LifeStylesravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/snake7c7afaf2-d312-4139-94de-58aadb834c45-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/snake7c7afaf2-d312-4139-94de-58aadb834c45-415x250-IndiaHerald.jpgప్రతి ఒక్కరికీ కలలు వస్తాయి. చిన్న, పెద్ద, ఆడ, మగ.. ఇటువంటి తేడాలు లేకుండా అందరికీ కలలు వస్తాయి. గతంలో మన జీవితంలో జరిగిన ఘటనల ఆధారంగా వచ్చే కలలు ఓ రకం. కొంత మందిలో తీరని కోరికలకు ప్రతిరూపమే కలలు. భవిష్యత్తులో జరగబోయే అంశాలపై వచ్చేవి మరో రకం. ఒక విధంగా చెప్పాలంటే మన మానసిక స్థితికి ప్రతిరూపాలే ఈ కలలు. అందుకే మనం పడుకునే సమయంలో ఆనందంగా ఉంటే కలలు ఒకలా ఉంటాయి. బాధతో ఉంటే వచ్చే కలలు మరోలా ఉంటాయి. snake;jeevitha rajaseskhar;nidhi;police;arrest;prize;anandamకలలో మీకు పాము కనిపించిందా...?కలలో మీకు పాము కనిపించిందా...?snake;jeevitha rajaseskhar;nidhi;police;arrest;prize;anandamFri, 12 Mar 2021 05:00:00 GMT
 లాటరీ టికెట్ ప్రైజ్ మనీ గెల్చుకున్నట్టు, నిధి నిక్షేపాలు దొరికినట్టు, పోలీసులు అరెస్ట్ చేసినట్టు, నచ్చిన అమ్మాయితో విదేశాలు వెళ్లినట్టు.. ఇలా రకరకాల కలలు వస్తుంటాయి. ఇంతకీ ఈ కలల వెనుక నిజమేంటి ? ఎటువంటి కల ఎందుకు వస్తుంది ? ఏ కల వస్తే ఏమవుతుంది? వంటి విషయాలపై సైకాలజిస్టులు పలు ఆసక్తికర విషయాలు చెబుతున్నారు. అవేంటో చూద్దాం.

మనం పడుకోబోయే ముందుకు ఏదైతే ఆలోచిస్తామో ఆ అంశానికి సంబంధించి కలలే వచ్చే అవకాశం ఉంది. అంటే.. పడుకోబోయే ముందు శృంగారం గురించి ఎక్కువగా ఆలోచిస్తే అటువంటి కలలే ఎక్కువగా వస్తాయట. అలాగే.. మీ పార్ట్‌నర్‌తో మీకు ఫిజికల్ బాండింగ్ లేకపోవడం వల్ల కూడా ఇలాంటి కలలు ఎక్కువగా వచ్చే అవకాశం ఉందట. ఇక.. ఎక్కువ సేపు పోర్న్ వీడియోలు చూసినా అవే కలలు వస్తాయని పలు పరిశోధనలు చెబుతున్నాయి.మనం మెంటల్‌గా ఫిట్‌గా లేకపోతే ఇటువంటి కలలు వచ్చే అవకాశం ఉందట. అలాగే.. కొన్ని రకాల మందులను ఉపయోగించి ఉన్నట్టుండి ఆపేసినా పీడ కలలు వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారు. ఐతే ఇటువంటి కలలు రాకుండా ఉండాలంటే కొన్ని రకాల సైకాలజీ టెక్నిక్స్ ఉపయోగించాలట.


కలలో చేపలు కనిపిస్తే మిమ్మల్ని అదృష్టం వరించబోతున్నట్టు అర్థమట. తెల్ల రంగు పాము కలలో కనిపిస్తే మీరు త్వరలో ఓ గొప్ప ఘనత సాధించబోతున్నారని ‘స్వప్న శాస్త్రం’ చెబుతోంది. కుక్కలు అరిచినట్టు, పిల్లిని చంపినట్టు, గుడ్లగూబలు అరిచినట్టు, తేనెటీగలు కుట్టినట్టు కలలు వస్తే అశుభం అని కొంతమంది భావిస్తారు. కలలో మెరుపులు, ఉరుములు, పిడుగులు కనిపించడం కూడా మంచిది కాదట.

ఓ బిల్డింగ్ లేదా ఎత్తైన ప్రదేశం నుంచి ఎవరో మిమ్మల్ని కిందకి తోసేస్తే కిందకి పడుతూ దేన్నియినా పట్టుకుని ప్రాణాలు కాపాడుకున్నట్టు కల వచ్చిందా ? మీకు నచ్చిన వ్యక్తులతో గొడవలైనా, మీ లవర్‌తో బ్రేకప్ అయినా, కుటుంబంలో తగాదాలు మొదలైనా ఇలాంటి కలలు వస్తాయని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. దీన్ని సూక్ష్మంగా పరిశీలిస్తే మనకు మరో విషయం కూడా అర్థం అవుతుంది. రిలేషన్‌షిప్ కట్ చేసుకోకుండా ఉండేందుకు మనకు మరొక్క అవకాశమే మిగిలి ఉందని మనల్ని అలెర్ట్ చేస్తున్నట్టుగా కూడా భావించవచ్చు.


జాగ్ర‌త్త‌.. అమెరికాకు ఉత్త‌ర‌కొరియా హెచ్చ‌రిక‌

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !

ప‌సుపు బోర్డుపై క్లారిటీ వ‌చ్చేసింది... ఇక అర‌వింద్‌కు సెగ మొద‌లైన‌ట్టేనా..?!

విశాఖ మీద పెరిగిన ఫోకస్...?




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>