WomenN.ANJIeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant18871529-4a5a-46f6-b908-31da01389518-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/women/70/pregnant18871529-4a5a-46f6-b908-31da01389518-415x250-IndiaHerald.jpgగర్భధారణ సమయంలో గర్భిణులు చాల జాగ్రత్తలు తీసుకుంటారు. అయితే గర్భిణులు వ్యాయామాలు చేయడం మంచిదని, ఇది తల్లికే కాకుండా పుట్టబోయే బిడ్డకు కూడా మంచి చేస్తుందని నిపుణులు చెబుతుంటారు. గర్భం దాల్చిన తర్వాత వ్యాయామం వల్ల మేలు కంటే కీడే ఎక్కువగా జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు.pregnant;tennis;history;heart;oxygen;hockeyఅమ్మ: గర్భిణులు వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..!?అమ్మ: గర్భిణులు వ్యాయామం చేస్తున్నారా.. అయితే ఇది మీకోసమే..!?pregnant;tennis;history;heart;oxygen;hockeyThu, 11 Mar 2021 15:00:00 GMT
ఇక ప్రీ మెచ్యూర్ డెలివరీ అనగా సాధారణంగా 9 నెలల కంటే ముందే డెలివరీ అయితే, రెండో గర్భాధారణ సమయంలో కఠినమైన వ్యాయామాలను నివారించడమే మంచిది. ఇటువంటి వారు ఎక్కువ విశ్రాంతి తీసుకోవాలని డాక్టర్లు సూచిస్తున్నారు. గర్భస్రావం చరిత్ర ఉన్న మహిళలు లేదా ప్రస్తుతం గర్భధారణలో రక్తస్రావం జరిగిన మహిళలు తొమ్మిది నెలల పాటు తప్పనిసరిగా అదనపు జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భస్రావం సమస్య తలెత్తకుండా ఉండటానికి గర్భందాల్చిన మొదటి 12 వారాల పాటు వ్యాయామం చేయకుండా ఉండాలి.

అంతేకాదు.. గర్భాశయ సమస్యలు ఉన్న మహిళలు ఏవైనా కఠినమైన శారీరక శ్రమ లేదా వ్యాయామం చేస్తే అది రక్తస్రావానికి దారితీస్తుంది. కాబట్టి, వారు వ్యాయామం చేయకపోవడమే మంచిది. గర్భాశయ సంబంధ సమస్య ఉన్న మహిళలు గర్భం దాల్చిన మొదటి మూడు నెలలు అదనపు జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంటుంది. గుండె, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్న మహిళలు అన్ని రకాల ఏరోబిక్ వ్యాయామాలకు దూరంగా ఉండాలని డాక్టర్లు సూచిస్తున్నారు.

కానీ.. ఈ రకమైన వ్యాయామాలతో మీ హృదయ స్పందన రేటు పెరుగుతుంది. తద్వారా, శరీరానికి ఎక్కువ ఆక్సిజన్ అవసరం అవుతుంది. అందువల్ల, అధిక రక్తపోటు, ఉబ్బసం, గుండె, ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యలతో బాధపడుతున్న మహిళలు గర్భాధారణ సమయంలో వ్యాయామానికి దూరంగా ఉండటమే మంచిది. పూర్తి స్థాయిలో ఆరోగ్యంగా ఉంటేనే గర్భధారణ సమయంలో అన్ని రకాల వ్యాయామాలు చేయండి. లేదంటే, మిమ్మల్ని అనేక అదనపు సమస్యలు చుట్టుముట్టే అవకాశం ఉంది. గర్భం దాల్చిన తల్లికి ఈత, చురుకైన నడక, సైక్లింగ్ వంటి తక్కువ శ్రమతో కూడిన వ్యాయామాలు ఉత్తమమైనవి. ఈ సమయంలో కిక్‌బాక్సింగ్, స్క్వాష్, టెన్నిస్, ఫుట్‌బాల్, హాకీ వంటి గాయాలకు అవకాశం ఉన్న క్రీడలకు దూరంగా ఉండండి.


రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్ లోకి డబ్బులు వచ్చేది అప్పుడే..?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - N.ANJI]]>