CrimeSpydereditor@indiaherald.comhttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/fish643fcecb-eac1-425d-9237-6d40daf76540-415x250-IndiaHerald.jpghttps://apherald-nkywabj.stackpathdns.com/ImageStore/images/lifestyle/taurus_taurus/fish643fcecb-eac1-425d-9237-6d40daf76540-415x250-IndiaHerald.jpgఅక్క‌డి చేప‌లు తింటే ఇక అంతే సంగ‌త‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. కోడి వ్యర్థాల‌ను తిన్న చేప‌ల‌ను మ‌నుషుల ఆరోగ్యం దెబ్బ‌తింటుంద‌ని వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. వాస్త‌వానికి ఆరోగ్యకరమైన మేత వేసి చేపలను పెంచాలి. కానీ కుళ్లిన కోళ్ల మాంసం, పశు వ్యర్థాలు తిని పెరిగిన చేపలు విషతుల్యమే. ఇవి తింటే ప్రమాదకరమైన వ్యాధులు ప్రబలుతాయి. సంపాదనే లక్ష్యంగా చేపలు పెంచుతున్నవారికి ఇవేవి పట్టవు. మంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పొలంపెల్లి గ్రామ సమీపాన చికెన్ లో వుండే వ్యర్థ పదార్థాలను సేకరించి పెద్ద ఎత్తున చేపల పfish;godavari river;district;pond;mandalam;chicken;fish;mancherialఅక్క‌డి చేప‌లు తింటే ఇక అంతే... అంత డేంజ‌ర్ అంటా..?!అక్క‌డి చేప‌లు తింటే ఇక అంతే... అంత డేంజ‌ర్ అంటా..?!fish;godavari river;district;pond;mandalam;chicken;fish;mancherialMon, 08 Mar 2021 10:30:43 GMTమంచిర్యాల జిల్లా భీమారం మండలంలోని పొలంపెల్లి గ్రామ సమీపాన చికెన్ లో వుండే వ్యర్థ పదార్థాలను సేకరించి పెద్ద ఎత్తున చేపల పెంపకం చేపడుతున్నారు. కుళ్లిన కోడి మాంసంతో పాటు పశువుల వ్యర్థాలను చేపలకు దాణాగా అందిస్తున్న‌ట్లుగా అధికారుల త‌నిఖీల్లో వెల్ల‌డైంది.  


పక్కనే గోదావరి ఉండడంతో వీటిని ‘గంగ చేపలుగా చెప్పి అమ్ముకొని సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి చేపలు తింటే ఆరోగ్యానికి మంచిదని డాక్టర్లు చెప్తారు. కానీ చికెన్ వేస్టేజ్ తో పెంచిన ఈ చేపలు తింటే మాత్రం రోగాలు రావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు. చేప‌ల పెంప‌కంలో వాటికిపెట్టే ఆహారం ఎంతో కీల‌కం. చేప‌ల‌కు త‌వుడు, వేరుశెన‌గ చెక్క‌, ప‌త్తిపిండి, మొక్కజొన్న పిండి. ఇప్పుడు కొత్త‌గా పిల్లెట్స్‌లాంటి వాటిని మేత‌గా వేస్తుంటారు. వీటికి తోడు చెరువులో మ‌ట్టి కూడా చేప‌ల‌కు బ‌ల‌మైన ఆహారంగా ఉండ‌టంతో పేడ‌, కోడిపెంట‌ను కూడా మేత‌గా ఇస్తున్నారు.అయితే, ఇలా చేప‌ల పెంప‌కం చేస్తే అవి పెర‌గ‌డానికి చాలా రోజుల స‌మ‌యం ప‌డుతుంది.


పైగా ఇప్పుడు మేత ధ‌ర‌లు భారీగా పెర‌గ‌డంతో త‌క్కువ ఖ‌ర్చుతో ఎక్కువ సంపాదించాల‌ని అత్యాశ‌తో కొంద‌రు అడ్డ‌దారులు తొక్కారు. చేప‌ల‌కు కోడి వ్య‌ర్థాల‌ను మేత‌గా వేస్తున్నారు.శాఖాహారంతో పోలిస్తే కోడి వ్య‌ర్థాల ధ‌ర త‌క్కువే. కోడి వ్య‌ర్థాల‌ను నాలుగు ప్టాస్టిక్ డ్ర‌మ్ముల్లో నింపి ఆటోల్లో తీసుకెళ్తే ప‌ది ఎక‌రాల చేప‌ల‌కు ఆహారంగా సరిపోతుంది. వీటి ఖ‌రీదు సుమారు రూ.15వేలు ఉంటుంది. చేప‌ల ఎదుగుద‌ల‌కు ఈ మాంసాన్ని ఎక్కువ‌గా వాడుతున్నారు.






బీజేపీకి స‌బ్రహ్మ‌ణ్య‌స్వామి ప్ర‌శ్న‌లు...మోదీని ఇర‌కాటంలో పెడుతున్నారుగా..?

దిల్ రాజ్ రాంగ్ జడ్జిమెంట్ !

పుర పోరు: బెజ‌వాడ‌లో ఈ స‌స్పెన్స్ ఏంటి జ‌గ‌న్ ?

పుర పోరు: రావాలి ప్ర‌భాక‌ర్‌... కావాలి ప్ర‌భాక‌ర్‌

పుర పోరు: ఆ ఇద్ద‌రికి స‌రెంబ‌ర్ అయిన చంద్ర‌బాబు ?

పురపోరు: విశాఖలో అసలైన కుంభకోణం ఇదే..

ఎడిటోరియల్: సాగర్ ఉపఎన్నికలో రేసుగుర్రం, మదగజం, పోట్లగిత్త మధ్య తీవ్రపోరు తప్పదు! రాహుల్ నిర్ణయం?




ఉద్యోగ అవకాశం

సినిమా , రాజకీయ, వినోద వార్తలు వ్రాయగల సత్తా, శక్తాసక్తులు మీకుంటే... ఇండియా హెరాల్డ్ గ్రూప్ లో రైటర్ / పాత్రికేయునిగా మీకు అవకాశం ఉంది. నేడే మీ ప్రొఫైల్ ను, , మీరు ఇప్పటివరకూ వ్రాసిన వార్తలలో బెస్ట్ శాంపిల్ ను ఇప్పుడే పంపండి.

Care@indiaherald.com
04042601008

సోర్స్: ఇండియాహెరాల్డ్.కామ్ - Spyder]]>