ఉంచడం జరుగుతోంది. అయితే ఈ వైరస్ నుంచి మనం ఎదుర్కోవడానికి మనకు కావాల్సిన శక్తిని మన ఇంట్లో కొన్ని పనులు చేయడం ద్వారా మహమ్మారి సోకకుండా జాగ్రత్త పడవచ్చు. అcorona;thulasi;tulasi;oil;ayurveda;cinnamon;shakti;coronavirusకరోనా వైరస్ సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తలు...?కరోనా వైరస్ సోకకుండా పాటించాల్సిన జాగ్రత్తలు...?corona;thulasi;tulasi;oil;ayurveda;cinnamon;shakti;coronavirusSat, 13 Mar 2021 05:00:00 GMT

పొడి అల్లం, తులసి ఆకులతో గోరువెచ్చని నీరు తరచుగా తాగుతూ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సులభమైన మిశ్రమం తయారు చేయడానికి పొడి అల్లం ముక్కలో కొంచెం నీరు వేసి ఉడకబెట్టాలి. తులసి ఆకులను నీటిలో వేసుకుని సాధ్యమైనంత ఎక్కువగా త్రాగుతూ ఉండాలి.

తాజాగా వండిన వెచ్చని పదార్థాలనే తింటూ ఉండాలి. మీ భోజనంలో ఉప్పు తక్కువగా ఉండే వంటలు, నూనె స్వల్పంగా వేసిన వంటలు మాత్రమే తినాలి. మూంగ్ దాల్ సూప్ వంటిని కూడా తీసుకోవచ్చు. తినే భోజనం కూడా అతిగా తినవద్దు, వాస్తవంగా చెప్పాలంటే భోజనం తిన్న తర్వాత కూడా కడుపు సగం ఖాళీగా ఉండేలా తినాలని నిపుణులు సూచిస్తున్నారు. అంటే తీసుకునే ఆహారం మితంగా తీసుకోవాలని ఆయుర్వేద వైద్య నిపుణులు సూచిస్తున్నారు. రాత్రి 7 గంటలకు ముందే మీ రాత్రి భోజనం లేదా అల్పాహారం పూర్తి చేసేలా మీ దినచర్యను ప్లాన్ చేసుకోండి.

భారతీయ సుగంధ ద్రవ్యాలకు వ్యాధులను నయం చేసే శక్తి ఉందని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. అందువల్ల మీరు తినే పదార్థాల్లో దాల్చిన చెక్క, మిరియాలు, యాలకులు, సోంపు మరియు లవంగాలు వంటి సుగంధ ద్రవ్యాలతో వండిన పదార్థాలను తింటూ ఉండండి. ఎండబెట్టిన పసుపు, ఎండబెట్టిన అల్లం కూడా మన శరీరంలో రోగనిరోధక శక్తిని పెంపొందిస్తాయి.


ప్రతిరోజు రాత్రి సమయంలో 8 గంటల నిద్ర తప్పకుండా ఉండేలా ప్లాన్ చేసుకోండి. మానవునిలో రోగనిరోధక శక్తి తయారవ్వాలన్నా, రోగనిరోధక వ్యవస్థ స్థిరంగా పనిచేయలన్నా కూడా మనిషికి తగినంత నిద్ర అవసరం. పగటిపూట నిద్రపోకుండా ఉండటానికి వీలైనంత మేరకు ప్రయత్నించండి. పగటిపూట నిద్రపోయే అలవాటు ఉన్నవారు క్రమంగా ఆ అలవాటును మానుకుంటే రాత్రి సమయాల్లో నిద్ర త్వరగా వచ్చే అవకాశముంది. తద్వారా ఈ విధమైన దినచర్య వల్ల రోగనిరోధక వ్యవస్థ స్థిరంగా పనిచేసే అవకాశం కలుగుతుంది.


బాగా ఉడికించిన కూరగాయలు మాత్రమే కూరలు చేసుకుని తినండి. పచ్చి కూరగాయలు లేదా సలాడ్లు వంటి వాటిని ఎక్కువగా తినకండి. కాకరకాయ, బూడిద గుమ్మడికాయ వంటి కూరగాయలతో చేసిన కూరలు తినడం చాలా మంచిది . వంకాయలు, టమోటా, బంగాళాదుంప మరియు క్యాప్సికం వంటి కూరగాయలతో చేసిన కూరలను తినడం తగ్గించండి.వ్యాధి లక్షణాలున్నవారు గుదుచి 1000 మి.గ్రా టాబ్లెట్ తీసుకోవాలని నిపుణులు సలహా ఇస్తున్నారు.దగ్గు కూడా ఉంటే, ఒక టేబుల్ స్పూన్ తేనెను నల్ల మిరియాల పొడితో కలిపి రోజుకు మూడు, నాలుగు సార్లు తీసుకోవచ్చు. గొంతు మంట కూడా ఉంటే, వ్యోషాది వటకం అనే మూలికను రోజులో ఎక్కువ సార్లు నమలుతూ ఉండవచ్చు.


మ‌ల‌యాళ హీరోల‌తో జ‌త క‌ట్ట‌డానికి కార‌ణం అదేనా..?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>