Sportsyekalavyaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/team-indiae63027c8-9f30-496f-9e3e-12b646a65c95-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/sports/libra_libra/team-indiae63027c8-9f30-496f-9e3e-12b646a65c95-415x250-IndiaHerald.jpgటీమిండియా చేతిలో టెస్టుల్లో దారుణంగా ఓడిన ఇంగ్లండ్ జట్టు ఎలాగైనా టీ20 సిరీస్‌లో గెలిచి లెక్క సరిచేయాలని పట్టుదలగా ఉంది. దీనికోసం తమ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అందరినీ పిలిపించుకుంది. వారితో ఆడి ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఇండియా మాత్రం తమ రిజర్వ్ బెంచ్ బలాన్ని తెలుసుకునే పనిలో ఉంది. ఆసీస్‌తో జరిగిన టెస్టుల్లో రిజర్వ్ బలంతోనే ..team india;rohit;audi;rohit sharma;india;sri lanka;capital;icc t20;paruguటీ20 చరిత్రలో ఇండియా, ఇంగ్లండ్ ఎక్కడ..? ఎవరి సత్తా ఎంత..!టీ20 చరిత్రలో ఇండియా, ఇంగ్లండ్ ఎక్కడ..? ఎవరి సత్తా ఎంత..!team india;rohit;audi;rohit sharma;india;sri lanka;capital;icc t20;paruguWed, 10 Mar 2021 20:40:00 GMTఇంటర్నెట్ డెస్క్: టీమిండియా చేతిలో టెస్టుల్లో దారుణంగా ఓడిన ఇంగ్లండ్ జట్టు ఎలాగైనా టీ20 సిరీస్‌లో గెలిచి లెక్క సరిచేయాలని పట్టుదలగా ఉంది. దీనికోసం తమ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్‌మెన్ అందరినీ పిలిపించుకుంది. వారితో ఆడి ఎలాగైనా సిరీస్ దక్కించుకోవాలని చూస్తోంది. మరోవైపు ఇండియా మాత్రం తమ రిజర్వ్ బెంచ్ బలాన్ని తెలుసుకునే పనిలో ఉంది. ఆసీస్‌తో జరిగిన టెస్టుల్లో రిజర్వ్ బలంతోనే చారిత్రక సిరీస్ విజయం సాధించిన టీమిండియా.. ఇంగ్లండ్‌తో టెస్టుల్లో కూడా అదే జోరు కొనసాగించింది.

ఇరు జట్ల మధ్య టీ20 సిరీస్ శుక్రవారం నుంచి ప్రారంభం కానుంది. కాగా.. టీ20ల్లో ఇరు జట్ల బలాబలాలు చాలా వరకు సరిసమానంగా ఉన్నాయి. ముఖ్యంగా ఇంగ్లండ్ ఇప్పటికే ఐసీసీ ప్రపంచ టీ20 ర్యాకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానంలో ఉంది. కాగా ఇప్పటివరకు ఇరు జట్లు 14 సార్లు టీ20ల్లో పాల్గొనగా.. అందులో భారత్ 7 సార్లు గెలిస్తే, ఇంగ్లండ్ కూడా 7 సార్లు విజయం సాధించింది. అయితే స్వదేశాల్లో జరిగిన మ్యాచ్‌లలోనే రెండు జట్లూ ఎక్కువమ్యాచులు గెలిచాయి.

అయితే ఇంగ్లండ్, భారత్ కాకుండా బయటి పిచ్‌లపై జరిగిన మ్యాచ్‌లలో మాత్రం ఇండియాదే పైచేయి. 2007లో డర్బన్‌లో జరిగిన టీ20లోనూ, ఆ తరువాత శ్రీలంక రాజధాని కొలంబోలో 2012లోనూ ఇంగ్లండ్‌పై టీమిండియా విజయం సాధించి సత్తా చాటింది. కాగా.. చివరిగా ఇంగ్లండ్‌లోని బ్రిస్టోల్‌లో జరిగిన టీ20 మ్యాచ్‌లో టీమిండియా ఇంగ్లండ్‌ను చిత్తుగా ఓడించింది. 199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత జట్టు.. రోహిత్ శర్మ అజేయ శతకంతో మరో ఓవర్ మిగిలుండగానే లక్ష్యాన్ని ఛేదించి ఘన విజయం సాధించింది.

ఇదిలా ఉంటే అహ్మదాబాద్‌లోని మొతేరా స్టేడియంలో మొత్తం 5 టీ20ల సిరీస్ జరగనుంది. తొలి మ్యాచ్ శుక్రవారం ప్రారంభం కానుంది. దీనికోసం ఇప్పటికే ప్రాక్టీస్ పూర్తి చేసిన టీమిండియా టెస్టుల్లోలానే టీ20ల్లో కూడా ఇంగ్లండ్‌ను చిత్తు చేయాలని ఉవ్విళ్లూరుతోంది. కాగా.. కనీసం ఈ సిరీస్‌లోనైనా నెగ్గి పరువు నిలబెట్టుకోవాలని ఇంగ్లండ్ అనుకుంటోంది. అయితే ఈ సిరీస్ ఇండియాలో జరుగుతుండడం భారత్‌కు బాగా కలిసొచ్చే  అంశంగా కనిపిస్తోంది. మరి టీమిండియా ఈ సిరీస్ కూడా గెలిచి ఇంగ్లండ్‌పై పూర్తి స్థాయి ఆధిపత్యం చెలాయిస్తుందేమో చూడాలి.


అసలు నిజాలు బయట పెట్టిన జేసీ...?

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - yekalavya]]>