Healthkalpanaeditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-benefits771f90d8-a8bd-4589-98a6-c25c2a28df6e-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/health/movies_news/health-benefits771f90d8-a8bd-4589-98a6-c25c2a28df6e-415x250-IndiaHerald.jpg ఆరోగ్యం గురించి చాలామంది పెద్దగా పట్టించుకోరు. అంతా బాగానే ఉందిలే అని ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తూ ఉంటారు. రోజు బాగా నిద్ర పోవాలని అనుకుంటూ ఉంటారు. కానీ పాటించ లేక పోతుంటారు. ఎలా చాలామంది చేస్తూ ఉంటారు. కానీ ఇక నుంచి అయినా ఆరోగ్యానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకుందాం. కనీసం ఈ రోజు ఏడు లేదా ఎనిమిది గంటలు నిద్ర పోవడం చాలా మంచిది. అలాగే ప్రతిరోజు 45 నిమిషాలు యోగా చేయడం చాలా మంచిది. ఇంకా మనము డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం... health benefits;thulasi;vitamin c;vitamin;heart;tulasi;doctor;garlic;cumin;cholesterol;yoga;pepper powder;shaktiఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి... ఇక మీరు వజ్రమే...!ఈ ఆరోగ్య సూత్రాలు పాటించండి... ఇక మీరు వజ్రమే...!health benefits;thulasi;vitamin c;vitamin;heart;tulasi;doctor;garlic;cumin;cholesterol;yoga;pepper powder;shaktiMon, 08 Mar 2021 10:00:00 GMTయోగా చేయడం చాలా మంచిది. ఇంకా మనము డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా ఉండాలంటే కొన్ని ఆరోగ్య సూత్రాలు పాటించాలి. అవి ఏమిటో ఇప్పుడు చూద్దాం...

 ప్రతిరోజు రెండు సార్లు బ్రెష్ చేసుకోవడం చాలా మంచిది. అలాగే వేడి నీళ్ళు త్రాగడం వల్ల బరువు కంట్రోల్ అవుతుంది. ఈరోజు ఆరు గ్లాసులు మంచినీళ్లు తాగడం మరిచిపోకూడదు. అలాగే పెరట్లో దొరికే తులసి ఆకులను తినడం వల్ల ఆరోగ్యానికి మంచిది.

 దాల్చిన చెక్కను ఆహారంలో భాగం చేసుకోవడం చాలా మంచిది. ఎందుకంటే దాల్చిన చెక్కలో ప్రొటీన్లు,  పీచు, సోడియం, విటమిన్ సి అధికంగా ఉంటాయి. కాకుండా శరీరానికి  కావాల్సిన పోషకాలు కూడా ఉన్నాయి. ఇది శరీరంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. కొలెస్ట్రాల్ స్థాయిని కూడా తగ్గిస్తుంది.

 అజీర్ణ వ్యాధులకు అల్లం చక్కటి ఔషధం. ఉదర సంబంధ వ్యాధులకు అల్లం మంచి మందులా పనిచేస్తుంది. వికారం, వాంతులు, విరేచనాలు వంటి వాటకి చెక్కు పెడుతుంది.

 పచ్చి వెల్లుల్లి తినడం వల్ల రక్తపోటు అదుపులోకి వస్తుంది. వెల్లుల్లిలో యాంటీ ఇన్ఫ్లమేటరీ నాలుగు ఉండటం వల్ల కీళ్ల నొప్పులు తగ్గుతాయి. శరీరంలోని కొవ్వును నివారించడానికి యాంటీ ఆక్సిడెంట్లు వెల్లుల్లి లో మెండుగా ఉన్నాయి.

 లవంగాల లో యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు అధికంగా ఉండటం వల్ల దంతాలు దృఢంగా ఉండేటట్లు చేస్తాయి. అంతేకాకుండా నోటి  శ్వాసను తాజాగా వుంచుతాయి. గుండె ఆరోగ్యానికి కూడా చాలా మంచివి.

 జీర్ణశక్తి బాగా పెరగడానికి జీలకర్ర ఎంతో దోహదపడుతుంది. అంతేకాకుండా ఆకలిని పుట్టిస్తుంది. శ్వాసక్రియ  వ్యవస్థకు ఎలాంటి రోగాలు రాకుండా కాపాడుతుంది.

 ఆవాలు లో శరీరానికి కావలసిన విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి కండరాల నొప్పులు, నొప్పులను తగ్గిస్తాయి. శ్వాస అవరోధాలను దూరం చేస్తాయి.

 నల్ల మిరియాలను వాడడం వల్ల జీర్ణక్రియ సక్రమంగా జరుగుతుంది. ఆహారం తేలికగా జీర్ణం కావడానికి హైడ్రోక్లోరిక్ విడుదల చేయమని ఉదరాన్ని ప్రేరేపిస్తాయి. బ్లాక్ కాఫీలో మిరియాల పొడి కలుపుకొని తాగడం వల్ల రుతు  క్రమంలో వచ్చే ఇబ్బందుల నుంచి ఉపశమనం కలుగుతుంది.

 ఊపిరితిత్తుల్లో కఫాన్ని కరిగించి శ్లేస్మాన్ని తొలగించే శక్తి యాలకులు ఉంది. శ్వాస సంబంధ వ్యాధులతో బాధపడే పిల్లలకు పాలల్లో యాలకుల పొడి వేసి తాగించడం మంచిది. అజీర్ణం, కడుపుబ్బరం సమస్యలను తగ్గిస్తాయి.


తెలంగాణా కాంగ్రెస్ ముందు మంచి అవకాశం...?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: తెలంగాణాలో గుర్రం, గజం, గిత్తల మధ్య పోరు! సాగర్ ఎన్నికలో మజా ! మజానే - రాహుల్ గాంధీ నిర్ణయమే ఆలస్యం

హెరాల్డ్ సెటైర్ : ఇపుడు కూడా పాత పాటేనా ?

నాని వర్సెస్ పవన్.. మరోసారి ఆట మొదలైంది..




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - kalpana]]>