Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/england-former-captains-nasir-hussain-and-kevin-petersen-angry-on-ecbc6ac1311-8ba2-40da-9976-1d31dd26e921-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/england-former-captains-nasir-hussain-and-kevin-petersen-angry-on-ecbc6ac1311-8ba2-40da-9976-1d31dd26e921-415x250-IndiaHerald.jpgటీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఇటీవల 4 టెస్టుల సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. అయితే సిరీస్ జరుగుతున్నంత సేపూ భారత్‌పై, బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విపరీతంగా అక్కసు వెళ్లగక్కారు. టీమిండియా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఇలాంటి టర్నింగ్ పిచ్‌లను రెడీ చేసిందని, ఇది టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదని నోటికొచ్చినట్లు మాట్లాడారు. భారత బ్యాట్స్‌మెన్..england cricket;cricket;india;sri lanka;bcci;2020;interview;icc t20మాట మారుస్తున్న మాజీలు.. ఇంగ్లండ్ ఓటమికి కారణం అదేనంటూ..మాట మారుస్తున్న మాజీలు.. ఇంగ్లండ్ ఓటమికి కారణం అదేనంటూ..england cricket;cricket;india;sri lanka;bcci;2020;interview;icc t20Fri, 12 Mar 2021 10:05:00 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియా-ఇంగ్లండ్ మధ్య ఇటీవల 4 టెస్టుల సిరీస్ ముగిసిన విషయం తెలిసిందే. ఈ సిరీస్‌ను భారత్ 3-1తో కైవసం చేసుకుంది. అయితే సిరీస్ జరుగుతున్నంత సేపూ భారత్‌పై, బీసీసీఐపై ఇంగ్లండ్ మాజీ ఆటగాళ్లు విపరీతంగా అక్కసు వెళ్లగక్కారు. టీమిండియా విజయం సాధించాలనే ఉద్దేశంతోనే బీసీసీఐ ఇలాంటి టర్నింగ్ పిచ్‌లను రెడీ చేసిందని, ఇది టెస్ట్ క్రికెట్‌కు పనికిరాదని నోటికొచ్చినట్లు మాట్లాడారు. భారత బ్యాట్స్‌మెన్ కూడా ఆ పిచ్‌లపై నిలవలేకపోతున్నారని, ఆ పిచ్‌లు ఎంత దారుణంగా ఉన్నాయో చెప్పడానికి ఇదే పెద్ద నిదర్శనమని నీతులు కూడా చెప్పారు.

కానీ నాలుగో టెస్టులో టీమిండియా బ్యాట్స్‌మెన్ అదరగొట్టడం, ఇంగ్లండ్ జట్టు ఏకంగా ఇన్నింగ్స్‌ తేడాతో ఓటమి చవిచూడడంతో వారికి పెద్ద షాక్ తగిలింది. దీంతో అసలు తప్పులపై కాన్‌సన్‌ట్రేషన్ చేయడం మొదలుపెట్టారు. ఈ క్రమంలో వారంతా ఇప్పుడు ఏకంగా ఇంగ్లండ్ క్రికెట్ బోర్డునే టార్గెట్ చేస్తున్నారు. తాజాగా ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ నాసిర్ హుస్సేన్ ఈసీబీపై ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈసీబీ తప్పు వల్లే భారత్ చేతిలో ఓడిపోవల్సి వచ్చిందని మండిపడ్డాడు.

టీమిండియాతో జరిగిన టెస్టు సిరీస్‌ను ఇంగ్లండ్‌ కోల్పోవడానికి ఈసీబీ ప్రవేశపెట్టిన రొటేషన్‌ పాలసీనే ముఖ్య కారణమని నాసిర్‌ హుస్సేన్‌ అభిప్రాయపడ్డాడు. భారత్ సిరీస్‌లో రొటేషన్‌ పాలసీనే మా కొంపముంచిందని, రొటేషన్‌ పాలసీ తప్పుడు నిర్ణయమని, అది ప్రతి సారీ కలిసి రాదన్నాడు. డైలీ మెయిల్ కోసం రాసిన ఓ కాలమ్‌లో నాసిర్‌ హుస్సేన్‌ తన అభిప్రాయాలను పంచుకున్నాడు. 'ఆటగాళ్లను రొటేట్‌ చేయడం అన్ని సమయాల్లో కలిసిరాదు. టీమిండియా పర్యటనకు ముందు శ్రీలంక పర్యటనలో రొటేషన్‌ పాలసీ కలిసి వచ్చింది. అదే టీమిండియాతో సిరీస్‌కు వచ్చేసరికి పూర్తిగా మారిపోయింది. కీలక ఆటగాళ్లు దూరమయ్యారు' అని హుస్సేన్‌ చెప్పుకొచ్చాడు.

ఐపీఎల్‌ 2021 సీజన్‌కు కూడా ఆటగాళ్లు అందుబాటులో ఉండేలా ఈసీబీ చర్యలు తీసుకుంటే బాగుంటుందని నాసిర్ హుస్సేన్ అన్నాడు. ఐపీఎల్‌ 2020 ముగిసి 6 నెలలు కాకుండానే మరో సీజన్‌ సిద్ధంగా ఉందని, ఐపీఎల్‌లో పాల్గొంటే.. ఫార్మాట్‌ వేరైనా టెస్టు క్రికెట్‌ ఆడేందుకు కాస్త అవకాశం ఉంటుందని నాసిర్‌ హుస్సేన్‌ చెప్పుకొచ్చాడు. ఇక మాజీ కెప్టెన్ జెఫ్రీ బాయ్‌కాట్, కెవిన్ పీటర్సన్‌లు కూడా ఇటీవల ఓ ఇంటర్వ్యూలో టెస్ట్ సిరీస్ కోల్పోవడానికి ఈసీబీనే కారణమంటూ మండిపడ్డాడు. రోటేషన్ పద్ధతిని తప్పుబట్టారు.

రొటేషన్‌ పాలసీని గతకొంతకాలంగా ఈసీబీ ఫాలో అవుతుంది. మూడు ఫార్మాట్లలో ఆడే ఆటగాళ్లకు వరుసగా విశ్రాంతిని ఇస్తూ వస్తోంది. దీంతో కీలక పర్యటనలకు స్టార్ ఆటగాళ్లు అందుబాటులో ఉండడం లేదనేది మాజీల వాదన. మరి ఈ వాదనలన్నీ సిరీస్ జరుగుతున్నంత సేపూ వారికి ఎందుకు గుర్తుకురాలేదో ఏమో..! ఇదిలా ఉంటే భారత్-ఇంగ్లండ్‌ మధ్య 5 టీ20ల సిరీస్‌లో భాగంగా మొదటి టీ20 మ్యాచ్‌ నేడు(శుక్రవారం) జరగనుంది. టెస్ట్ సిరీస్ కోల్పోయి వరల్డ్‌‌ టెస్ట్‌‌ చాంపియన్‌‌షిప్‌‌ ఫైనల్ బెర్త్‌ కూడా పోగొట్టుకున్న ఇంగ్లీష్ జట్టు ఎలాగైనా పొట్టి సిరీస్‌లోనైనా సత్తా చాటాలని పట్టుదలగా ఉంది. ఇందుకోసం ఆటగాళ్లు మోతేరా స్టేడియంలోని నెట్స్‌లో చెమటోడ్చుతున్నారు.


చిల్ల‌ర రాజకీయాలు చేయ‌కండి...ఆ నిర్మాత‌లు, పీఆర్ టీంకు బ‌న్నీవాసు వార్నింగ్.!

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>