PoliticsVUYYURU SUBHASHeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/politics/politics_analysis/will-the-former-minister-give-a-shock-to-the-tdp9a4b02c7-4c9d-46cb-9aec-54e2972ef139-415x250-IndiaHerald.jpgఇక మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను కూడా గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వ‌దిలేశారు. ఉత్త‌రాంధ్ర ఉక్కు ఉద్య‌మం జ‌రుగుతుంటే అక్క‌డ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో కూడా తెలియ‌ట్లేదు. ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రం సొంతంగా నిరాహార దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి. సీమ‌లో గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో బాల‌య్య కూడా బాబు తీరుతో ఏమంత సంతృప్తితో లేరు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ని తాను చేసుకుంటూ.. సినిమాలు చేసుకుంటున్నారు. అటు పయ్యావుల కేశవ్ కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు. ఇక చంద్రబాబు అధికారంలో ఉండగా.. మంత్రులుగా tdp chandra babu;cbn;ntr;nani;tiru;payyavula keshav;2019;mp;kesineni nani;mla;letter;nandamuri taraka rama rao;party;mantraబాబు అంటే పార్టీ నేత‌ల‌కు ఇంత పిచ్చ లైటా... !బాబు అంటే పార్టీ నేత‌ల‌కు ఇంత పిచ్చ లైటా... !tdp chandra babu;cbn;ntr;nani;tiru;payyavula keshav;2019;mp;kesineni nani;mla;letter;nandamuri taraka rama rao;party;mantraMon, 08 Mar 2021 09:19:00 GMTఎన్టీఆర్ నుంచి పార్టీ స్వాధీనం చేసుకున్నప్ప‌టి నుంచి చంద్రబాబు టీడీపీలో చెప్పింది వేదం.. చేసింది శాస‌నం అన్న‌ట్టుగా ఉండేది. నాటి ఉమ్మ‌డి రాష్ట్రం నుంచి.. నేడు రాష్ట్ర విభ‌జ‌న జ‌రిగిన‌ప్ప‌టి నుంచి బాబుకు పార్టీలో తిరుగులేదు. ఎన్టీఆర్ ఫ్యామిలీలో ఎవ‌రిని ఎప్పుడు సైడ్ చేయాలో ?  ఎవ‌రిని ఎలా త‌న వైపున‌కు తిప్పుకోవాలో చేయాల్సిందంతా చేశారు. క‌ట్ చేస్తే 2014లో చంద్ర‌బాబు అధికారంలోకి వ‌చ్చి ముఖ్య‌మంత్రి అయిన‌ప్ప‌టి నుంచే ఆయ‌న‌కు పార్టీపై క్ర‌మ‌క్ర‌మంగా ప‌ట్టు త‌ప్ప‌డం ప్రారంభ‌మైంది. ముఖ్యంగా అవినీతి, ప‌ద‌వుల విష‌యంలో చంద్ర‌బాబునే చాలా మంది బెదిరించ‌డం ప్రారంభించారు. అప్ప‌ట్లో పార్టీ అధికారంలో ఉండ‌డంతో కాస్త మొత్తని వాళ్లను బెదిరింపులతో నోరు మూయించారు.. మిగిలిన వాళ్లు మాత్రం బాబును లెక్క చేయకుండా త‌మ ప‌ని తాము చేశారు.

2019 ఎన్నిక‌ల్లో ఎప్పుడు అయితే పార్టీ ఘోరంగా ఓడిపోయిందో అప్ప‌టి నుంచి బాబును నేత‌లు లెక్క చేయ‌డ‌మే మానేశారు. కొంద‌రు బాబును ఇష్ట‌మొచ్చిన‌ట్టు తిడుతూ పార్టీ మారిపోతున్నారు. పార్టీలో ఉన్నోళ్లు సైతం ఆయ‌న్ను బెదిరింపుల‌కు, బ్లాక్ మెయిల్‌కు గురి చేస్తున్నారు. ఎంపి కేశినేని నాని లాంటి వాళ్లు నా బ‌లంతోనే నేను గెలిచా అని అంటున్నా బాబు వారిపై ఏ మాత్రం చ‌ర్య‌లు తీసుకోలేని స్థితిలో ఉన్నారు. పార్టీలో ప్ర‌స్తుతం ఉన్న ఎమ్మెల్యేలు, నేత‌లు కూడా బాబుపై తీరుపై గుస్సాతోనే ఉన్నారు. అంత‌ర్గ‌త చ‌ర్చ‌ల్లో వారు బాబుపై అస‌హ‌నం వ్య‌క్తం చేస్తున్నా ఆయ‌న కిమ్మ‌న‌డం లేద‌ట‌.

కీల‌క‌మైన పంచాయ‌తీ ఎన్నిక‌ల‌ను పార్టీలోనే చాలా మంది నేత‌లు ప‌ట్టించుకోలేదు. ఇక మునిసిప‌ల్ ఎన్నిక‌ల‌ను కూడా గెలిచిన ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు వ‌దిలేశారు. ఉత్త‌రాంధ్ర ఉక్కు ఉద్య‌మం జ‌రుగుతుంటే అక్క‌డ ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నారో కూడా తెలియ‌ట్లేదు. ఒకే ఒక్క ఎమ్మెల్యే మాత్రం సొంతంగా నిరాహార దీక్షకు కూర్చోవాల్సిన పరిస్థితి. సీమ‌లో గెలిచిన ఇద్ద‌రు ఎమ్మెల్యేల్లో బాల‌య్య కూడా బాబు తీరుతో ఏమంత సంతృప్తితో లేరు. ఆయ‌న నియోజ‌క‌వ‌ర్గంలో త‌న ప‌ని తాను చేసుకుంటూ.. సినిమాలు చేసుకుంటున్నారు. అటు పయ్యావుల కేశవ్ కూడా పార్టీకి దూరంగానే ఉంటున్నారు.

ఇక చంద్రబాబు అధికారంలో ఉండగా.. మంత్రులుగా ఓ వెలుగు వెలిగిన నారాయ‌ణ‌, గంటా లాంటి వాళ్లు ఇప్పుడు బ‌య‌ట‌కే రావ‌డం లేదు. పార్టీ కార్య‌క్ర‌మాల్లో పాల్గొనాల‌ని ఆదేశించినా కూడా కొంద‌రు లైట్ తీస్కొంటున్నారు. సీనియ‌ర్ల సంగ‌తి ప‌క్క‌న పెడితే ఉన్నంత‌లో జూనియ‌ర్లే కాస్త బెట‌ర్ అనిపించుకుంటున్నారు. చివ‌ర‌కు బెజ‌వాడ‌లో కొంద‌రు నేత‌లు బాబునే కంట్రోల్ చేసేలా స‌క్సెస్ అయ్యార‌ని పార్టీ నేత‌లే గుస‌గుసలాడుకుంటున్నారు. ఏదేమైనా ఒక‌ప్పుడు క‌ను చూపుల‌తో పార్టీని కంట్రోల్ చేసిన బాబు.. ఇప్పుడు అరిచీ గీపెడుతున్నా పార్టీ కీల‌క నేత‌లే చెవిటోడి ముందు శంఖం ఊదిన‌ట్టుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. 


womens-day : 21 రోజుల్లో 75 వేల మంది కడుపు నింపిన బాపుగారి బొమ్మ.!

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - VUYYURU SUBHASH]]>