Healthsravanieditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dayabetis73526169-ef3b-4000-8211-32fa42d39926-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/dayabetis73526169-ef3b-4000-8211-32fa42d39926-415x250-IndiaHerald.jpgమధుమేహం దీన్నే డయబెటీస్, చక్కెర వ్యాధి అని అంటారు. ఈ రోజుల్లో తక్కువ వయస్సు ఉన్నవారిని సైతం ఈ వ్యాధి వేదిస్తోంది. శరీరంలో ఉండే చక్కెర హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, జీవనశైలితో మధుమేహాన్ని జయిస్తున్నారు. అయితే, మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వొద్దు. ఒకసారdayabetis;tara;sugar;ee rojulloఈ లక్షణాలు కనిపిస్తే మీకు మధుమేహం ఉన్నట్లే!ఈ లక్షణాలు కనిపిస్తే మీకు మధుమేహం ఉన్నట్లే!dayabetis;tara;sugar;ee rojulloThu, 11 Mar 2021 04:00:00 GMTఈ రోజుల్లో తక్కువ వయస్సు ఉన్నవారిని సైతం ఈ వ్యాధి వేదిస్తోంది. శరీరంలో ఉండే చక్కెర హెచ్చు తగ్గుల వల్ల ఈ పరిస్థితి ఏర్పడుతుంది. అయితే, మధుమేహాన్ని వ్యాధిగా భావించవద్దు. ఇది కేవలం ఆరోగ్య సమస్య మాత్రమే. సరైన డైట్ పాటిస్తే మధుమేహం పూర్తిగా మాయమవుతుంది. మధుమేహం ఉన్నా సరే ఎక్కువ కాలం జీవించేవాళ్లు ప్రపంచంలో చాలామంది ఉన్నారు. వీరంతా సరైన ఆహార నియమాలు, జీవనశైలితో మధుమేహాన్ని జయిస్తున్నారు. అయితే, మధుమేహం మీపై దాడి చేసే అవకాశాన్ని అస్సలు ఇవ్వొద్దు. ఒకసారి వచ్చిందంటే  దాన్ని అదుపు చేయడం చాలా కష్టం. కాబట్టి ప్రతి ఒక్కరూ మధుమేహం గురించి  ముందస్తు లక్షణాలు  జాగ్రత్తలు గురించి తప్పకుండా తెలుసుకోవలసిందే.


మన శరీరంలో సహజంగానే కొద్ది మొత్తంలో చక్కెర లేదా గ్లూకోజ్ ఉంటుంది. మన శరీరానికి కావాల్సిన శక్తిని ఈ చక్కరే అందిస్తుంది. అయితే చక్కెర స్థాయిలు ఒక నిర్దిష్ట స్థాయిని దాటినప్పుడు ‘హైపర్గ్లైసీమియా’కు దారితీస్తుంది. దీన్నే హైబ్లడ్ షుగర్ అంటారు. దీనివల్ల శరీరంలో అవయవాలు దెబ్బ తింటాయి. ఇంకా చాలా శారీరక సమస్యలు తలెత్తుతాయి. ఆహారాన్ని ఒకేసారి కాకుండా కొద్దికొద్దిగా తింటూ వ్యాయామం చేయడం ద్వారా దీన్ని నియంత్రణలో ఉంచవచ్చు. మీరు డయాబెటీస్‌ను వెంటనే గుర్తించి తగిన చికిత్స అందుకోలేనట్లయితే పరిస్థితి చేయిదాటే ప్రమాదం ఉంది. ఈ కింది లక్షణాల ద్వారా మీరు డయాబెటీస్‌‌ను ముందుగానే గుర్తించవచ్చు. మీరు తగిన విశ్రాంతి, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకుంటున్నా సరే అలసటగా అనిపిస్తుందా? ఎక్కడ పడితే అక్కడ కూలబడుతున్నారా? పని చేస్తున్నప్పుడు నీరసంగా అనిపిస్తుందా? అయితే, తప్పకుండా అది డయాబెటిస్ హెచ్చరికే. మధుమేహం ఎటాక్ చేస్తే.. ఎక్కువ పనిచేయకపోయినా త్వరగా అలసిపోతారు. నిర్జలీకరణకు గురవ్వుతారు.


మీ రక్తంలో చక్కెరస్థాయిలు ఎక్కువగా ఉన్నట్లయితే కిడ్నీలు చక్కెరను సక్రమంగా ఫిల్డర్ చేయలేవు. దీంతో చక్కెర మూత్రంలో పేరుకుపోతుంది. ఫలితంగా పదే పదే మూత్రం వస్తుంది. ఇది బ్యాక్టీరియల్, ఈస్ట్ ఇన్ఫెక్షన్‌కు కూడా దారితీయొచ్చు. సాధారణం కంటే ఎక్కువ సార్లు మీరు మూత్రానికి వెళ్తున్నా.. లేదా మీ రహస్యాంగాలు దురద పుడుతున్నా తప్పకుండా వైద్యుడిని సంప్రదించాలి.కొందరిలో డయాబెటీస్ ఏర్పడినట్లయితే అకస్మాత్తుగా బరువు తగ్గుతారు. ఎందుకంటే  మీ శరీరం శక్తిని అందించేందుకు గ్లూకోజ్‌ను సమర్థవంతంగా ఉపయోగించలేదు. దీనివల్ల శరీరంలోకి కొవ్వు కరగడం మొదలవుతుంది. అయితే, చాలామందిలో ఈ లక్షణం కనిపించదు. కొందరు అధిక బరువుతో కూడా డయాబెటీస్‌కు గురవ్వుతారు.అధిక చక్కెర స్థాయిలు కంటి చూపును కూడా దెబ్బతీస్తాయి.డయాబెటీస్ ముదిరితే పూర్తిగా చూపు మందగించే ప్రమాదం ఉంది. మీ కంటి చూపులో అకస్మాత్తుగా మార్పులు ఏర్పడినట్లయితే తప్పకుండా వైద్యుడిని సంప్రదించండి.


రైతులకు గుడ్ న్యూస్.. అకౌంట్ లోకి డబ్బులు వచ్చేది అప్పుడే..?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - sravani]]>