Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/egg3a3a1065-20cc-4634-9170-82ee70447c3e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/egg3a3a1065-20cc-4634-9170-82ee70447c3e-415x250-IndiaHerald.jpgసంపూర్ణ పోషకాల నిలయం గుడ్డు. అయితే తెల్లసొన తిని, పచ్చసొనను పడేసే వాళ్లు చాలా మంది. అది తింటే బరువు పెరుగుతామని అనుకుంటారు. అందులో కొలెస్ట్రాల్‌ ఉండడమే అలా అనుకోవడానికి కారణం. అయితే పచ్చసొనలో కొలెస్ట్రాల్‌ ఉన్నప్పటికీ దీన్ని తినడం వల్ల రక్తంలో కొవ్వు శాతం పెరగడం లేదని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతే కాదు పచ్చసొనలో కేలరీలు కూడా తక్కువే ఉంటాయి. కాబట్టి తిన్నా బరువు పెరుగుతారన్న బెంగ లేదు. నిశ్చింతగా గుడ్డు మొత్తం తినొచ్చు. పచ్చసొనలో ఇనుము శాతం ఎక్కువ. దాన్ని మన శరీరం సులువుగా గ్రహిస్తుంది. గుegg;health;poorna;vitamin a;egg;vitamin;heart;doctor;cholesterolగుడ్డులోని పచ్చసొన తినడం వల్ల ప్రయోజనాలు ?గుడ్డులోని పచ్చసొన తినడం వల్ల ప్రయోజనాలు ?egg;health;poorna;vitamin a;egg;vitamin;heart;doctor;cholesterolWed, 10 Mar 2021 09:00:00 GMT

పలు జీవక్రియలు సక్రమంగా జరిగేందుకు గుడ్డులోని పోషకాలు సహకరిస్తాయి. రోజుకు ఒక గుడ్డు తినేవారిలో పక్షవాతం వచ్చే ముప్పు కూడా తక్కువ. కొలెస్ట్రాల్ ని అర్ధం చేసుకోవడం కొద్దిగా కష్టం. మీరు ఎక్కువ కొలెస్ట్రాల్ తీసుకుంటే బాడీ తక్కువ కొలెస్ట్రాల్ ప్రొడ్యూస్ చేస్తుంది. అందుకనే, ఎగ్స్ తినడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ ఏం పెరిగిపోవు. ఇక్కడ ఎగ్స్ యొక్క హెల్త్ బెనిఫిట్స్ ఏమిటి, రోజు ఎన్ని ఎగ్స్ తీసుకోవచ్చు అన్న విషయాలు వివరంగా ఉన్నాయి, చూడండి.ఒక లార్జ్ బాయిల్డ్ ఎగ్ లో విటమిన్ ఏ, విటమిన్, బీ5, బీ12, బీ2, ఫోలేట్, ఫాస్ఫరస్, సెలీనియం ఉంటాయి. అంతే కాక, విటమిన్ డీ, ఈ, కే, బీ6, కాల్షియం, జింక్ కూడా ఉంటాయి.


వీటిని ఈజీగా పర్ఫెక్ట్ ఫుడ్ అని అనుకోవచ్చు. మీకు అవసరమైన ప్రతి న్యూట్రియెంట్ అంతో ఇంతో ఎగ్స్ లో ఉంటుంది.మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువ ఉన్న వారికి గుండె జబ్బులు, స్ట్రోక్, ఇతర ఆరోగ్య సమస్యలు వచ్చే రిస్క్ తక్కువగా ఉంటుంది. ఎగ్స్ తినడం వల్ల మంచి కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరుగుతాయి.కోలిన్ అనే పేరుతో ఒక న్యూట్రియెంట్ ఉందని కూడా చాలా మందికి తెలియదు, కానీ అది చాలా ఇంపార్టెంట్. ఈ కోలిన్ ని బీ విటమిన్స్ తో కలిపి చెప్తారు. ఇది సెల్ మెంబ్రేన్ ని బిల్డ్ చేయడానికి హెల్ప్ చేస్తుంది. ఈ కోలిన్ ఎగ్స్ లో సమృద్ధిగా లభిస్తుంది. ఎగ్స్ తిన్నాక త్వరగా ఆకలి వేయదు.


 కడుపు నిండుగా ఉన్నట్లు అనిపిస్తుంది. దాంతో తరువాత తక్కువ క్యాలరీలు తీసుకుంటాం. రెగ్యులర్ గా ఎగ్స్ తినడం వెయిట్ లాస్ కి హెల్ప్ చేస్తుందని నిపుణులు అంటున్నారు. అయితే, రోజుకి ఎన్ని ఎగ్స్ తినవచ్చు అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అయితే, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తులు రోజుకి మూడు పూర్తి గుడ్లు తినవచ్చని పరిశోధనలు చెబుతున్నాయి. అయితే, డయాబెటీస్ వంటి కొన్ని సమస్యలు ఉన్న వారికి రోజుకి మూడు గుడ్లు మంచిది కాదు. అందుకే, ఈ అలవాటు చేసుకునే ముందు ఒక సారి మీ డాక్టర్ తో సంప్రదించి వారి సూచనల ప్రకారం చేయడం అవసరం.


నాగార్జున‌సాగ‌ర్ కాంగ్రెస్ అభ్య‌ర్థిని ప్ర‌క‌టించిన సోనియాగాంధీ

తిరుప‌తి ఉప ఎన్నిక తేదీ ప్ర‌క‌టించిన ఈసీ

ఆర్ఆర్ఆర్ లో ఆ ఒక్క సీన్ చాలు .... బాహుబలి పనికిరాదు .....??

నా పక్కన ఉంటూనే నా బిజినెస్ లనీ, నా కెరీర్ మొత్తాన్ని నాశనం చేశారు : గోవింద

హెరాల్డ్ సెటైర్:చంద్రబాబులా జగన్ ను మార్చేస్తారా...?

చంద్రబాబుకి 23 ఇంత బ్యాడ్ గా ఉందా...?

ఆస్కార్ నామినేషన్లు వచ్చేశాయి.. పూర్తి లిస్ట్ ఇదే !




Freelance/ Job Opportunity english authors,

Be part of prestigious India Herald Group, Send your political, entertainment article samples to care@indiaherald.com

CALL 9100 181 181 for further details.

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>